Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పాలకుడు ఎలా ఉండకూడదో జగన్‌ పాలన ఒక నమూనా

. ఐదేళ్ల పాలనలో 30 ఏళ్ల విధ్వంసం
. ప్రజలు పూర్తిగా స్వేచ్ఛ కోల్పోయారు
. అందుకే కూటమికి చారిత్రాత్మక విజయం
. టీడీపీ అధినేత చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : పాలకుడు ఎలా ఉండకూడదో జగన్‌మోహన్‌ రెడ్డి ఐదేళ్ల పాలన ఒక నమూనా అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజలు గెలవాలి… రాష్ట్రం నిలవాలి అనే మా పిలుపునకు ప్రజలు అనూహ్య మద్దతిచ్చారని, కూటమి నేతలు, కార్య కర్తల సమష్టి కృషి వల్లే ఈ చారిత్రాత్మక విజయం దక్కిందన్నారు. ప్రజలు ఇచ్చింది అధికారం మాత్రమే కాదని, ఇది మాపై మోపిన ఒక ఉన్నతమైన బాధ్యత అని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం మొదటి సారి ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నా సుదీర్ఘ రాజకీయ యాత్రలో వైసీపీ లాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని, అన్నిరంగాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ జగన్‌ నిర్వీర్యం చేశారన్నారు. నేను ఇప్పటికి 10 ఎన్నికలు చూశాను. కానీ ఇంతటి చారిత్రాత్మక ఎన్నికలు నా జీవితంలో చూడలేదన్నారు. ఈ ఎన్నికల్లో ఎక్కడో విదేశాల్లో ఉండే వ్యక్తులు లక్షలు ఖర్చు పెట్టుకని వచ్చి మరీ ఓటు వేశారు. పక్క రాష్ట్రాలకు పొట్టకూటి కోసం వెళ్లిన వారు కూడా సొంత డబ్బులు పెట్టుకుని వచ్చి ఓట్లు వేశారు. ప్రజల నిబద్ధతను ఎలా అభినందించాలో, ఎలా వర్ణించాలో అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల కంటే టీడీపీకి ఈ విజయం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. టీడీపీ స్థాపించినప్పుడు జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో 200 సీట్లు వచ్చాయి. 1994లో ప్రతిపక్షానికి కొన్ని చోట్ల డిపాజిట్‌ రాలేదు. వాటన్నింటినీ కూడా ఇప్పుడు అధిగమించి ఈ ఎన్నికల్లో కూటమికి 55.38 శాతం ఓట్లు వచ్చాయి. ఇందులో టీడీపీకి 45.60 శాతం, వైసీపీకి 39.37 శాతం ఓట్లు వచ్చాయి. ఎప్పుడూ లేనంతగా కూటమి అభ్యర్థులకు భారీ మెజార్టీలు వచ్చాయన్నారు. అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనాన్ని ప్రజలు క్షమించరన్నదానికి ఈ ఫలితాలే నిదర్శనం. ప్రజలు చెప్పిన గుణపాఠం పాలకులకు కాదు… అవినీతి, అహంకారంతో ముందుకు వెళ్లే విధ్వంసకారులకు ఇదే జరుగుతుంది. గత ఐదేళ్లుగా మా కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కంటినిండా నిద్రలేని రాత్రులు గడిపారు. కొందరు ప్రాణాలు కూడా త్యాగం చేశారు. ఆ త్యాగాల ఫలితమే ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగాం. మీడియా ఐదేళ్లు పడిన ఇబ్బందులు, కోర్టుల చుట్టూ తిప్పిన ఇబ్బందులు, సీఐడీ ఆఫీసులు చుట్టూ తిప్పిన ఘటనలు చూసుకుంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన దుస్థితి. పవన్‌ కల్యాణ్‌ను కూడా స్వేచ్ఛగా ఉండనివ్వలేదు. విశాఖ పర్యటనకు వెళితే నగర బహిష్కరణ చేయాలని చెప్పారు. కేసులు పెడితే ఎందుకు కేసు పెట్టావని అడిగితే సమాధానం చెప్పకుండా అరెస్టు చేసి తర్వాత వివరాలు చెప్తామని చెప్పారు. ఐదేళ్ల జగన్‌ పాలనలో 30 ఏళ్ల విధ్వంసం జరిగింది. అప్పులు ఎంత చేశారో తెలీదు. సహజ సంపదలైన ఇసుక, మైన్‌, గనులు అన్నింటినీ ఇష్టానుసారంగా దోచేశారు. ఈ ప్రభుత్వంలో 9 సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచారు. విద్యుత్‌ రంగంపై అప్పులు తెచ్చి వాటినీ దుర్వినియోగం చేశారు. విద్యుత్‌ శాఖను సంక్షోభంలోకి నెట్టారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు మాకు ఇచ్చింది అధికారం అని అనుకోవడం లేదు. బాధ్యతగా తీసుకుంటున్నాం. పాలకులం కాదు… సేవకులం అనే భావనతో పని చేస్తాం. సూపర్‌-6, ప్రజాగళం మేనిఫెస్టో ప్రజల్లోకి బాగా వెళ్లాయి. నా మాటను, గౌరవాన్ని నిలబెట్టిన ప్రజల రుణం తీర్చుకుని ప్రజల ఆశల మేరకు పని చేస్తాం. ఓట్లు వేసిన ప్రజలు కూడా రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టేందుకు ప్రభుత్వానికి ఎల్లవేళలా సహకరించాలని కోరారు. ఒక ప్రశ్నకు సమాధానంగా మేము ఎన్డీయేతోనే ఉన్నాం, ఉంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img