Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రచార తీరుపై ఈసీ కన్నెర్ర

. కులం, మతం ప్రస్తావన వద్దు
. సామాజిక విభజనకు దారితీసే ప్రసంగాలు చేయొద్దు
. రాజ్యాంగం రద్దవుతుందని చెప్పవద్దు
. బీజేపీ, కాంగ్రెస్‌ అధ్యక్షులకు నోటీసులు

న్యూదిల్లీ : లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీలు`బీజేపీ, కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచార సరళిపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది. ఎన్నికల ప్రచారాల్లో కులం, మతం గురించి ప్రస్తావించవద్దని బుధవారం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. పరస్పర విమర్శల విషయంలో ఆయా పార్టీల అగ్రనేతలు, ప్రధాన ప్రచారకర్తలు హూందాగా వ్యవహరించాలని సూచించింది. ప్రసంగాలు గాడి తప్పుతుండటాన్ని గమనంలో పెట్టుకోవాలని ఆదేశించింది. ప్రచార శైలిలో మార్పు అవసరమని హితవు పలికింది. ఇప్పటికే ఐదు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఆరో దశకు రంగం సిద్ధమైంది. ఇప్పటికైనా ప్రచారాన్ని హూందాగా నిర్వహించేలా తమ తమ ప్రచారకర్తలకు ఆదేశాలివ్వాలని బీజేపీ, కాంగ్రెస్‌ అధ్యక్షులు జేపీ నడ్డా, మల్లికార్జున ఖడ్గేకు నోటీసులు జారీచేసింది. ఎన్నికల ప్రవర్తనా నిబంధనావళికి కట్టుబడాలని, ప్రచారంలో మతపరమైన అంశాలకు తావు లేదని, సామాజిక విభజనకు దారితీసే ప్రసంగాలు ఆపేయాలని, అదే సమయంలో రాజ్యాంగం రద్దవుతుందనే అభిప్రాయం కలిగించే ప్రకటనలు చేయొద్దని ఆదేశించింది. అగ్నివీర్‌ వంటి పథకాలపై ప్రసంగాలు చేసేటప్పుడు సాయుధ బలగాలను రాజకీయంలోకి లాగవద్దని పేర్కొంది. అధికార పార్టీ మరింత బాధ్యతగా వ్యవహరించాలని బీజేపీకి ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల వ్యవస్థపై ఓటరుకున్న విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలను ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పింది. ప్రచారాల్లో, ప్రసంగాల్లో ఆచితూచి వ్యవహరించాలని, తీరు మార్చుకోవాలని స్టార్‌ క్యాంపెయినర్లకు స్పష్టం చేయాలంటూ బీజేపీ, కాంగ్రెస్‌కు ఈసీ సూచించింది.
ఎన్నికల ప్రచారంపై రెండు పార్టీలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో ఎన్నికల సంఘం స్పందించింది. రక్షణ దళాల వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దని కాంగ్రెస్‌కు సూచించింది. ‘ఎన్నికలు వస్తాయి…పోతాయి. కానీ రాజకీయ పార్టీలు సామాజిక`సాంస్కృతిక వాతావరణాన్ని పరిరక్షించాలి. వర్తమానంలోనే కాకుండా భవిష్యత్‌ కోసం దేశానికి నాయకులను అందించే బాధ్యత రాజకీయ పార్టీలపై ఉంది. అలాంటి పార్టీలు క్రమశిక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే కుదరదు’ అని ఎన్నికల సంఘం పేర్కొంది.
నడ్డాకు రాసిన లేఖలో ‘మీ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి మరింత బాధ్యతగా వ్యవహరించాలి. ప్రచారం సమయంలో గౌరవంగా మాట్లాడాలి. కులం, మతం ప్రస్తావనలు తేవద్దు. సామాజిక విభజనకు దారితీసే విధంగా ప్రసంగాలు, ప్రకటనలు చేయొద్దు. పార్టీ స్టార్‌ ప్రచారకర్తలు తమ ప్రసంగాల్లో హూందాతనాన్ని కనబర్చాలి’ అని ఈసీ పేర్కొంది. ఖడ్గేకు రాసిన లేఖలో ‘ప్రవర్తనా నియమావళికి కట్టుబడాలి… అందులో నివారించాలని సూచించిన అంశాలకు దూరంగా ఉండాలి. వివాదాస్పద ప్రకటనలు చేయొద్దని ప్రచారకర్తలకు సూచించండి’ అని ఈసీ స్పష్టంచేసింది. నడ్డా, ఖడ్డే పేరిట నోటీసులను ఎన్నికల సంఘం జారీచేసింది తప్ప ప్రధాని మోదీ లేక రాహుల్‌ గాంధీ పేర్లను ఎక్కడా ప్రస్తావించలేదు. స్టార్‌ ప్రచారకర్తల ప్రసంగాలకు పార్టీ అధ్యక్షులనే బాధ్యులుగా పరిగణించింది. ఏ నాయకుడి పేరు ప్రస్తావించకుండా సూచనలు చేసింది. కాగా, వివాహితల మంగళసూత్రాలను వదలబోదని, ప్రజా సంపదను ముస్లింలకు పంచిపెడుతుందని తమ పార్టీపై మోదీ చేసిన విద్వేష ప్రసంగాలను ఎన్నికల సంఘం దృష్టికి కాంగ్రెస్‌ తీసుకెళ్లింది. ఒకే దేశం, ఒకే భాష, ఒక మతం అంటూ ప్రధాని పదేపదే మాట్లాడుతుండటంపై రాహుల్‌ గాంధీ విమర్శల గురించి ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img