Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

దొంగ ఓట్ల అక్రమాలు

సీఈసీకి టీడీపీ, వైసీపీ ఫిర్యాదులు
వైసీపీ దారుణాలు అన్నీ ఇన్నీ కావు: చంద్రబాబు
వలంటీర్లను దూరంగా ఉంచాలి: పవన్‌ కళ్యాణ్‌
జనసేన గుర్తింపు లేని పార్టీ: విజయసాయిరెడ్డి

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల సన్నద్ధత కోసం మూడు రోజుల రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన కేంద్ర ఎన్నికల సంఘ బృందానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు మంగళవారం పోటాపోటీగా ఫిర్యాదు చేశాయి. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌, కమిషనర్లు అనూప్‌ చంద్రపాండే, అరుణ్‌ గోయల్‌, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా స్థానిక నోవాటెల్‌ హోటల్‌లో వివిధ రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, సీపీఎం నాయకులు వైవీ రావు, సురేంద్ర, జయరాం, బీజేపీ నాయకులు వెంకట సత్యనారాయణ, రంగరాజు తదితరులు సమావేశానికి హాజరయ్యారు. వైసీపీ ఓట్ల అక్రమాలపై చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఫిర్యాదు చేయగా, టీడీపీ, జనసేనలపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు.
హోల్‌సేల్‌గా ఓటరు జాబితా మార్పు: చంద్రబాబు
తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా రాష్ట్రంలో అరాచకాలు జరగుతున్నాయని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని సీఈసీతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం తమపై కేసులు విపరీతంగా పెట్టి పని చేయకుండా చేస్తున్నదని, ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు చూశాక హోల్‌సేల్‌గా ఓటర్ల జాబితాను మారుస్తున్నట్లు చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గంలోనే ఫామ్‌`6 కింద 1.15 లక్షల ఓట్లు చేర్చినట్లు చెప్పారు. పనుల నిమిత్తం ఇతర నియోజకవర్గాలకు వెళ్లిన వారి ఓట్లు తొలగిం చారని చెప్పారు. వలంటీర్లను పెట్టుకుని తప్పుడు పనులు చేయాలని చూస్తున్నా రన్నారు. బీఎల్వోలుగా గతంలో ప్రభుత్వ అధికారులు మాత్రమే ఉండేవారని, దీంతో ఎక్కడా తస్పు జరిగేది కాదదన్నారు. ఇప్పుడు 2,600 మంది మహిళా పోలీసులను బీఎల్వోలుగా పెట్టారని, ఎన్నికల విధానాలు వాళ్లకు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. అమెరికాలో ఉన్న వాళ్లు కూడా జన్మభూమికి వచ్చి ఓటేస్తారని, అక్కడ ఉన్నవాళ్లు ఇక్కడ ఓటేయకూడదని ఎలా చెప్తారని ప్రశ్నిం చారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఇక్కడే ఉంటారని, బయటకు వెళ్లా ల్సిన అవసరం ఎందుకుంటుందని నిలదీశారు. ఎన్నికల విధుల్లోకి సచివాలయ సిబ్బందిని తీసుకోవడం సమంజసం కాదన్నారు. తప్పు చేసిన ప్రతి అధికారిపై ఆధారాలతో ఫిర్యాదు చేశామని, వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఇవన్నీ సీఈసీకి వివరించినట్లు చంద్రబాబు వెల్లడిరచారు.
వలంటీర్లను దూరంగా ఉంచాలి: పవన్‌ కల్యాణ్‌
వలంటీర్ల నియామకమే ప్రజాస్వామ్య విరుద్ధమని, అందువల్ల వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరినట్లు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. పారదర్శకంగా ఎన్నికలు జరగకపోతే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందన్నారు. స్థానిక ఎన్నికల్లోనూ దళితులు నామినేషన్‌ వేసిన పరిస్థితి లేదన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూస్తామని ఎన్నికల సంఘం హామీ ఇచ్చిందన్నారు.
జనసేన గుర్తింపు లేని పార్టీ: విజయసాయిరెడ్డి
జనసేన పార్టీపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. గుర్తింపు లేని జనసేనకి కామన్‌ సింబల్‌ ఇవ్వొద్దని కోరింది. జనసేన గుర్తింపులేని పార్టీ అని, దానిని ఎలా అనుమతించారని ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. చట్ట ప్రకారం గుర్తింపు లేని పార్టీకి రెండు వరుస ఎన్నికల్లో ఒకే సింబల్‌ ఇవ్వకూడదని వైఎస్సార్‌సీపీ తెలిపింది. మొత్తం ఆరు అంశాలపై సీఈసీకి ఫిర్యాదు చేశామని ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాకు తెలిపారు. కోనేరు సురేశ్‌ అనే వ్యక్తి పదిలక్షల పైచిలుకు ఓట్లు బోగస్‌ అని సీఈవోకి ఫిర్యాదు ఇచ్చాడని, ఒక వ్యక్తికి బోగస్‌ ఓట్లు ఉన్నాయని ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ ఓటర్లు ఏపీలో కూడా ఓటర్లుగా ఉన్నారన్నారు. లోకేశ్‌ ఎర్రబుక్‌ పేరుతో అధికారులను బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకే రోజు ఎన్నికలు జరపాలని కోరామని, ఒకే రోజు ఎన్నికలు జరిగితే దొంగ ఓట్లను అరికట్టవచ్చునని సీఈసీకి చెప్పామన్నారు. సాయంత్రం కేంద్ర ఎన్నికల అధికారులు ఎస్పీలు, కలెక్టర్లతో సమావేశమయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img