Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పొత్తులపై అస్పష్టత

టీడీపీ, జనసేన పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ
. సీట్ల సర్దుబాటులో జాప్యంపై అభ్యర్థుల్లో ఆందోళన
. బీజేపీతో దూరంగా ఉండాలని కోరుతున్న నేతలు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఎన్నికల పొత్తుల వ్యవహారం ఆ పార్టీల శ్రేణులను ఉత్కంఠకు గురి చేస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి నెలాఖరులో ఎన్నికల షెడ్యూలు విడుదలవుతుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే సుమారు 60కి పైగా నియోజకవర్గాలకు మూడు విడతలుగా అభ్యర్థులను ఖరారు చేసింది. మిగిలిన నియోజకవర్గాలకు కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై కసరత్తు నిర్వహిస్తోంది. త్వరలోనే 175 నియోజకవర్గాలకు, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ జాబితాను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో వైసీపీని గద్దె దించడమే లక్ష్యమని చెబుతున్న టీడీపీ, జనసేన పార్టీలు పొత్తులపై ఇంకా స్పష్టత ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండడం…ఆ రెండు పార్టీల శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్‌జైలుకి వెళ్లిన సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌…వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని అకస్మాత్తుగా పొత్తు ప్రకటన చేశారు. ఆ తర్వాత టీడీపీ, జనసేన నేతలతో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు కసరత్తు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ ముందు రోజు పవన్‌ కల్యాణ్‌ను చంద్రబాబు తన ఇంటికి డిన్నర్‌కు ఆహ్వానించిన సందర్భంగా సీట్ల సర్దుబాటుపై కొంత చర్చ జరిగినట్లు సమాచారం. ఆ మరుసటి రోజు ప్రభుత్వ వ్యతిరేక విధానాల కాపీలను రెండు పార్టీల అధినేతలు భోగి మంటల్లో దహనం చేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు ఏఏ పార్టీలతో కలిసి పోటీ చేస్తున్నాయి? జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది? ఆయా స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల పరిస్థితి ఏమిటి? ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికీ బీజేపీతో కలిసే ఉన్నామని చెబుతున్నారు. బీజేపీ కూడా అదే పాట పాడుతోంది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తీవ్ర నష్టం జరుగుతుందని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కమ్యూనిస్టులు వ్యతిరేకించే అవకాశం ఉందని, అదే జరిగితే రెండు విధాలా నష్టపోతామని ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఆ విషయం టీడీపీలో దాదాపు ముఖ్యనేతలంతా చంద్రబాబు దృష్టికి నేరుగా తీసుకెళ్లారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఏమాత్రం లాభం లేకపోగా, కమ్యూనిస్టులు దూరం కావడం వల్ల తీవ్ర నష్టం తప్పదని టీడీపీ, జనసేన శ్రేణులు అంచనా వేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img