Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కేబినెట్‌ కూర్పుపై కసరత్తు

జనసేనకు నాలుగు, బీజేపీలో ఇద్దరికి ఛాన్స్‌

. పవన్‌్‌కు ఉపముఖ్యమంత్రి
. లోకేశ్‌కు కీలకశాఖ
. నేడు మూడు పార్టీల ఎమ్మెల్యేలతో సమావేశం
. కూటమి నేతగా చంద్రబాబు ఎన్నిక

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఏపీలో మరో 24 గంటల్లో టీడీపీ, జనసేన, బీజేపీతో కూడిన కూటమి కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలతో మంగళవారం సమావేశం జరగనుండగా… చంద్రబాబును కూటమి పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. ఈనెల 12వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే మూహూర్తం ఖరారైంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీతో పాటు ఎన్డీఏ నేతలు, కేంద్ర మంత్రులు హాజరవుతున్నారు. చంద్రబాబుతో పాటు కొందరు కీలక మంత్రులు అదేరోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం దిల్లీ నుంచి అమరావతికి వచ్చీ రాగానే మంత్రివర్గ కూర్పుపై దృష్టి పెట్టారు. కూటమి మంత్రివర్గంలో జనసేన, బీజేపీ భాగస్వాములు కానుండటంతో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి ? ఏ శాఖలు ఎవరికి కేటాయించాలనే అంశాలపై కసరత్తు ప్రారంభించారు. మంత్రివర్గంలో సీనియర్లతో పాటు కొందరు యువ శాసనసభ్యులకు కూడా అవకాశం కల్పించి పాత, కొత్త నేతలతో కూర్పు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈసారి అనేక నియోజకవర్గాల్లో సీనియర్లను పక్కనబెట్టి వారి స్థానాల్లో యువతకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా నారా లోకేశ్‌ యువనేతలను బాగా ప్రోత్సహించారు. ప్రస్తుతం మంత్రివర్గంలో కూడా సీట్ల కేటాయింపులో జరిగిన ఫార్ములా పునరావృతమయ్యే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వంలో చేరుతారా? లేదా అని కొనసాగిన సందిగ్ధతకు తెరపడిరది. దీనిపై పవన్‌ ఇప్పటికే స్పష్టత ఇవ్వడంతో ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఖరారైనట్లు జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం కొన్ని సినిమాలకు ఆయన అంగీకారం తెలపడంతో మంత్రివర్గంలో చేరాలా? వద్దా అనే అంశంపై పవన్‌ ఇప్పటివరకు డైలమాలో ఉన్నారు. అయితే ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ప్రభుత్వంలో చేరడం అవసరమని ఆయన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఒక జాతీయ మీడియాతో పవన్‌ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఇదే అంశంపై చంద్రబాబు, పవన్‌ మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. జనసేనకు నాలుగు మంత్రి పదవులు దక్కనున్నట్లు ప్రాథమిక సమాచారం. అలాగే జనసేన నుంచి ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఏ శాఖలు ఇవ్వాలనే దానిపైనా ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పవన్‌ తర్వాత జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్‌, మండలి బుద్దప్రసాద్‌, కొణతాల రామకృష్ణకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నారా లోకేశ్‌కు కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించనున్నట్లు చంద్రబాబు ఇప్పటికే టీడీపీ సీనియర్లకు సంకేతమిచ్చారు. దీంతో ప్రధాని మోదీ సమక్షంలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, లోకేశ్‌ ప్రమాణ స్వీకారం చేయడం దాదాపు ఖాయం కాగా, వీరితో పాటు మూడు పార్టీలకు చెందిన మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. బీజేపీ నుంచి 8 మంది శాసనసభ్యులు ఎన్నిక కాగా, వారిలో ఇద్దరికి ఖాయంగా మంత్రి పదవులు దక్కే అవకాశాలు కనపడుతున్నాయి. కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి, డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌, ఆదినారాయణ రెడ్డిల్లో ఒకరికి, మరొక పదవి బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి సత్యకుమార్‌ పేరు పరిశీలనకు వచ్చినట్లు బీజేపీ వర్గాలు మిత్రపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన టీడీపీ… రైల్వే, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, ఆరోగ్య, జలశక్తి శాఖల్లో ఏవైనా తమకు ఇవ్వాలని బీజేపీ అగ్రనేతల వద్ద మొర పెట్టుకుంది. ఈ విషయమై టీడీపీ అధినేత చంద్రబాబు వారిని కోరినట్లు ప్రచారం జరిగింది. రాజధాని అమరావతి నిర్మాణం అనుకున్న విధంగా… అనుకున్న సమయానికి పూర్తి కావాలంటే.. పట్టణాభివృద్ధి శాఖ అయితే మంచిదనే అభిప్రాయంలో టీడీపీ శ్రేణులు భావించాయి. ఆంధ్రుల జీవనాడి.. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తి కావాలంటే… జలశక్తి శాఖ అయితే కరెక్ట్‌ అన్న చర్చ కూడా పార్టీలో జరిగింది. కానీ అందుకు భిన్నంగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహననాయుడుకు పౌరవిమానయానశాఖను మోదీ కేటాయించారు. మరో ఎంపీ పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల సహాయమంత్రి నియమించారు. బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ కేటాయించారు. తమ అంచనాలకందని రీతిలో శాఖల కేటాయింపు జరగడంతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. తెలంగాణలో బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డికి కీలకమైన గనులశాఖ కేబినెట్‌ హోదాతో అప్పగించారని, పౌర విమానయాన శాఖతో రాష్ట్రాభివృద్ధికి ఏం మేలు జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. అలాంటి వేళ… ఏ ఏ శాఖలు తమ ఎంపీలకు కేటాయిస్తారని ఆంధ్రులు తీవ్ర ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు తెలంగాణలో ఇద్దరు, కర్ణాటకలో ఇద్దరు, కేరళలో ఒకరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరికీ సైతం ఏ శాఖలు కేటాయిస్తారనే చర్చ సాగుతుంది. ఏదీ ఏమైనా ఈ రోజు రాత్రికి ఏ మంత్రికి ఏ శాఖ కేటాయించారనే అంశంపై ఓ స్పష్టత రానుందని తెలుస్తుంది.
శివసేన (ఏక్‌నాథ్‌ షిండే) అసంతృప్తి
ఇక ఎన్డీయే ప్రభుత్వంలో స్వతంత్ర బాధ్యతలు కలిగిన సహాయ మంత్రిత్వ పదవి దక్కడంపై ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన సోమవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. శివసేన పార్టీ కేబినెట్‌ మంత్రి ఆశిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎన్డీయే ఇతర భాగస్వామ్య పక్షాలకు దక్కిన పదవులను ప్రస్తావిస్తూ శివసేన చీఫ్‌విప్‌ శ్రీరంగ్‌ బర్నే మాట్లాడుతూ… ఐదుగురు ఎంపీలు కలిగిన చిరాగ్‌ పాస్వాన్‌, ఒక ఎంపీ కలిగిన జితన్‌ రాం మాంరీa, ఇద్దరు ఎంపీలు కలిగిన జేడీఎస్‌లకు ఒక్కో కేబినెట్‌ మంత్రి పదవిని కేటాయించారని… తమను మాత్రం ఒకే ఒక్క సహాయ మంత్రి పదవికి పరిమితం చేశారని వాపోయారు.
ఏడు ఎంపీలు ఉన్నప్పటికీ ఒక్క పదవి మాత్రమే ఎందుకు లభించిందని ప్రశ్నించారు. తమకు కేబినెట్‌ మంత్రిత్వ శాఖ వచ్చి ఉండాల్సిందని తెలిపారు. కాగా శివసేన నుంచి ప్రతాప్‌రావ్‌ జాదవ్‌కు స్వతంత్ర హోదా కలిగిన కేంద్ర పదవి దక్కింది. మరోవైపు ఎన్సీపీ అజిత్‌ పవార్‌ వర్గం సైతం తమకు సహాయ మంత్రి పదవితో సరిపెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తమకు కూడా కేబినెట్‌ మంత్రి కావాలని డిమాండ్‌ చేసింది. ఆదివారం ప్రమాణస్వీకారానికి ముందు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర హోదా మంత్రి ప్రతిపాదనను తిరస్కరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img