Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

‘చలో సచివాలయం’ ఉద్రిక్తం

మెగా డీఎస్సీ ఇవ్వాలని డిమాండ్‌
. సచివాలయానికి వెళ్తుండగా షర్మిల అరెస్ట్‌
. ఆంధ్రరత్న భవన్‌ వద్ద ప్రముఖుల నిర్బంధం

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: మెగా డీఎస్సీ ప్రకటించాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్‌ ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతకు దారితీసింది. ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలతోపాటు ముఖ్య నేతలను గురువారం పోలీసులు ఆంధ్రరత్న భవన్‌ వద్ద నిర్బంధించారు. అక్కడి నుంచి వెలగపూడి సచివాలయానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆంధ్రరత్న భవన్‌ పరిసర ప్రాంతాలకు పోలీసు బలగాలు పెద్దఎత్తున చేరుకుని షర్మిలను బయటకు రాకుండా నిలువరించారు. కాంగ్రెస్‌ కార్యాలయం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన గిడుగు రుద్రరాజు, తులసిరెడ్డి, మస్తాన్‌ వలీ తదితర నేతలు అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. పోలీసుల వైఖరిపై షర్మిలతోపాటు కొప్పుల రాజు, జేడీ శీలం, సుంకర పద్మశ్రీ, ఎన్‌ఎస్‌యూఐ నేతలు తదితరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కార్యాలయం లోపల బైఠాయించి ఆందోళనకు దిగారు. మెగా డీఎస్సీ ఇస్తామని చెప్పి, ప్రభుత్వం దగా డీఎస్సీ ఇచ్చిందంటూ ప్లకార్డులతో నినదించారు. షర్మిల ఆందోళన చేస్తున్న ఆంధ్రరత్న భవనానికి సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, వి.శ్రీనివాసరావు, సీపీఐ నేతలు దోనేపూడి శంకర్‌, జి.కోటేశ్వరరావు తదితరులు వెళ్లి సంఫీుభావం తెలిపారు. కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిరది. కాంగ్రెస్‌ నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల వైఖరిపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నేతలతో కలిసి షర్మిల రాష్ట్ర సచివాలయానికి ప్రదర్శనగా వెళ్తుండగా మధ్యలో వారికి పోలీసులు అడ్డంకులు సృష్టించారు. పోలీసుల తీరును తప్పుబడుతూ మధ్యలో రోడ్డుపై ఆమె బైఠాయించారు. ఉండవల్లి సమీపాన షర్మిలను పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులకు, షర్మిలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. డౌన్‌ డౌన్‌ సీఎం అంటూ కాంగ్రెస్‌ శ్రేణులు నినదించారు. తొలుత చలో సచివాలయం పిలుపులో భాగంగా బుధవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి నేరుగా విజయవాడ ఆంధ్రరత్న భవన్‌కు షర్మిల చేరుకుని అక్కడే నిద్రించారు. తరలివస్తున్న నేతలను ఎక్కడికక్కడే గృహ నిర్బంధం చేశారు.
ఏపీని పీడిస్తున్న నిరుద్యోగ సమస్య: షర్మిల
ఆంధ్రప్రదేశ్‌ను నిరుద్యోగ సమస్య పీడిస్తోందని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రరత్న భవన్‌ వద్ద ఆమె విలేకరులతో మాట్లాడుతూ, డిగ్రీలు, పీజీలు చదివిన బిడ్డలు సంవత్సరానికి 500 మంది చనిపోతున్నారంటే ఇది నిజంగానే ప్రత్యేక హోదా రాక మనం చేతులారా చేసుకున్న పాపం కాదా అని ప్రశ్నించారు. కేంద్రం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిందనీ, కనీసం లక్షమందికైనా ఉద్యోగాలు ఇచ్చిందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు లక్ష 43వేల ఉద్యోగాలు పెండిరగ్‌లో పెట్టి దిగిపోయారన్నారు. జగన్‌ 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారని గుర్తుచేశారు. తాము తలపెట్టిన చలో సచివాలయానికి ఇన్ని ఆంక్షలు ఎందుకు..? ఇక్కడ జగన్‌ రాజ్యాంగం నడుస్తుందా? అని నిలదీశారు. మెగా డీఎస్సీ అంటూ దగా డీఎస్సీ ఇచ్చారని మండిపడ్దారు. బాబు పోవాలి, జాబ్‌ రావాలన్న నినాదం మీది కాదా అని అన్నారు. ఒక్క రోజైనా ప్రత్యేక హోదా కోసం పోరాడలేదన్నారు. ఐదేళ్లు ఏం చేశారు… ఎన్నికలు వచ్చాయని ఇప్పుడు నోటిఫికేషన్‌ ఇచ్చారు… జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయంటే, మీరు భయపడుతున్నారన్న వాస్తవం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. తక్షణమే 30 వేల ఉద్యోగాలతో డీఎస్సీ ఇవ్వాలని, జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img