Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బాబోయ్‌భానుడు!

ఉక్కబోతతో అల్లాడుతున్న ప్రజలు
. 4 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు
. సాధారణం కంటే గరిష్టంగా నమోదు
. నేడు 193 మండలాల్లో వడగాడ్పులు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : మండుటెండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వృద్ధులు, రోగులు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు ఒకటే ఉక్కబోత. దానికితోడు వడగాడ్పులతో ప్రజలు భీతిల్లిపోతున్నారు. బయటకు రావాలంటేనే బెంబేలెత్తుతున్నారు. రోజురోజుకూ వడగాడ్పులు, అధిక ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. ఇప్పటికే వృద్ధులు, చిన్నారులు వడదెబ్బ బారిన పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వడగాడ్పులు తీవ్ర స్థాయిలో పెరగనున్నాయని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఐఎండీ) వెల్లడిరచింది. శనివారం నుంచి నాలుగు రోజులపాటు అంటే తొమ్మిదో తేదీ వరకు అధిక ఉష్ణోగ్రతలకు అవకాశముందని వివరించింది. ఐఎండీ సూచనల ప్రకారం శనివారం 179 మండలాల్లో తీవ్రవడగాడ్పులు, 209 మండలాల్లో వడగాల్పులు వీచాయి. శ్రీకాకుళం జిల్లాల్లో 26 మండలాలు, విజయనగరం 25, పార్వతీపురం మన్యం 15, అల్లూరి సీతారామరాజు తొమ్మిది, విశాఖపట్నం మూడు, అనకాపల్లి 16, కాకినాడ 13, కోనసీమ ఏడు, తూర్పుగోదావరి 16, ఏలూరు నాలుగు, కృష్ణా నాలుగు, ఎన్టీఆర్‌ ఆరు, గుంటూరు 14, పల్నాడు 17, బాపట్ల ఒకటి, ప్రకాశం రెండు, తిరుపతి ఒక మండలంలో తీవ్రవడగాల్పులు వీశాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, ఎన్టీఆర్‌, పల్నాడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో దాదాపు 45 నుంచి 46 డిగ్రీల సెంటీగ్రేట్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్‌, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల వరకు ఎండ తీవ్రత చూపింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం 44 మండలాల్లో తీవ్ర, 193 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశముంది. విజయనగరం, పార్వతీపురంమన్యం, పల్నాడు, నంద్యాల, వైయస్సార్‌ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలతో వడగాడ్పులు వీయనున్నాయి. శ్రీకాకుళం,అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్‌, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలకు అవకాశముంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. సోమవారం అదే పరిస్థితి కొనసాగనుంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 37 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మంగళవారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 43 డిగ్రీల వరకు, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 39 నుంచి 40 డిగ్రీల వరకు, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 35 నుంచి 39 వరకు ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి.
వీలైనంత వరకూ ఇంట్లోనే ఉండాలి: విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్‌
ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్‌ సూచించారు. డీహైడ్రేట్‌ కాకుండా ఉండటానికి ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌ (ఓఆర్‌ఎస్‌), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తాగాలని సూచించారు.
వడదెబ్బ నుంచి విముక్తి ఇలా…
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ప్రభుత్వ యంత్రాంగం వివిధ సూచనలు, జాగ్రత్తలు చేసింది. చెమట పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, వణుకు పుట్టడం, మగత నిద్ర లేదా కలవరింపులు, ఫిట్స్‌ లేదా పాక్షికంగా అపస్మారకస్థితి వడదెబ్బ లక్షణాలని పేర్కొంది. వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే… తీవ్ర ఉష్ణోగ్రతల సమయంలో బయట తిరగకూడదు. రోడ్ల వెంబడి విక్రయించే చల్లని రంగు పానీయాలు తాగరాదు. కలుషిత ఆహారం తినరాదు. మాంసాహారం తగ్గించాలి. తాజా కూరగాయల్ని ఆహారంగా తీసుకోవాలి. మద్యం తాగకూడదు. నీరు, పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ద్రవ పదార్థాలు ఎక్కువుగా తీసుకోవాలి. లేత రంగుల్లో లభించే తేలికైన కాటన్‌ దుస్తులు ధరించాలి. రోజు కనీసం 15 గ్లాసుల నీళ్లు తాగాలి. ఆహారాన్ని తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవాలి. ఎండవేళ ఇంటిపట్టునే ఉండాలి. బయటకు వెళ్లాల్సివస్తే గొడుకు, టోపీ వంటి ధరించి వెళ్లాలి. ఇంట్లో కిటికీలు తెరచి ఉంచాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి చేర్చాలి. చల్లటి నీటితో ముంచిన తడిగుడ్డతో శరీరం అంతా తుడవాలి. ఫ్యాన్‌ గాలి, చల్లటి గాలి తగిలేలా చూడాలి. పిల్లలు, గర్భిణులు, వృద్ధులు మరింత శ్రద్ద తీసుకోవాలి. వడదెబ్బ తగిలి అపస్మారక పరిస్థితిలో ఉన్న రోగికి నీరు తాగించకూడదు. వీలైనంత త్వరగా దగ్గరలోని ఆస్పత్రికి తరలించాలని ప్రభుత్వం సూచనలు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img