Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

నవరత్నాలతో సమగ్రాభివృద్ధి

. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు
. ప్రతి హామీ అమలుపరిచాం
. అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటు మహత్తరం
. మహిళా సంక్షేమానికి పెద్దపీట
. అభివృద్ధి వేగం కొనసాగేందుకు మద్దతివ్వాలి
. ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : దేశంలోనే ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు పేరుతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేద, బడుగు, బలహీన వర్గాల జీవన ప్రమాణస్థాయి అనూహ్యంగా పెరగడంతో పాటు రాష్ట్ర అభివృద్ధిపై ఆ ప్రభావం స్పష్టంగా కనపడుతోందని రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ ఉభయసభలను ఉద్దేశించి సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. ఇప్పటివరకు నిర్లక్ష్యానికి గురైన వర్గాల ప్రయోజనం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిందని వివరిం చారు. విజయవాడ స్వరాజ్‌ మైదానంలో 18.181 ఎకరాల సువిశాల ప్రాంగణంలో రూ.404.35 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటు మహత్తర ఘట్టంగా పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, సాధికారత పట్ల ప్రభుత్వ నిబద్ధతకు ఈ విగ్రహం నిదర్శనంగా నిలుస్తుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, అభ్యసన ఫలితాలు, పౌష్టికాహారం, మహిళల్లో రక్తహీనత వంటి కొన్ని సామాజిక అంశాల్లో ఏపీ వెనుకబడి ఉందని గ్రహించిన తమ ప్రభుత్వం నవరత్నాలు పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేసి సామాజిక, ఆర్థిక, విద్యా సాధికారితపై దృష్టి సారించిందని గవర్నర్‌ వివరించారు. దీనిలో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు అమలు చేసి పేద పిల్లలకు గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ అందిస్తున్నాం. మనబడి నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చాం. విద్యారంగంపై దాదాపు రూ.73,417 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అమ్మఒడి పథకం ప్రవేశపెట్టి విద్యార్థుల ఖాతాల్లో నేరుగా రూ.15 వేలు జమ చేయడంతో పాటు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు జగనన్న గోరుముద్ద అమలు చేస్తు న్నాం. జగనన్న విద్యాకానుక, డిజిటల్‌ లెర్నింగ్‌, 8,9 తరగతుల విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ, విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యాదీవెన పథకం అమలు చేస్తున్నామన్నారు. అలాగే వైద్య రంగంలో అనేక సంస్కరణలు తెచ్చామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10,132 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల ఏర్పాటుతో పాటు 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, 53 ఏరియా ఆస్పత్రులు, తొమ్మిది జిల్లా ఆస్పత్రుల్లో నాడు-నేడు ద్వారా సౌకర్యాలు మెరుగుపరిచాం. ఇప్పటి వరకు 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని వెల్లడిరచారు. ఇక మరో కీలకరంగమైన వ్యవసాయ రంగంలోనూ 10,778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ద్వారా అన్నదాతకు విత్తనం దగ్గర నుంచి ఉత్పత్తుల విక్రయం వరకు అండగా నిలుస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 53.53 లక్షల రైతులకు రైతు భరోసా కింద రూ.33,300 కోట్లు పంపిణీ చేశాం. రూ.50.30 కోట్లతో 35 ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం. రైతులకు రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని గవర్నర్‌ వివరించారు. ఇక ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రతీ కుటుంబానికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాం. మహిళా సాధికారత, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వైఎస్సార్‌ ఆసరా ద్వారా 78.84 లక్షల మంది మహిళలకు రూ.25,571 కోట్లు ఆర్థిక సాయం అందించాం. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద 66.34 లక్ష మందికి పెన్షన్‌ అందిస్తున్నాం. వైఎస్సార్‌ సున్నావడ్డీ పథకం కోసం రూ.4,969.05 కోట్లు, వైఎస్సార్‌ చేయూత ద్వారా రూ.14,129 కోట్లు, వైఎస్సార్‌ కాపునేస్తం కింద రూ.2,029 కోట్లు, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద రూ.1,257.04 కోట్లు, ఆటో ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్‌ మొబైల్‌ డిస్పెన్సింగ్‌ ఓనర్లకు 10 వేలు, జగనన్న చేదోడు ద్వారా దుకాణాలు, నాయిబ్రాహ్మణులు, దర్జీలకు రూ.10 వేలు, వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా ద్వారా రూ.350.89 కోట్లు… ఇలా నాలుగేళ్లలో నాన్‌ డీబీటీ కింద 4.23 లక్షల కోట్ల సంక్షేమ ఫలాలు అందించామని గవర్నర్‌ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. పీడీఎఫ్‌ కుటుంబాలకు సానుభూతితో పునరావాసం కల్పించాం. పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు 74.01 శాతం పనులు పూర్తయ్యాయి. రూ.280 కోట్లతో 10 టీఎంసీల చిత్రావతి ప్రాజెక్టును, అవుకు ప్రాజెక్టు రెండో టన్నెల్‌ను, కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు పూర్తి చేశాం. పులిచింతల నిర్వాసితులకు రూ.142 కోట్లు చెల్లించామన్నారు. విద్యుత్‌ నష్టాలను తగ్గించేందుకు వ్యవసాయ ఫీడర్లు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాలకు 24 గంటల త్రీఫేజ్‌ కరెంట్‌ ఇస్తున్నామన్నారు. ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన 880 బస్సులు ఏర్పాటు చేశాం. ఐటీని అభివృద్ధి చేస్తున్నాం. ఎయిర్‌పోర్టులు, పోర్టులు అభివృద్ధి చేశాం. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంపై దృష్టి పెట్టి 7,290 మందికి ఉపాధి కల్పించేలా రూ.3,685 కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని వివరించారు. వికేంద్రీకరణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్‌ మరోసారి పునరుద్ఘాటించారు. 13 కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో పరిపాలన ప్రజలకు మరింత చేరువైందని, 2.6 లక్షల మంది వలంటీర్ల ద్వారా ప్రజలకు నేరుగా ప్రభుత్వ సేవలు అందుతున్నాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img