London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Saturday, October 19, 2024
Saturday, October 19, 2024

ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం కట్టాలి

తానా సెమినార్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర – విజయవాడ : ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా పేరుగాంచిన భారతదేశంలో ప్రజాస్వామిక వ్యవస్థ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుంకట్టాల్సిన అవసరం ప్రస్తుత తరుణంలో ఎంతైనా ఉన్నదని, ఎన్నికల సంస్కరణలు అందుకు దోహదపడతాయని సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అభిప్రాయపడ్డారు. అమెరికాలో జరిగిన తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) మహాసభల సందర్భంగా ‘ఎన్నికల సంస్కరణలు విధి విధానాలు’ అనే అంశంపై జరిగిన సెమినార్‌లో రామకృష్ణ ప్రసంగించారు. భారతదేశ ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశంపై తానా సమావేశాల్లో సెమినార్‌ ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారత్‌ అన్నారు. ప్రజాస్వామిక దేశమైన భారతదేశంలో ఎన్నికలు, ఓటింగ్‌ చాలా కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతమేర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు మతతత్వ రాజకీయాలు, ధనబలం, పోలింగ్‌ కేంద్రాల ఆక్రమణ, హింస,, రాజకీయాలు నేరమయం, ఓట్ల తొలగింపు, దొంగ ఓట్లు చేర్పింపు వంటివి ప్రధాన కారణాలుగా ఉన్నాయని చెప్పారు. అందువల్ల ఎన్నికల సంస్కరణల అవసరం నానాటికీ పెరుగుతోందన్న అభిప్రాయాన్ని రామకృష్ణ వ్యక్తంచేశారు. ఎన్నికల సంస్కరణల కోసం 1974లో తార్కుండే కమిటీ, జయప్రకాశ్‌ నారాయణ్‌ కమిటీ, 1990లో గోస్వామి కమిటీ, 1993లో వోహ్రా కమిటీ ఏర్పాటవ్వగాÑ 1998లో రాష్ట్ర ఎన్నికల నిధులపై ఇంద్రజిత్‌ గుప్తా కమిటీ స్టేట్‌ ఫండిరగ్‌, ప్రపోటరీ సిస్టం ఉండాలని సిఫార్సు చేసిందని చెప్పారు. 1999లో ఎన్నికల చట్టాల సంస్కరణపై లా కమిషన్‌ నివేదిక ఇచ్చిందన్నారు. 2001లో ఎన్నికల సంస్కరణలపై జాతీయ కమిషన్‌ ఏర్పాటైందని, 2004లో భారత ఎన్నికల సంఘం అనేక ఎన్నికల సంస్కరణలపై ప్రతిపాదనలు చేసిందని తెలిపారు. 2004లో జీవన్‌రెడ్డి కమిటీ ఏర్పాటైందని, 2008లో రెండవ పరిపాలన సంస్కరణల కమిషన్‌ ఏర్పాటైందని, భారతదేశ ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసాన్ని పునరుద్ధరించే ఉద్దేశంతో, ఎప్పటికప్పుడు అనేక ఎన్నికల సంస్కరణలు చేశారన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. ఎన్నికల్లో ధన ప్రభావం విపరీతంగా పెరిగిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు గతం నుంచి ప్రభుత్వాలు, మేధావులు, ఎన్నికల సంఘాలు వివిధ రూపాల్లో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అనేక లోపాలు వెలుగుచూస్తూనే ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానానికి పోటీచేసే అభ్యర్థి రూ.20 నుంచి రూ.30 కోట్లు, ఎంపీ స్థానానికి పోటీచేసే అభ్యర్థి రూ.100 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి నెలకొనడం విచారకరం అన్నారు. దీనికితోడు దొంగ ఓట్ల చేర్పింపు ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓకే డోర్‌ నంబర్‌తో 510 ఓట్లు దొంగ ఓట్లు చేర్చడాన్ని బట్టి దొంగ ఓట్ల తీవ్రత అర్ధమవుతోందన్నారు. అంతేకాకుండా తమకు అనుకూలంగా లేని అసలు ఓటర్ల పేర్లు తొలగించే ప్రక్రియకు ప్రభుత్వాలు ఉద్యుక్తమవుతున్నాయని, ఇవన్నీ ప్రజాస్వామిక వ్యవస్థకు ప్రమాద సంకేతాలు అని పేర్కొన్నారు. దేశంలో పార్టీ ఫిరాయింపుదార్లు ప్రజాస్వామిక వ్యవస్థకు అత్యంత ప్రమాదకరంగా తయారయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలోని 9 రాష్ట్రాల్లో ఫిరాయింపుదార్ల సహకారంతో ప్రభుత్వాలు ఏర్పడ్డాయని చెప్పారు. ప్రజలు ఎన్నుకున్నది ఒకళ్లనయితే, కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న పార్టీ ఆయా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తమకు అనుకూలంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిందన్నారు. ఇటీవల మహారాష్ట్రలో ఎన్‌సీపీ నేత అజిత్‌పవార్‌ను జైలుకు పంపుతామనే బెదిరింపులకు గురిచేసి, పార్టీ మారగానే ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిందన్నారు. ఇటువంటి చర్యలు, బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి మాయనిమచ్చలే అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఒక ప్రణాళికాబద్ధమైన పద్ధతిలో ఎన్నికల సంస్కరణలు జరగాలని, పార్టీ గుర్తుపౖౖె ఓట్లు వేయించే ప్రపోజల్‌ రిప్రజంటేషన్‌ సిస్టమ్‌ ఉండాలని, ప్రభుత్వమే ఖర్చు భరించాలని చెప్పారు. ప్రజలందరూ చైతన్యవంతులై స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి కల్పించాలనే ప్రతిపాదనలు భారత కమ్యూనిస్టు పార్టీ చేస్తున్నట్లు రామకృష్ణ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img