Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పోటెత్తిన ఓటరు

. ఎండా, వాన లెక్కచేయని జనం
. సాయంత్రం 5 గంటలకే 68 శాతం నమోదు
. సమయం ముగిశాక 3,500 కేంద్రాల్లో కొనసాగిన పోలింగ్‌
. అనేక ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ
. తెనాలి ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించిన ఓటరు
. తుమృకోటలో ఈవీఎంల ధ్వంసం
. తంగెడలో నాటుబాంబు దాడులు

ఓటర్లు పోటెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచే జనం పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. కొన్ని ప్రాంతాల్లో ఎండ, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పటికీ ప్రజలు లెక్కచేయలేదు. అలాగే అనేకచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ జనం బెదరలేదు.

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ఓటర్లు పోటెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచే జనం పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. కొన్ని ప్రాంతాల్లో ఎండ, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పటికీ ప్రజలు లెక్కచేయలేదు. అలాగే అనేకచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ జనం బెదరలేదు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ సమయం ముగిసినా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఉండటం విశేషం. ఎట్టిపరిస్థితుల్లో తమ ఓటుహక్కు వినియోగించుకోవాలన్న ఆరాటంతో ఓటర్లు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు. దీంతో వీరందరికీ ఓటు వేసేందుకు ఈసీ అవకాశం కల్పించింది. సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 68 శాతం పోలింగ్‌ నమోదు కాగా, సమయం ముగిశాక కూడా దాదాపు 3,500కు పైగా కేంద్రాల వద్ద పోలింగ్‌ కొనసాగుతోంది. రాత్రి 10 గంటల వరకు ఈ పోలింగ్‌ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడిరచారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌ అరకు, పాడేరు, రంపచోడవరంలో మాత్రం గడువు ప్రకారం సాయంత్రం 4 గంటలకే ముగియగా, కురుపాం, పాలకొండ, సాలూరులో సాయంత్రం 5 గంటలకే పరిసమాప్తమైంది. మిగతా చోట్ల సాయంత్రం 6 గంటలకే పోలింగ్‌ సమయం ముగిసినా దాదాపు ఎక్కువ పోలింగ్‌ కేంద్రాల్లో రాత్రి పొద్దు పోయే వరకు క్యూలైన్లలో ఓటర్లు వేచి ఉన్నారు. ఓటుహక్కు వినియోగించుకొనేందుకు జనం పెద్ద ఎత్తున క్యూలైన్లలో వేచి ఉండటంతో అందరికీ స్లిప్పులు ఇచ్చిన ఎన్నికల సంఘం అధికారులు… వారందరికీ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు అవకాశం కల్పించడంతో పోలింగ్‌ శాతం భారీగా నమోదయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు చెపుతున్నారు. ఇక అనేకచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. గంటల తరబడి పోలింగ్‌ ఆలస్యమైంది. అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా మాచర్లను అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంగా పరిగణించి భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినప్పటికీ పెద్దఎత్తున హింస చెలరేగింది. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో పెద్దఎత్తున అల్లర్లు చోటుచేసుకున్నాయి. కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లోని ఈవీఎంలను అధికార పార్టీకి చెందిన శ్రేణులు పగులగొట్టారు. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు దొండపాడు పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించడానికి వెళ్లిన సందర్భంగా ప్రత్యర్థులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఆయన వెంట వచ్చిన మూడు కార్లను ధ్వంసం చేశారు. రెంటాల గ్రామంలో టీడీపీ ఏజెంట్లను భయపెట్టి బయటకు పంపడంతో అక్కడకు టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి చేరుకున్నారు. దీంతో ఆయనను వైసీపీ నేతలు అడ్డుకుని, ఆయన కారుతో పాటు, వెంట వచ్చిన నాలుగు కార్లను ధ్వంసం చేశారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలోని దలవాయిలో ఈవీఎంను ధ్వంసం చేశారు. తుమృకోటలో టీడీపీకి అనుకూలంగా ఓట్లు పడుతున్నాయన్న ప్రచారంతో వైసీపీ శ్రేణులు పోలింగ్‌బూత్‌లోకి చొరబడి ఈవీఎంను ధ్వంసం చేశారు. కొత్తపల్లి సర్పంచ్‌పై దాడి చేశారు. సత్తెనపల్లి, అచ్చంపేటలో టీడీపీ, వైసీపీ శ్రేణులు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. బాపట్ల మండలం పన్నిబోయినవారిపాలెంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వినుకొండ నియోజకవర్గ పరిధిలోని జంగాలపల్లి గ్రామంలో ఇరువర్గాలకు చెందిన ఏజెంట్ల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో వీవీ ప్యాట్స్‌ ధ్వంసమై పోలింగ్‌ కొద్దిపేపు ఆగింది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు జెడ్పీ స్కూలులో, చిత్తూరు జిల్లా నగరి సీతారామపురంలో, అల్లూరి జిల్లా రెంతాడ తదితర అనేక ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించి పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని చిన్ని వాహనాలపై కంభంపాడులో వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. దాచేపల్లి మండలం తంగెడలో వైసీపీ శ్రేణులు నాటు బాంబులు, పెట్రోల్‌ సీసాలతో దాడులకు తెగబడ్డారు. పోలింగ్‌ ముగిసే సమయంలో ఓటు విషయంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఓటింగ్‌ శాతం పెరిగితే తమకు నష్టం జరగుతుందేమోనన్న భయంతో వైసీపీ శ్రేణులు నాటుబాంబులతో దాడులకు దిగాయి. మరోవైపు రాళ్ల వర్షం కురిపించడంతో ఓటర్లు భయాందోళనకు గురై పోలింగ్‌ కేంద్రం నుంచి పరుగులు తీశారు. ఈ ఘర్షణలో సుమారు పది ద్విచక్రవాహనాలు, నాలుగు దుకాణాలు మంటల్లో దగ్ధమయ్యాయి. నరసరావుపేట పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్‌ హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద అధికారపార్టీ శ్రేణులు హల్‌చల్‌ చేశాయి. టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్‌ బాబు కారుపై దాడి చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. అనంతరం టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటివద్దకు వెళ్లి ఆందోళన చేపట్టాయి. దీంతో ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడికి చేరుకున్న పోలీసులు రబ్బర్‌ బుల్లెట్లు, బాష్పవాయువు ప్రయోగించి రెండు వర్గాలను చెదరగొట్టారు. నకరికల్లు మండలం చీమలమర్రిలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా 20 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దాడి ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన ఓటర్లు పోలింగ్‌ కేంద్రంలో తలదాచుకున్నారు. దాచేపల్లి మండలం ఇరికేపల్లి, నడికుడిలోనూ ఘర్షణలు జరిగాయి. తెనాలిలో వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ను ప్రశ్నించిన ఓటరుపై చేయిచేసుకోగా, తిరిగి ఆ ఓటరు కూడా ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించాడు. దీంతో హతాశులైన ఆయన వెంట ఉన్న అనుచరులు ఆ ఓటరుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతపురం జిల్లాలోనూ వివిధ నియోజకవర్గాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణలు జరిగాయి. పెద్దఎత్తున హింసాత్మక ఘటనలు జరిగినా…కొన్ని ప్రాంతాల్లో జోరువాన కురిసినా, మరికొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఓటింగ్‌ శాతం మాత్రం పెరిగే అవకాశాలుండడం అధికార, ప్రతిపక్ష పార్టీలు తమకు అనుకూలంగా భావిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో ఎక్కువగా ఉండడం వల్లే ఓటర్ల నుంచి పెద్దఎత్తున స్పందన కనపడుతోందని టీడీపీ చెపుతుండగా, ఇవన్నీ ప్రభుత్వానికి సానుకూల పవనాలేనని వైసీపీ నేతలు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img