Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నివురుగప్పిన నిప్పులా పల్నాడు

. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో బిక్కుబిక్కుమంటున్న ప్రజలు
. కేంద్ర బలగాలకు స్థానిక సిబ్బంది సహకరిస్తారా?
. ఇప్పటికే దాడులు… ప్రతి దాడులతో వందల మంది బాధితులు
. ఆస్తుల ధ్వంసం… ఊర్లు విడిచిపోయిన వైనం

విశాలాంధ్ర – పిడుగురాళ్ల : పల్నాడు ప్రాంతం నివురుగప్పిన నిప్పులా ఉంది. మంగళవారం ఓట్ల లెక్కింపు నేపథ్యంలో స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఇప్పటికే పోలింగ్‌ ముందు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలతో పల్నాడు ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనల నడుమ కాలం వెళ్లదీస్తున్నారు. పోలింగ్‌ అనంతరం జరిగిన దాడులు, ప్రతి దాడులలో వందలాది మంది బాధితులుగా మిగిలారు. ఆస్తులు ధ్వంసం కావటం, ఇళ్లు, వాహనాలు మంటల్లో దగ్ధం కావడంతో తీవ్రంగా నష్టపోయారు. రాజకీయ కక్షల మూలంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. కొందరు ఆసుపత్రుల్లో చేరారు. కొందరు ఊర్లు విడిచి పారిపోయారు. పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసం అయ్యాయి. పల్నాడులో దాడులు, ప్రతిదాడులు కొత్తవి కాదు. రెండు దశాబ్దాల కిందట నాటు బాంబులతో, మారణాయుధాలతో దాడులు, ప్రతి దాడులు తీవ్రస్థాయిలో జరిగేవి. ఆ విష సంస్కృతిని నడిపిన ఫ్యాక్షన్‌ నాయకులు జైలు జీవితం గడపటం, ప్రాణాలు కోల్పోవటం, ఆర్థికంగా నష్టపోవడం జరిగింది. దీంతో వారి వారసులు విద్య, ఉపాధి మార్గాలను ఎంచుకున్నారు. దీనికి తోడు ఫ్యాక్షనిజంపై ప్రభుత్వం, పోలీసులు ఉక్కు పాదం మోపటంతో ఆ విష సంస్కృతి తగ్గిపోయింది. 2019లో దుర్గిలో జరిగిన హత్యాకాండ, కోడెల శివప్రసాద్‌పై పోలీస్‌ స్టేషన్‌ వద్దే జరిగిన దాడి, 2021లో బోండా ఉమా, బుద్ధ వెంకన్నపై మాచర్లలో చోటు చేసుకున్న ఘటనలు ఫ్యాక్షనిజం తీవ్రస్థాయిలో ఉన్నట్లు కనిపించాయి. ఈ సారి రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా రెంటచింతల, వెల్దుర్తి, గురజాల, దాచేపల్లి మండల గ్రామాలతో పాటుగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి, నరసరావుపేటలో దాడులు, ప్రతి దాడులతో హింసాత్మక సంఘటనలు భారీగా జరిగాయి. చివరకు కేంద్ర బలగాలు మూడు రోజులు కృషి ఫలితంగా గొడవలు సద్దుమణిగాయి. ఎన్నికల అనంతరం జరిగిన దాడుల్లో రెండు ప్రధాన పార్టీలకు చెందిన సుమారు 1,300 మందిని అదుపులోకి తీసుకొని నరసరావుపేట, రాజమండ్రి నెల్లూరు జైళ్లకు తరలించారు. అప్పటి నుంచి పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలుపరుస్తూ గ్రామగ్రామాన కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహిస్తూ అల్లర్లకు పాల్పడిన అనేక మందిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. శనివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ పుణ్యమా అని గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఎప్పుడు, ఎవరు ఏ వైపు నుంచి దాడి చేస్తారోనని ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. నూతన ఎస్పీ మల్లికా గార్గ్‌ ఆదేశానుసారం పోలీసులు గ్రామలన్నింటినీ జల్లెడ పడుతున్నారు. బెల్లంకొండ మండలంలో అధికార పార్టీ నాయకుని వరిగడ్డి వాములో పెట్రోల్‌ బాంబులు లభ్యమయ్యాయి. ఆదివారం రాజుపాలెం మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పెట్రోల్‌ బాంబులు వాటి తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొందరు ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను చూసి ఇక రెండు రోజులే అంటూ ప్రత్యర్థి వర్గాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మహిళలు, వృద్ధులు భయాందోళన చెందుతున్నారు. పోలింగ్‌ అనంతరం జరిగిన అల్లర్లలో తమ వారు జైలుపాలు కావడం కొందరు ఊర్లు విడిచి వెళ్లిపోవడం ఆడవారు, వృద్ధులు, పిల్లలు ఎప్పుడు ఏ ఉపద్రవం సంభవిస్తుందోనని భయపడుతున్నారు. రెండు సంవత్సరాలుగా తీవ్ర దుర్భిక్షంతో అల్లాడుతున్న పల్నాడు ప్రాంతంలో ఈ ఏడాది తొలకరి జల్లులు పడుతున్న సమయంలో ఈ విధమైన దాడులు, అల్లర్లు జరగడంతో ఈ ఏడాది పంట భూములను బీడు భూములుగా చూడాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వృద్ధులు ఆవేదన చెందుతున్నారు. జిల్లా ఎస్పీ క్రింది స్థాయి సిబ్బందికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ వారు కేంద్ర బలగాలకు ఏవిధంగా సహకరిస్తారనేది ప్రస్తుతం పల్నాడులో జరుగుతున్న చర్చ. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై లాఠీఛార్జి చేయటానికి కూడా వెనకాడవద్దని ఎస్పీ పోలీస్‌ సిబ్బందికి భరోసా కల్పించారు. జిల్లా స్థాయి అధికారులను మార్చినంత మాత్రాన శాంతి భద్రతలు కుదుటపడతాయనేది అసాధ్యం. క్షేత్రస్థాయి సిబ్బంది నిష్పక్షపాతంగా తమ విధులను నిర్వర్తించి దౌర్జన్యకాండకు పాల్పడే అల్లరి మూకలను గుర్తించి వారి వివరాలను పై అధికారులకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎన్నికల సందర్భంగా పల్నాడుకు వచ్చిన చెడ్డ పేరును తొలగించాల్సిన బాధ్యత కూడా పల్నాటి పౌరులపై ఉంది. ఎన్నికల ఫలితాల అనంతరం క్షణికావేశానికి లోనుకాకుండా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా నిగ్రహంతో మెలగాల్సిన బాధ్యత రాజకీయ పార్టీ నాయకులపై ఉంది. అల్లర్లకు పాల్పడకుండా ప్రతి ఒక్కరూ పోలీసు సిబ్బందికి సహకరించి పల్నాడులో శాంతిని పరిఢవిల్ల చేయాలని శాంతికాముకులు కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img