Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మదర్సా కూల్చివేత… హింస

ఐదుగురి మృతి… వందల మందికి గాయాలు
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఘటన

హల్ద్వానీ : ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన మదర్సా మసీదు కూల్చివేత అనంతరం పెద్ద ఎత్తున హింస చెలరేగింది. గురువారం రాత్రి పోలీసులతో పాటు మదర్సాను కూల్చివేయడానికి వచ్చిన మునిసిపల్‌ కార్మికులపై స్థానికులు రాళ్లు రువ్వడంతో వందల మంది గాయపడ్డారు. ఆందోళనకారులు అనేక వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీస్‌ స్టేషన్‌ను కూడా తగులబెట్టారు. ఈ క్రమంలో ఘర్షణలు చెలరేగడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కర్ఫ్యూ విధించడంతో పాటు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, నగరంలోని బన్‌భూల్‌పుర ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో కొందరు మదర్సాతో పాటు మసీదును నిర్మించారు. వాటిని తొలగించాలని గతంలో నిర్వాహకులకు నోటీసు ఇచ్చినా స్పందించలేదు. దీంతో గురువారం ఉన్నతాధికారులు కోర్టు ఆదేశాల మేరకు మదర్సా కూల్చివేత చేపట్టారు. దీనిపై ఆగ్రహానికి గురైన స్థానికులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళనలకు దిగారు. కూల్చివేతల వద్ద ఉన్న బారికేడ్లు విరగ్గొట్టారు. పోలీసులు, మునిసిపల్‌ సిబ్బంది పైకి రాళ్లు విసిరారు. ఇది ఉద్రిక్తతలకు దారితీయడంతో ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. దీంతో నిరసనకారులు పదుల సంఖ్యలో పోలీసు వాహనాలను ధ్వంసం చేసి… పోలీస్‌ స్టేషన్‌కు నిప్పుపెట్టారు. ఈ ఘర్షణల్లో ఐదుగురు మరణించగా, దాదాపు 300 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది పోలీసులు, మునిసిపల్‌ అధికారులే ఉన్నారని తెలుస్తోంది. అప్రమత్తమైన పోలీసులు హల్ద్వానీలో కర్ఫ్యూ విధించారు. నైనిటాల్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ (డీఎం) వందనా సింగ్‌, పోలీసు సీనియర్‌ సూపరింటెండెంట్‌ (ఎస్‌ఎస్‌పీ) ప్రహ్లాద్‌ మీనా శుక్రవారం ఇక్కడ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎస్‌ఎస్‌పీ మాట్లాడుతూ బంభూల్‌పురా పోలీస్‌ స్టేషన్‌, పోలీసు సిబ్బందిపై అల్లరి మూక దాడి చేసినప్పుడు పోలీసులు ఆత్మరక్షణ కోసం లాఠీఛార్జ్‌ చేయవలసి వచ్చిందని చెప్పారు. తుపాకీ కాల్పుల వల్లే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. గాయపడిన ముగ్గురిలో ఒకరికి తుపాకీ గాయం కాగా, మరో ఇద్దరికి వివిధ రకాల గాయాలు తగిలాయని మీనా తెలిపారు. వారు చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌, పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడినందుకు నలుగురిని అరెస్టు చేశామని, మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు ఎస్‌ఎస్‌పి తెలిపారు. హల్ద్వానీ పట్టణంలోని ప్రజల భద్రతను నిర్ధారించడం, శాంతికి విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించడం తమ ముందున్న బాధ్యత అని అధికారులు తెలిపారు. దాదాపు 15 నుంచి 20 మందితో కూడిన గుంపు ఈ విధ్వంసకాండలో పాల్గొన్నట్లు వివరించారు. పోలీసులు రాళ్లు రువ్వడం, పెట్రోల్‌ బాంబులు విసిరిన గుంపును చెదరగొట్టామన్నారు. ఆ గుంపు నాటు తుపాకులతో సహా ముడి ఆయుధాలతో ఆయుధాలు కలిగి ఉందని, పోలీస్‌ స్టేషన్‌ వెలుపల పార్క్‌ చేసిన వాహనాలకు నిప్పు పెట్టిందని ఆమె చెప్పారు. పోలీసు స్టేషన్‌లో చిక్కుకున్న సిబ్బందికి రక్షణగా అల్లరిమూకల కాళ్లపై కాల్చాలన్న సూచనలతో కాల్పులు జరపాలని ఆదేశాలు జారీ చేసినట్లు డీఎం తెలిపారు. ప్రస్తుతం కర్ఫ్యూ విధించడంతో పట్టణంలో పరిస్థితి అదుపులో ఉందని, సుమారు 1,100 మంది పోలీసులను అక్కడ మోహరించినట్లు ఎస్‌ఎస్‌పీ తెలిపారు. పుకార్లు వ్యాప్తి చెందకుండా హల్ద్వానీలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు ఉన్నాయని, న్యాయస్థానం ఆదేశాల మేరకు ముందస్తు నోటీసులిచ్చి అన్ని చట్టపరమైన లాంఛనాల అనంతరం కూల్చివేసినట్లు డీఎం తెలిపారు. మునిసిపల్‌ కార్పొరేషన్‌ రెండు నిర్మాణాలను పూర్తిగా చట్టబద్ధంగా స్వాధీనం చేసుకున్న తర్వాత కూల్చివేత కార్యక్రమం ప్రారంభమైందని వివరించారు. ‘మదర్సాగా పిలవబడే నిర్మాణం చట్టవిరుద్ధం. అధికారిక రికార్డులలో ఇది మదర్సాగా లేదా మతపరమైన నిర్మాణంగా నమోదు కాలేదు’ అని ఆమె చెప్పారు. కాగా, గురువారం హింస పెరగడంతో హల్ద్వానీలోని దుకాణాలన్నీ మూతపడ్డాయి. కర్ఫ్యూ విధించిన తరువాత, నగరం, చుట్టుపక్కల ఉన్న అన్ని పాఠశాలలను కూడా మూసివేశారు. ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ శుక్రవారం డెహ్రాడూన్‌లోని తన అధికారిక నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పట్టణంలోని బన్‌భూల్‌పురా ప్రాంతంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు హల్ద్వానీలో క్యాంప్‌ చేయాలని శాంతిభద్రల విభాగం పోలీస్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ (ఏడీజీ) ఎ.పి.అన్షుమాన్‌ను ఆదేశించారు. అశాంతిని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించడాన్ని తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి… విధ్వంసకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పోలీసులపై దాడి చేసిన వారిపై ఎన్‌ఎస్‌ఏ : డీజీపీ
హల్ద్వానీలో పోలీసు సిబ్బందిపై దాడి చేసి దహనం, విధ్వంసానికి పాల్పడిన వారిపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద చర్యలు తీసుకుంటామని ఉత్తరాఖండ్‌ డీజీపీ అభినవ్‌ కుమార్‌ శుక్రవారం తెలిపారు. పోలీసులు ‘ఆత్మ రక్షణ కోసం’ బలవంతంగా కాల్పులు జరిపారని చెప్పారు. ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి పరిస్థితిని అంచనా వేయడానికి నైనిటాల్‌ జిల్లాలో హింసాత్మకంగా దెబ్బతిన్న పట్టణంలోని శాంతిభద్రల విభాగం ఏడీజీ అన్షుమాన్‌తో పాటు సందర్శించారు. కర్ఫ్యూ విధించడంతో పరిస్థితి చాలా వరకు అదుపులోకి వచ్చిందని, అయితే రాబోయే 24 గంటల్లో పట్టణంలో సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రస్తుత ప్రయత్నాలు దృష్టి సారించాయని డీజీపీ కుమార్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img