London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

నేరరహిత రాష్ట్రమే లక్ష్యం

. జగన్‌ పాలనలో పోలీస్‌ వ్యవస్థ అపహాస్యం
. ప్రతిపక్షాల అణచివేతకే ఖాకీల వినియోగం
బ లెక్కలేనన్ని హత్యలు, అరాచకాలు
. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వెల్లడి
బ శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఒకప్పుడు దేశానికే గర్వకారణంగా నిల్చిన ఏపీ పోలీస్‌ వ్యవస్థను గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్‌ అపహాస్యానికి గురయ్యేలా దుర్వినియోగం చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిన్న శాంతి భద్రతలను మళ్లీ గాడిలో పెడతామని, నేర రహిత సమాజమే లక్ష్యంగా అడుగులు వేస్తామని స్పష్టం చేశారు. శాసనసభలో గురువారం శాంతిభద్రతలపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తూ, రాష్ట్రంలో జరిగిన దారుణాలపై గత ఐదేళ్ల తన ఆవేదన ఆవిష్కృతం చేసేలా సభలో ప్రసంగించారు. గత ఐదేళ్లలో నాపైనే 17 అక్రమ కేసులు పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజల కోసం బాబ్లీ ప్రాజెక్టు వద్ద ఆందోళన చేయడానికి వెళ్లినప్పుడు తప్ప నాపై ఒక్క కేసు కూడా లేదు. అలాంటిది 2019లో జగన్‌ అధికారంలోకి రాగానే నా ఇంటిపై డ్రోన్‌ ఎగురవేశారు. చలో ఆత్మకూరుకు పిలుపునిస్తే ఇంటిగేటుకు తాళ్లు కట్టారు. పవన్‌ కల్యాణ్‌ పై 7 కేసులు పెట్టారు. నోటీసులు ఇచ్చి విశాఖపట్నం నుండి బలవంతంగా పంపేశారు. నన్ను అరెస్టు చేసిన సమయంలో రాష్ట్రానికి వస్తుంటే రానివ్వకుండా సరిహద్దులో అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపైనే పడుకుని నిరసన తెలిపారు. మాచర్లలో టీడీపీ అభ్యర్థులను నామినేషన్‌ వేయనివ్వకుండా ఇబ్బందులు పెడుతుంటే బోండా ఉమా, బుద్ధా వెంకన్న వెళ్లారు…వారిపై దాడి చేస్తే తప్పించుకుని వచ్చారు. యువగళం పాదయాత్రలో లోకేశ్‌కు మైకు ఇవ్వకుండా, బెంచి ఎక్కనివ్వకుండా ఇబ్బందులు పెట్టారు. ఇలా ఈసభలో ఉన్న వారందరిపై దాదాపు కేసులు బనాయించారు. పల్నాడు పులిగా పిలుచుకునే కోడెల శివప్రసాదరావుపై 18 కేసులు పెట్టి వేధించారు. ప్రభుత్వ ఫర్నిచర్‌ తిరిగి ఇవ్వలేదని కేసులు పెట్టారు. ఈ మాజీ సీఎంను అడుగుతున్నా….నీ ఇంట్లో ఇప్పుడు కూడా ప్రభుత్వ ఫర్నిచర్‌ ఉంది కదా…దానికి ఏం సమాధానం చెబుతావని చంద్రబాబు ప్రశ్నించారు. అలాగే హోంమంత్రి అనితపై అట్రాసిటీ కేసు, స్పీకర్‌ అయ్యన్నపాత్రునిపై రేప్‌ కేసు, అక్రమమైనింగ్‌పై ప్రశ్నించినందుకు దేవినేని ఉమా, ప్రశ్నాపత్రం లీక్‌ అంటూ నారాయణపై కేసులు పెట్టారన్నారు. రామతీర్థంలో రాముడి తల తీశారని ప్రశ్నించినందుకు అశోక్‌ గజపతిరాజుపై కేసులు పెట్టారని, పైల్స్‌ ఆపరేషన్‌ చేయించుకున్న అచ్చెన్నాయుడుని 600 కి.మీ తిప్పి జైల్లో పెట్టారని తెలిపారు. ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజును అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారన్నారు. లాకప్‌ లో దారుణంగా కొట్టి, ఆ వీడియోలు చూసి జగన్‌ పైశాచిక ఆనందం పొందారని చంద్రబాబు తెలిపారు. ఇలా అనేకమంది నేతలపై కేసులు బనాయించారని… మంగళగిరి, గన్నవరం టీడీపీ కార్యాలయాలపైన, టెక్కలిలో జనసేన కార్యాలయంపైనా దాడి చేశారని గుర్తు చేశారు. తాము ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మా కార్యకలాపాలను అణచివేయడానికి జీవో-1 తీసుకొచ్చారని… ఇంట్లో నుండి బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారని తెలిపారు. టీడీపీతో పాటు జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ ఇల్లా అన్నిపార్టీల వారిపై ఎన్నో కేసులు పెట్టి వేలల్లో నాయకులు, కార్యకర్తల అక్రమ అరెస్టులకు పాల్పడ్డారని చెబుతూ… ఆయా సంఘటనలతో సహా కేసులు, అరెస్టుల వివరాలను వెల్లడిరచారు. ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీలపై ఇష్టానుసారంగా దాడులకు తెగబడ్డారని… ఎస్సీలు 192 మంది, ఎస్టీలు 58 మంది హత్యకు గురయ్యారని చెప్పారు. ఐదేళ్లలో మొత్తంగా 2,027 మంది మహిళలు హత్యకు గురయ్యారన్నారు. ఒక్క అమరావతి రైతుల్లో 269 మందిపైన క్రిమినల్‌ కేసులు పెట్టారు, 2,525 మంది రైతులను అరెస్టు చేశారని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, హింస, దాడులకు పాల్పడ్డారన్నారని… అన్ని చోట్ల ఇష్టానుసారంగా ఓట్లు గుద్దుకున్నారని…అందుకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరించామని చంద్రబాబు పేర్కొన్నారు. మరోపక్క దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు ఏపీలోనే ఉండటంతో పాటు మారుమూల గ్రామానికి వెళ్లినా గంజాయి దొరికే పరిస్థితి ఏర్పడిరదన్నారు. నేరస్థుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఏం జరుగుతుందో గత ఐదేళ్లు చూశామని సీఎం వివరించారు. జగన్‌ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటానికి అనర్హులని తెలిపారు. పోలీసు శాఖలో మార్పు తీసుకొస్తామని, కొత్త క్రిమినల్‌ చట్టాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. గంజాయి, మాదకద్రవ్యాలను వినియోగించకుండా ప్రజల్లో అవగాహన తీసుకొస్తామని చంద్రబాబు చెప్పారు. తన, మన అని చూడకుండా శాంతి భద్రతలు కాపాడటానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img