Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

చలో అసెంబ్లీ ఉద్రిక్తం

. పోలీసుల వలయాన్ని ఛేదించి వెలగపూడి చేరిన సర్పంచ్‌లు
. అరెస్ట్‌ చేసి తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: అసెంబ్లీ పరిసరాల్లో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి సర్పంచులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ ఆధ్వర్యంలో ‘చలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చారు. దీంతో ఇటు విజయవాడ, అటు గుంటూరు నగరాల నుంచి అసెంబ్లీ వరకు పోలీసులు భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. అన్ని రహదారుల్లో పెద్దసంఖ్యలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహించారు. చివరకు బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను కూడా వదిలిపెట్టలేదు. అలాగే సోమవారం రాత్రి నుంచే ప్రతిపక్ష పార్టీలకు చెందిన సర్పంచ్‌లను అదుపులోకి తీసుకున్నారు. సర్పంచ్‌ల సంఘాల నేతలు ముందస్తు అరెస్ట్‌లు చేశారు. అయినప్పటికీ పోలీసుల కళ్లుగప్పి అసెంబ్లీ పరిసరాల వరకూ కొందరు సర్పంచులు వచ్చారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారిమళ్లించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ నిధులను సర్పంచుల ఖాతాల్లో వేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ నిధులను చట్టప్రకారం పంచాయతీలకు ఇవ్వాలని కోరారు. దీంతో పోలీసులు అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. లాఠీలతో కొడుతూ ఈడ్చుకెళ్లి బస్సుల్లో పడేశారు. ఈ ఘటనలో కొందరు సర్పంచులకు తీవ్ర గాయాలయ్యాయి. సర్పంచుల చలో అసెంబ్లీకి వెళ్లకుండా పంచాయతీ ఛాంబర్‌ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ను ఉయ్యూరులో పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రతినిధులను మందడంలో అరెస్ట్‌ చేసి తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
అరెస్ట్‌ చేసిన సర్పంచ్‌ లను విడుదల చేసి బహిరంగ క్షమాపణలు చెప్పాలని టీడీపీ శాసనసభ్యులు డిమాండ్‌ చేశారు. రాష్ట్రాన్ని పోలీస్‌ రాజ్యంగా మార్చి, నియంత్రత్వ పోకడలు పోతున్న ఈ ముఖ్య మంత్రికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది. పవిత్రమైన చట్టసభల్ని నిర్వీ ర్యం చేసి, ప్రజాప్రతినిధులకు గౌరవం లేకుండా చేశాడు. అరెస్ట్‌ చేసిన సర్పంచ్‌ లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయించి, వారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి. వారికి కేటాయించాల్సిన నిధులు కేటాయించి, గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి సహకరించాలని డిమాండ్‌ చేశారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌ లకు ప్రభుత్వమే తగిన రక్షణ కల్పించాలి. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థతో సర్పంచ్‌ లు, ఎంపీటీసీలు ఎందుకూ పనికిరాని వారిగా మారిపోయారు. స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన స్థానాల్లో ముఖ్యమంత్రి ఎందుకు ఎన్నికలు నిర్వహించడు? ఓటమి భయంతోనే ఎన్నికల గురించి ఆలోచించడం లేదు. ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి రాక్షస పాలన అంతం అయితేనే స్థానిక సంస్థలకు మరలా మంచిరోజులు వస్తాయని వారు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img