Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఏబీవీకి పోస్టింగ్‌ అనుమానమే!

. కోర్టు తీర్పులనూ ఖాతరు చేయని జగన్‌ సర్కార్‌
. క్యాట్‌ ఆదేశాలపై హైకోర్టులో సవాల్‌`రేపు విచారణ
. ఈనెలాఖరుతో పదవీకాలం పూర్తి

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై జగన్‌ సర్కార్‌ కక్షసాధింపు చర్యలను ఆపడం లేదు. ఏబీవీకి పోస్టింగ్‌ ఇచ్చే విషయంలో కోర్టు తీర్పులను కూడా లెక్క చేయడం లేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏబీవీ న్యాయ పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. కోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, ఆ తీర్పులను సవాల్‌ చేస్తూ ఆయనకు పోస్టింగ్‌, జీతభత్యాలు ఇవ్వకుండా వేధిస్తోంది. మధ్యలో ఒకసారి పోస్టింగ్‌ ఇచ్చినట్లే ఇచ్చి పది రోజులలోనే సస్పెండ్‌ చేసింది. దీంతో ఏబీ వెంకటేశ్వరరావు ఒకే కారణంతో తనను రెండోసారి సస్పెండ్‌ చేశారంటూ క్యాట్‌ను ఆశ్రయించగా, ఈనెల 8వ తేదీ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. తక్షణమే ఏబీ వెంకటేశ్వరరావుని సర్వీస్‌లోకి తీసుకుని జీతభత్యాలు ఇవ్వాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. సస్పెన్షన్‌ చట్ట విరుద్ధమని, ఒకసారి సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత సస్పెండ్‌ చేయడం ఉద్యోగిని వేధించడమేనని అభిప్రాయపడిరది. క్యాట్‌ తీర్పు ప్రతిని సీఎస్‌ జవహర్‌రెడ్డికి ఏబీవీ ఈనెల 11న అందజేశారు. క్యాట్‌ తీర్పు ప్రకారం తనకు పోస్టింగ్‌ ఇవ్వాలంటూ ఒక దరఖాస్తు ఇచ్చారు. ఇది జరిగి మూడు వారాలవుతున్నా ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వకపోగా, జీతభత్యాలు చెల్లించలేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో క్యాట్‌ తీర్పును సీఎస్‌ నేరుగా అమలు చేసే అవకాశం ఉంది. లేనిపక్షంలో ఈసీకి తెలియజేసి అమలు చేయవచ్చు. సీఎస్‌ మాత్రం క్యాట్‌ తీర్పును అమలు చేయకుండా, ఆ కాపీని సీఎం జగన్‌ ముందు పెట్టారు. జగన్‌ దానిపై హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా ఆదేశించారు. దీంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఈ నెలాఖరుకు ఏబీ వెంకటేశ్వరరావు పదవీ కాలం ముగియనుంది. దీనినిబట్టి జగన్‌ సర్కార్‌కు ఆయన రిటైర్‌ అయ్యేలోపు పోస్టింగ్‌ ఇచ్చే ఉద్దేశం లేనట్లు స్పష్టంగా కనపడుతోందన్న చర్చ పోలీస్‌ అధికారుల్లో జరుగుతోంది. ఈనెల 13వ తేదీ పోలింగ్‌ సందర్భంగా ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు, మాజీ డీజీపీ ఠాగూర్‌ టీడీపీ కార్యాలయంలో కూర్చొని ఎస్సీ, డీఎస్పీ స్థాయి అధికారులకు ఫోన్‌లు చేసి టీడీపీకి అనుకూలంగా పనిచేయాలని బెదిరించినట్లు వైసీపీ నేతలు ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేయడాన్ని బట్టి ఆయనకు పోస్టింగ్‌ ఇచ్చే ఉద్దేశంలేదని తెలుస్తోందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. విచిత్రమేమిటంటే ఐదు సంవత్సరాల పాటు పోస్టింగ్‌, జీతభత్యాల్లేకుండా ప్రభుత్వ వేధింపులకు గురవుతున్న ఒక సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఓటు కూడా విజయవాడలో గల్లంతైంది. పోలింగ్‌కు ముందు ఓటరు జాబితాలో తన ఓటు లేకపోవడాన్ని గమనించి ఆయన తల్లడిల్లిపోయారు.
అసలు ఏం జరిగిందంటే…
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వైసీపీ ఎమ్మెల్యేలు 23 మంది టీడీపీలో చేరడానికి అప్పట్లో ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు కీలక పాత్ర పోషించినట్లు అనుమానించిన జగన్‌… వైసీపీ అధికారంలోకి రాగానే ఆయనపై వేటు వేశారు. టీడీపీ ప్రభుత్వంలో నిఘా పరికరాల కోసం ఏబీవీ తన కుమారుడికి చెందిన సంస్థకు కాంట్రాక్ట్‌ ఇప్పించారన్న అభియోగం మోపి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ బాధ్యతల నుంచి తప్పించారు.
9 నెలల పాటు పోస్టింగ్‌ ఇవ్వలేదు. నిఘా పరికరాల వ్యవహారం, ఇజ్రాయిల్‌కు రహస్యాలు చెరవేశారని కేసు నమోదు చేశారు. దాంతో ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయించారు. తొలిసారి క్యాట్‌, కేంద్ర హోంశాఖలో ఊరట కలుగలేదు. సుప్రీంకోర్టుకు వెళ్లడంతో అనుకూలంగా తీర్పు వచ్చింది. ప్రభుత్వ ముద్రణాలయం బాధ్యతలు అప్పగించిన జగన్‌ తర్వాత… కొద్దిరోజుల్లోనే సస్పెండ్‌ చేసింది. ఏబీవీ మరోసారి క్యాట్‌ను ఆశ్రయించగా ఒకే కారణం చూపి రెండు సార్లు సస్పెండ్‌ చేయరాదని, వెంటనే పోస్టింగ్‌ ఇచ్చి జీతభత్యాలు చెల్లించాలని తీర్పు వెలువడిరది. క్యాట్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ప్రభుత్వం మంగళవారం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఈ నెల 23వ తేదీ విచారణ జరపనున్నట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడిరచింది. దీంతో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img