Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కేజ్రీవాల్‌కు ఊరట

. జైలు నుంచి పాలనపై కోర్టులు నిర్ణయించలేవు
. వ్యక్తిగత సమస్యలు కాదు… దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతివ్వండి
. పిటిషనర్‌కు దిల్లీ హైకోర్టు సూచన బ కేసు కొట్టివేత

న్యూదిల్లీ: ప్రజాస్వామ్యాన్ని దాని ప్రకారం పనిచేయనివ్వండి, జైలు నుంచి పాలనపై కోర్టులు నిర్ణయించలేవు. వ్యక్తిగత అంశాలకు కాదు దేశ ప్రయోజనలకు ప్రాధాన్యత ఇవ్వండి అంటూ దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ జైలు నుంచి పరిపాలన సాగించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. తాత్కలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్‌ నేతృత్వ ధర్మాసనం ఈ కేసును విచారించింది. కేజ్రీవాల్‌ తప్పుకోవాలని ఆప్‌పై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఒత్తిడి తేవడంపై ఆయనకు సూచనలు చేయలేమని పేర్కొంది. ‘ఆయనకు మా మార్గ దర్శకత్వం అక్కర్లేదు. ఆయన చట్టానికి లోబడి ఏం చేయాలనుకుంటే అది చేస్తారు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హిందూ సేన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు గురువారం విచారించింది. తాజా తీర్పుతో దీంతో కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించడమే కాకుండా ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతల ఉత్కంఠకు తెరపడిరది. దిల్లి మద్యం కేసులో విచారణ జరుపుతున్న ఈడీ… మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసింది. అవినీతి ఆరోపణలతో ముఖ్యమంత్రి అరెస్ట్‌ అయి జైలుకు వెళ్లడంతో దిల్లీలో పాలన కొరవడిరదని హిందూ సేన జాతీయ అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త విష్ణు గుప్తా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పిల్‌పై విచారణ జరిపేందుకు దిల్లి హైకోర్టు తిరస్కరించింది. పిల్‌ను కొట్టేసింది. ఇది పూర్తిగా కేజ్రీవాల్‌ వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ అంశంపై రాష్ట్రపతి లేదా గవర్నర్‌ను సంప్రదించాలని పిటిషనర్‌కు సూచించింది. కొన్నిసార్లు వ్యక్తిగత ప్రయోజనం జాతీయ ప్రయోజనాలకు లోబడి ఉండాలే గానీ అది కేజ్రీవాల్‌ వ్యక్తిగత నిర్ణయమని కోర్టు తెలిపింది. కోర్టులు ఎప్పుడైనా రాష్ట్రపతి పాలన లేక గవర్నర్‌ పాలన విధించిన సందర్భాలున్నాయా ప్రశ్నించింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ లేదా రాష్ట్రపతి దీనిపై నిర్ణయిస్తారని పిటిషనర్‌కు తెలిపింది. సీఎం అరెస్ట్‌ వల్ల ప్రభుత్వం పనిచేయడంలేదని ఎలా చెప్పగలమని ప్రశ్నించింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు తాము మార్గదర్శకాలు సూచించాల్సిన అవసరం లేదని వెల్లడిరచింది. చట్టం ప్రకారం ఏం చేయాలో ఎల్‌జీ చేస్తారని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో విష్ణు గుప్తా తన పిల్‌ను ఉపసంహరించుకున్నారు. దిల్లి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను ఆశ్రయిస్తానని వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img