Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

డ్రగ్స్‌ అడ్డా విశాఖ

. మత్తులో యువత భవిత
. కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: ఆసియాలోనే అందాల నగరంగా పేరున్న విశాఖ ఇప్పుడు అంతర్జాతీయ మత్తు పదార్థాలకు కేంద్రంగా మారింది. ఇప్పటివరకు గంజాయికి పుట్టినిల్లుగా ఉన్న విశాఖ ఇప్పుడు డ్రగ్స్‌ కు కేంద్రంగా మారుతోంది. అనేక ప్రాంతాల నుంచి ఉన్నత చదువుల కోసం వచ్చే యువత డ్రగ్స్‌ బారిన పడి కొట్టుమిట్టాడుతున్నారు. నగర శివారు ప్రాంతాలు డ్రగ్స్‌ కేంద్రాలుగా మారిపోయాయి. చీకటి పడితే… రోడ్ల పక్కనే మత్తు పదార్థాలు తీసుకుంటూ యువత మత్తులో మునిగి తేలిపోతున్న సంఘటనలు అనేకం విశాఖలో నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. డ్రగ్స్‌ మత్తులో నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతుండటంతో అనేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. తమ పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారిపోతోందని అనేక మంది తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. డ్రగ్స్‌ మాఫియా కోట్లాది రూపాయలు వ్యాపారాలు చేసుకుంటూ యువత జీవితాలను విచ్ఛిన్నం చేస్తున్నారు. నియంత్రిం చాల్సిన పాలకులే డ్రగ్స్‌ వ్యాపార సంధాన కర్తలుగా మారడం సమాజానికి తీరని అన్యాయమే. విశాఖ రవాణా కు అనువైన ప్రదేశం కావడంతో వాయు మార్గం, జలమార్గం, రోడ్డు మార్గాల గుండా తరలిస్తున్న డ్రగ్స్‌ విచ్చలవిడిగా చిల్లర కొట్టుల్లో సైతం లభిస్తున్నాయి. అందుకు తాజాగా విశాఖ పోర్టులో భారీ డ్రగ్స్‌ కంటైనర్‌ లభ్యం కావడమే నిదర్శనం. ఈ డ్రగ్స్‌ కంటైనర్‌ వెనుక రాజకీయ నేతల ప్రమేయం ఉందన్న సంగతి తెలిసిందే. పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకోవడం తప్ప డ్రగ్స్‌ రహిత ఆంధ్ర ప్రదేశ్‌ ను తీర్చిదిద్దేందుకు ప్రయత్నించకపోవడం బాధాకరం. యువతను మత్తులో ముంచి తమ స్వార్ధ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని కొన్ని రాజకీయ పార్టీలు డ్రగ్స్‌ ను విచ్చలవిడిగా ప్రోత్సహించడాన్ని ప్రతి ఒక్కరూ ఖండిరచాలి.
కంపెనీ ప్రతినిధులపై కేసు నమోదు
విశాఖపట్నం లాసన్స్‌బే కాలనీలోని సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ వ్యాపార అవసరాల కోసం ‘డ్రై ఈస్ట్‌’ను ఆర్డర్‌ చేసింది. అందులో డ్రగ్స్‌ కలిపి బ్రెజిల్‌ నుంచి విశాఖపట్నానికి రవాణా చేసినట్టు ఇంటర్‌పోల్‌ నుంచి సమాచారం రావడంతో సీబీఐ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 16న విశాఖ పోర్టుకు చేరుకున్న కంటైనర్‌ను గుర్తించి గురువారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. దిల్లీ నుంచి వచ్చిన నిపుణులు సరకు తెప్పించుకున్న ఆక్వా కంపెనీ ప్రతినిధులను పిలిపించి వారి సమక్షంలోనే కంటెయినర్‌ (నంబర్‌ ఎస్‌ఈఆర్‌యూ 437538) తెరిచారు. అందులో డ్రై ఈస్ట్‌తో పాటు డ్రగ్స్‌ కూడా ఉండడంతో స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఆక్వా సంస్థ ప్రతినిధులను ప్రశ్నించగా, తాము ఆక్వాకల్చర్‌ వ్యాపారం చేస్తున్నామని, తొలిసారిగా దీన్ని తెప్పించుకున్నామని అంటున్నారు. సుమారు 25 వేల కిలోల ‘డ్రై ఈస్ట్‌’తో కలిపి ఉన్న కొకైన్‌ను స్వాధీనం చేసుక్నుట్టు సీబీఐ అధికారులు వెల్లడిరచారు. ఇన్‌ యాక్టివ్‌ డ్రై ఈస్ట్‌తో నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ను కలిపినట్టు నిర్ధారించారు. డ్రగ్స్‌తో వచ్చిన కంటైనర్‌ను విశాఖలో ఆక్వా ఎగుమతులు, దిగుమతులు చేపట్టే సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్టర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ పేరిట బుక్‌ చేసినట్టు సీబీఐ అధికారులు తేల్చారు. ఆ కంపెనీ ప్రతినిధులతోపాటు మరికొందరిపై ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదుచేశారు. ఇందులో అంతర్జాతీయ స్థాయి డ్రగ్స్‌ ముఠా ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో మిగిలిన వివరాలను రాబట్టాల్సి ఉందని సీబీఐ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img