Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఎన్డీఏ పక్ష నేత మోదీ

. ఏకగ్రీవంగా ఎన్నుకున్న భాగస్వామ్య పక్షాలు
. మద్దతు లేఖలు సమర్పించిన నితీశ్‌, చంద్రబాబు, పవన్‌
. రేపు మరోసారి భేటీ… హాజరు కానున్న కూటమి ఎంపీలు
. ప్రభుత్వ ఏర్పాటుపై రాష్ట్రపతిని కోరనున్న నేతలు
. 9న నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం

న్యూదిల్లీ : జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) పక్ష నేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాని నివాసంలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ఎన్డీఏ పక్షాల నేతలు మోదీని ఎన్నుకున్నారు. ఇందు కోసం చేసిన తీర్మానంపై టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ నేత నితీశ్‌కుమార్‌, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సహా 21 మంది నేతలు సంతకాలు చేశారు. సుమారు 16 భాగస్వామ్య పార్టీలు ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు లేఖలను అందించాయి. కాగా ఈ నెల 7వతేదీ శుక్రవారం మరోసారి ఎన్డీఏ పక్షాలు భేటీ కాబోతున్నాయి. దీనికి ఆయా పక్షాల నుంచి గెలుపొందిన ఎంపీలు కూడా హాజరవుతారు. అదేరోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుండగా… అనంతరం ఎన్డీఏ పక్షాల సమావేశం జరుగనుంది. ఆ తర్వాత ఎన్డీఏ నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ కూటమిని ఆహ్వానించాలని కోరనున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన బలం తమకు ఉందని చెబుతూ భాగస్వామ్య పార్టీల మద్దతుతో కూడిన లేఖను రాష్ట్రపతికి అందజేస్తారు. రాష్ట్రపతి సానుకూలంగా స్పందిస్తే… ఈ నెల 9వ తేదీన నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. తొలుత ఎన్డీఏ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై కూటమి పార్టీలు సుదీర్ఘంగా చర్చించాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీనియర్‌ నేతలు అమిత్‌షా, నితిన్‌ గడ్కరీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, నితీశ్‌ కుమార్‌, చిరాగ్‌ పాశ్వాన్‌, ఏక్‌నాథ్‌ షిండే తదితర నేతలు పాల్గొన్నారు. ఆర్‌ఎల్డీ, యూపీపీఎల్‌, హిందుస్తాన్‌ అవామీ మోర్చా తదితర పార్టీలకు చెందిన నేతలు కూడా పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాలు, తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ ఏర్పాటుపై నేతలు గంటన్నరపాటు చర్చించారు. ఈ సమావేశంలో కీలక తీర్మానాలు ఆమోదించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ ప్రజా సంక్షేమ విధానాల వల్ల గత 10 ఏళ్లలో 140 కోట్ల మంది పౌరులున్న భారత దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం పేదలు, మహిళలు, యువత, రైతులు, దోపిడీకి గురవుతున్న అణగారిన వర్గాలకు, అణచివేతకు గురైన భారతీయ పౌరులకు సేవ చేయడానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించారు. భారతదేశ వారసత్వాన్ని పరిరక్షించడం ద్వారా భారతదేశం సర్వతోముఖాభివృద్ధి కోసం భారతదేశ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తూనే ఉండాలని తీర్మానించారు. దాదాపు 6 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత దేశ ప్రజలు వరుసగా మూడోసారి సంపూర్ణ మెజారిటీతో బలమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నట్లు ఎన్డీఏ నేతలు పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ఐక్యంగా పోరాడి విజయం సాధించినట్లు తెలిపారు.
మోదీ రాజీనామా
ఎన్డీఏ సమావేశానికి ముందు ప్రధాని మోదీ తన రాజీనామాను రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సమర్పించగా… ఆమె వెంటనే ఆమోదించారు. మంత్రివర్గంతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న మోదీ రాష్ట్రపతికి రాజీనామా సమర్పించారు. అలాగే, 17 వ లోక్‌సభను రద్దు చేయాలని రాష్ట్రపతి ముర్ముకు మోదీ సిఫార్సు చేశారు. రాష్ట్రపతి దీనిని అంగీకరించి, తాత్కాలిక ప్రధానమంత్రిగా కొనసాగాలని మోదీని కోరారు. మరోవైపు బుధవారం ఉదయం కేంద్ర కేబినెట్‌ చివరిసారిగా సమావేశమైంది. ప్రధాని మోదీ అధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో 17వ లోక్‌సభను రద్దు చేస్తూ తీర్మానం చేశారు. దాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపించారు. ముర్ము తీర్మానాన్ని ఆమోదిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశాక కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు వీలవుతుంది. అంతకుముందు లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మెజారిటీ సీట్లు సాధించిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై సమీక్షించేందుకు ప్రధాని అధ్యక్షతన దిల్లీలో కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. తదుపరి కార్యాచరణపై ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం జూన్‌ 16తో ముగుస్తుంది. 543 మంది సభ్యులున్న లోక్‌సభలో ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 240 సీట్లు సాధించగా ఎన్డీఏ పార్టీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని దక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ 99 సీట్లు గెలుచుకుంది. 2014లో 282 స్థానాలు, 2019లో 303 సీట్లతో సొంతంగానే బీజేపీ మెజార్టీ సాధించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img