Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే…యూసీసీ, జమిలి అమలు

. ఉత్తరాఖండ్‌లో ప్రయోగం చేశాం
. విస్తృతస్థాయిలో చర్చ జరగాలి
. పీటీఐ ఇంటర్వ్యూలో అమిత్‌షా

న్యూదిల్లీ : మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినట్లయితే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ), ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ (జమిలీ) అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. యూసీసీ రాష్ట్రాలు మరియు కేంద్రానికి సంబంధించిన అంశం కాబట్టి తమ పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్‌లో బీజేపీ ఓ ప్రయోగం చేసిందని షా అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలో విస్తృత సంప్రదింపుల తర్వాత దేశం మొత్తానికి యూసీసీ అమలులోకి వస్తుందన్నారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సిన సమయం ఆసన్నమైనందున మోదీ ప్రభుత్వం రానున్న కాలంలో దీనిని అమలు చేస్తుందని షా తెలిపారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈమేరకు వెల్లడిరచారు. ప్రస్తుతం వడగాలులు వీస్తున్నందున ఎన్నికలను శీతాకాలం లేదా సంవత్సరంలో అనుకూల వాతావరణం ఉండే సమయానికి మార్చే అవకాశం గురించి అడిగిన ప్రశ్నకు షా స్పందిస్తూ… ‘మనం దాని గురించి ఆలోచించవచ్చు, ఎన్నికల సమయాన్ని ముందుకు జరపాల్సిందే. అది మనం చేయవచ్చు. ఇది విద్యార్థుల సెలవుల సమయం కూడా. ఇది చాలా సమస్యలను కూడా సృష్టిస్తుంది. కాలక్రమేణా, ఎన్నికలు (లోక్‌సభ) క్రమంగా ఈ కాలానికి (వేసవి కాలంలో) మారాయి’ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి యూసీసీ అనేది మనకు, మన పార్లమెంటు, మన రాష్ట్ర శాసనసభలకు మిగిలి ఉన్న బాధ్యత అని షా అన్నారు.
‘‘రాజ్యాంగ సభ మనకు నిర్ణయించిన మార్గదర్శక సూత్రాలలో యూనిఫాం సివిల్‌ కోడ్‌ కూడా ఉంది. ఆ సమయంలో కేఎం మున్షీ, రాజేంద్ర బాబు, అంబేద్కర్‌ జీ వంటి న్యాయ పండితులు కూడా లౌకిక దేశంలో మతం ఆధారంగా చట్టాలు ఉండకూడదని చెప్పారు. యూనిఫాం సివిల్‌ కోడ్‌ ఉండాలి’’ అని అన్నారు. యూసీసీ 1950ల నుండి బీజేపీ ఎజెండాగా ఉంది. ఇటీవల అది బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో అమలులోకి వచ్చింది. యూసీసీ ఒక అతిపెద్ద సామాజిక, చట్టపరమైన , మతపరమైన సంస్కరణగా నమ్ముతున్నానని షా అన్నారు. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం చేసిన చట్టం సామాజిక, చట్టపరమైన పరిశీలనకు లోబడి ఉండాలని, మత పెద్దలను కూడా సంప్రదించాలని పేర్కొన్నారు. ‘‘నా ఉద్దేశం ఏమిటంటే, దీనిపై విస్తృత చర్చ జరగాలి. ఈ విస్తృత చర్చ తర్వాత ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం చేసిన నమూనా చట్టంలో ఏదైనా మార్పు కావాలనుకుంటే… ఎవరైనా కచ్చితంగా కోర్టుకు వెళతారు. న్యాయవ్యవస్థ అభిప్రాయం కూడా వస్తుంది. ఆ తర్వాత, దేశంలోని రాష్ట్ర శాసనసభలు, పార్లమెంటు దీనిపై తీవ్రంగా చర్చించి చట్టం చేయాలి. అందుకే దేశం మొత్తానికి ఒకే సివిల్‌ కోడ్‌ ఉండాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని మా ‘సంకల్ప్‌ పత్ర’లో రాశాము’’ అని షా వివరించారు. వచ్చే ఐదేళ్లలోపు ఇది సాధ్యమేనా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ… ఈ కాలంలోనే ఇది జరుగుతుందని షా స్పష్టం చేశారు. ‘ఒక దేశం…ఒకే ఎన్నిక’ అమలుకు కూడా అన్ని ప్రయత్నాలు చేస్తామని షా చెప్పారు. దీనిపై కూడా విస్తృత చర్చ జరగాలన్నారు. ‘ప్రధాని మోదీ రామ్‌ నాథ్‌ కోవింద్‌ కమిటీని ఏర్పాటు చేశారు. నేను కూడా అందులో సభ్యుడిని. దాని నివేదిక సమర్పించబడిరది. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సిన సమయం ఆసన్నమైంది’ అని ఆయన అన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే వచ్చే సెషన్‌లో దీనిపై బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ… బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే వచ్చే సెషన్‌లో దీనిపై బిల్లును ప్రవేశపెట్టవచ్చా అని అడిగిన ప్రశ్నకు షా.. ‘మా తీర్మానం ఐదేళ్లు.. ఈ కాలంలోనే తీసుకువస్తాం. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 44 రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలలో యూనిఫాం సివిల్‌ కోడ్‌ను ఒకటిగా పార్టీ పేర్కొంది’ అన్నారు. భారత్‌ యూసీసీని ఆమోదించే వరకు లింగ సమానత్వం ఉండదని బీజేపీ భావిస్తోందని తెలిపారు. ఇది మహిళలందరి హక్కులను పరిరక్షిస్తుందని, ఉత్తమ సంప్రదాయాలను అనుసరించి… వాటిని ఆధునిక కాలానికి అనుగుణంగా ఏకరీతి పౌర స్మృతిని రూపొందించాలని మేనిఫెస్టోలో బీజేపీ తన వైఖరిని పునరుద్ఘాటించిందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img