Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బీజేపీకి నో ఎంట్రీ

. మమ్మల్ని దిల్లీకి రానివ్వలేదు…మిమ్మల్ని మా ఊరికి రానివ్వం
. అభ్యర్థుల ప్రచారాన్ని అనుమతించం
. పంజాబ్‌ గ్రామాల్లో వెలిసిన పోస్టర్లు
. కాషాయ పార్టీ ఓటమికి రైతు సంఘాల సంకల్పం
. త్వరలో దేశవ్యాప్తంగా ‘జన్‌ పంచాయత్‌’: ఎస్‌కేఎం

న్యూదిల్లీ/భటిండా : తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న రైతులు బీజేపీపై కన్నెర్ర చేశారు. సార్వత్రిక ఎన్నికల వేళ తమ గ్రామాల్లో బీజేపీ ప్రచారాన్ని అడ్డుకోవాలని అన్నదాతలు నిర్ణయించారు. ఆ పార్టీ అభ్యర్థులను అడుగు పెట్టనివ్వమంటూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. ‘మమ్మల్ని దిల్లీకి రానివ్వలేదు…మిమ్మల్ని మా గ్రామాల్లోకి రానివ్వమ’ని ఆ పోస్టర్లు పేర్కొన్నాయి. రాబోయే ఎన్నికల్లో ‘బీజేపీ గుట్టు రట్టు చేయండి… బీజేపీని వ్యతిరేకించండి… బీజేపీని శిక్షించండి’ అని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపునిచ్చింది. దీంతో బీజేపీ అభ్యర్థులను అడ్డుకునేందుకు రైతులు నడుం బిగించారు. పంజాబ్‌ వ్యాప్తంగా బీజేపీకి నో ఎంట్రీ పోస్టర్లు ఏర్పాటు చేశారు. 19 ఏళ్ల శుభకరణ్‌ సింగ్‌ మరణాన్ని నిరసిస్తూ బీకేయూ (ఆజాద్‌) అధ్వర్యంలో సంగ్రూర్‌ జిల్లాలో పోస్టర్లు వెలిశాయి. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే నల్ల సాగు చట్టాలను మళ్లీ తెస్తుందని భటిండా రైతులు ఆరోపించారు. పంజాబ్‌లో బీజేపీ అభ్యర్థులను అడ్డుకోవాలని నిర్ణయించినట్లు బీకేయూ (ఏక్తా ఉగ్రహన్‌) నాయకుడు శింగారా సింగ్‌ మాన్‌ వెల్లడిరచారు. ఏదేని విధానాన్ని రూపొందించే ముందు మా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని ఓడిపోయిన తర్వాతైనా వారికి అర్థమవుతుందని అన్నారు. పంజాబ్‌లోని మిగతా గ్రామాల్లోనూ ‘నో ఎంట్రీ’ పోస్టర్లు కనిపించాయి. బీజేపీ అభ్యర్థులను తమ గ్రామాల్లో ప్రచారం చేయనివ్వమని అనేక రైతు సంఘాలు ప్రకటించాయి.
బీజేపీ ఓటమే లక్ష్యం: కిసాన్‌ మోర్చా
ఎన్నికలు సమీపిస్తుండటంతో తమ ఆందోళనను రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేయాలని రైతులు నిర్ణయంచారు. ఎన్నికల్లో బీజేపీని ఓడిరచాలని సంకల్పించారు. ఇందుకోసం ఉద్యోగ`కార్మిక సంఘాలను కలుపుకొవాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఎస్‌కేఎం అగ్రనేత దర్శన్‌పాల్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా జన్‌ పంచాయత్‌లు నిర్వహించే ఆలోచన ఉన్నదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజామద్దతును సమీకరించేందుకే జన్‌ పంచాయత్‌లని చెప్పారు. మే 21న పంజాబ్‌లో జన్‌ పంచాయత్‌ నిర్వహిస్తామని దర్శన్‌ పాల్‌ వెల్లడిరచారు. మరొక నేత బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌ మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌లకు దారాదత్తం చేయటంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతు వ్యతిరేక విధానాలను ప్రతిఘటించేందుకు, ప్రశ్నించేందుకు తమ ప్రజాస్వామిక హక్కును వినియోగిస్తామన్నారు. హర్యానాలోని రొహటక్‌లో సంయుక్త కిసాన్‌ మోర్చా భేటీ అయి ఈ మేరకు నిర్ణయంచినట్లు సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడిన నాయకులు తెలిపారు. దేశవ్యాప్తంగా జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని, మోదీ ప్రభుత్వ దుశ్చర్యలు, దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రచారం చేస్తామని చెప్పారు. అఖిలభారత కిసాన్‌ సభ నాయకుడు ఇందర్జీత్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘కులం, మతం, ప్రాంతం పేరిట సమాజాన్ని బీజేపీ విభజించింది. ప్రజలను కలపాలని ఎస్‌కేఎం సంకల్పించింది. బీజేపీ ప్రభుత్వ వ్యవస్థలన్నీ నాశనమవుతున్నాయి. వ్యతిరేక గళాలను అణచివేసేందుకు దుర్వినియోగమవుతున్నాయి. దీనిని ప్రతిఘటించేందుకు ప్రజల మద్దతును సమీకరించేందుకు రైతు సంఘాలు సమిష్టింగా ముందుకెళ్లనున్నాయి’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img