Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

టీచర్ల బదిలీలకు బ్రేక్‌

. భారీగా చేతి వాటం?
. 1,400 మంది ఎక్కడి వారు అక్కడే
. పాఠశాల విద్య కమిషనర్‌ ఉత్తర్వులు
. కొత్త ప్రభుత్వం రాకముందే షాక్‌

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ల బదిలీలకు బ్రేక్‌ పడిరది. గతంలో ఇచ్చిన ఆదేశాలను అధికారులు నిలుపుదల చేశారు. ఈ మేరకు పాఠశాల విద్య కమిషనర్‌ సురేశ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీజేశారు. ఎలాంటి బదిలీలు చేయవద్దంటూ అన్ని జిల్లాల డీఈవోలను ఆయన ఆదేశించారు. దీంతో 1400 మంది బదిలీల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోనుంది. కొత్తప్రభుత్వం రాకముందే ఈ తరహాగా ఉత్తర్వులు రావడంతో బదిలీ అయిన ఉపాధ్యాయులు కలవరం చెందుతున్నారు. ఎన్నికల ముందు 1,400 మంది టీచర్లను బదిలీ చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు బదిలీలకు ఆదేశాలిచ్చారు. ఈ వ్యవహారంలో పెద్దఎత్తున లావాదేవీలు జరిగినట్లు సమాచారం. వారికి ఏప్రిల్‌ 24న బదిలీల ఉత్తర్వులు ఆయా జిల్లాల డీఈవోల ద్వారా అందాయి. తక్షణమే రిలీవ్‌ కావాలని ఆదేశించారు. ఉత్తర్వులతో ఉపాధ్యాయులు కోరుకున్న స్థానాలకు వెళ్లేందుకు సిద్ధమవ్వగా, ఈలోగా ఎలక్షన్‌ కోడ్‌ వచ్చింది. కోడ్‌ ముగిశాక రిలీవ్‌ అవుతారని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. కోడ్‌ కూడా ముగియడంతో ఉపాధాయులు కోరుకున్న స్థానాలకు బదిలీలపై వెళ్లేందుకు సిద్ధమవ్వగా, ఈలోగా వాటిని రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఎక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా…అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు అడ్డదారుల్లో బదిలీల ఉత్తర్వులు పొందడంతోనే ఈ దుస్థితి నెలకొందన్న విమర్శలున్నాయి. కొందరు రాజకీయ పలుకుబడితోను, మరికొందరు మధ్యవర్తుల ద్వారా డబ్బులు ఎరవేసి బదిలీలకు ప్రయత్నించారు. ఒక్కో పోస్టుకు లక్ష రూపాయలకుగాపైగా వసూలు చేసినట్లు సమాచారం. దీనివల్ల పెద్దఎత్తున అధికారులు, మధ్యవర్తుల మధ్య చేతులు మారినట్లుగా, విద్యాశాఖలోని కొందరు సిబ్బంది సైతం సూత్రధారులుగా నిలిచినట్లు తెలిసింది. బదిలీలకు కీలకంగా గత విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేషీ నుంచి వచ్చిన ఉత్తర్వులు వెలువడినట్లుగా తెలుస్తోంది. దీనిపై రాబోయే ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణకు ఆదేశించే అవకాశముంది. దీంతో బదిలీలకు వినతి చేసిన ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. అడ్డదారుల్లో బదిలీల వ్యవహారం ప్రతి ప్రభుత్వ హయాంలోనూ జరుగుతున్నది. ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడుగానీ, చివరి దశలోగానీ పెద్దఎత్తున బదిలీలకు తెరదీస్తారు. ఇదే దిశగా ముగిసిన వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయ బదిలీలు కొనసాగాయి. వాస్తవంగా ఉపాధ్యాయుల బదిలీలు ప్రతిఏటా పాఠశాలలల పున:ప్రారంభానికి ముందు నిర్వహిస్తారు. ఆ సమయంలో చాలా మంది వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ఆప్షన్లు పెట్టుకుని బదిలీలు అవుతారు. అలా వచ్చిన స్థానం నచ్చకపోవడంతో రాజకీయ పలుకుబడి, ముడుపులు అప్పజెప్పి ఉపాధ్యాయులు బదిలీలు పొందినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img