Wednesday, October 30, 2024
Wednesday, October 30, 2024

కుల గణన ఊసే లేదు

2025 నుంచి జనగణన… 28లో నియోజకవర్గాల పునర్విభజన: కేంద్ర ప్రభుత్వం యోచన

న్యూదిల్లీ: దేశంలో జనగణన ప్రక్రియ 2025లో ప్రారంభం అవుతుందని సంబంధిత వర్గాలు సోమవారం వెల్లడిరచాయి. రాబోయే ఏడాది నుంచి జనాభా లెక్కలు ప్రారంభమవుతాయని, 2028లో నియోజకవర్గాల పునర్విభజన, దేశంలో జనగణన జరపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. జనగణన 2025లో ప్రారంభమై 2026 వరకూ కొనసాగనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీని అనంతరం లోక్‌సభ స్థానాల విభజన ప్రక్రియ ఉంటుందని తెలిపాయి. అది 2028కి ముగుస్తుందని వెల్లడిరచాయి. జనగణన పూర్తి కావడానికి దాదాపు 18 నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హోంశాఖ దీనికి నేతృత్వం వహించనుంది. 2026లో ప్రభుత్వం గణాంకాలను వెల్లడిరచే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి తుది అనుమతులు రాగానే జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్టు ప్రభుత్వ అధికారులను ఉటంకిస్తూ జాతీయ మీడియా వెల్లడిరచింది. ఇప్పటికే జనాభాలో చైనాను భారత్‌ దాటిపోయి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారిందని గత ఏడాది ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది. చివరిసారిగా 2011లో జనగణన చేపట్టారు. ఆ తర్వాత 2021లో జరగాల్సి ఉన్నప్పటికీ కోవిడ్‌ మహమ్మారి కారణంగా వాయిదా పడిరది. ఆ తర్వాత జనగణనపై కేంద్రం దృష్టి సారించలేదు. దీంతో ప్రభుత్వంపై అనేక విమర్శలు వచ్చాయి. జనగణన జరగకపోవడం వల్ల ఆర్థిక డాటా, ద్రవ్యోల్బణం, ఉద్యోగాలకు సంబంధించిన సమాచార నాణ్యతపై ప్రభావం పడుతున్నదని పలువురు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ఎట్టకేలకు దిగివచ్చిన ప్రభుత్వం జనగణన చేపట్టేందుకు సిద్ధమవుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img