Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మోదీ మళ్లీ ప్రధాని కాలేరు

. రాబోయేది ‘ఇండియా’ ప్రభుత్వం
. బీహార్‌ ర్యాలీల్లో రాహుల్‌ ఉద్ఘాటన
. పాలిగంజ్‌ సభలో కుంగిన వేదిక

పాట్నా/బక్తియార్పూర్‌/పాలిగంజ్‌: నరేంద్ర మోదీ మరోమారు దేశానికి ప్రధానమంత్రి కాలేరని, ఇండియా కూటమి అనుకూల పవనాలు బలంగా వీస్తున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వక్కాణించారు. జూన్‌ 4 తర్వాత ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని, బాధ్యతలు చేపట్టిన తర్వాత అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేస్తామని, ప్రతి నెలా పేదింటి మహిళ ఖాతాలో రూ.8,500 చొప్పున జమ చేస్తామని ఉద్ఘాటించారు. బీహార్‌లో మహాకూటమి అభ్యర్థులకు మద్దతుగా ఒకదాని తర్వాత ఒకటిగా ర్యాలీల్లో రాహుల్‌ ప్రసంగించారు. 40 స్థానాల్లో గెలుస్తామని దీమాగా చెప్పారు. పాట్నా సాహిబ్‌ లోక్‌సభ నియోజకవర్గంలో మాట్లాడుతూ ‘ప్రస్తుతం ప్రతిపక్షాలపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ సంస్థల నుంచి తనను కాపాడుకునేందుకు ప్రధాని మోదీ ‘పరమాత్మ’ కథ చెబుతున్నారు. పరమాత్మ ప్రస్తావనను ఎందుకు తెచ్చారో మీకు తెలుసా? ఎన్నికల తర్వాత అదానీ గురించి ఈడీ ప్రశ్నిస్తే… నాకేమీ తెలియదు. అలా చేయమని పరమాత్మ ఆదేశించారు అని చెప్పేందుకే..’ అంటూ రాహుల్‌ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రసంగాల్లో ఇటువంటి మాటలు మాట్లాడటాన్ని ఆపేయాలని మోదీకి హితవు పలికారు. ‘పెద్ద పెద్ద ఉపన్యాసాలిస్తూ దేశాన్ని విభజించడం ఆపండి. గత పదేళ్లలో దేశంలో, బీహార్‌లో యువతకు ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పండి’ అంటూ నిలదీశారు. ప్రధాని పీఠాన్ని మోదీ తిరిగి అధీష్టించలేరన్నారు. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లోఇండియా కూటమి ‘తుపాను’ వస్తోందని రాహుల్‌ అన్నారు. బక్తియార్పూర్‌ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక అగ్నిపథ్‌ పథకం బుట్ట దాఖలవుతుందని ప్రకటించారు. సైనికులను కార్మికులుగా మార్చిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందని వ్యాఖ్యానించారు. ఆర్మీని కూడా చీల్చేసిందని, అగ్నివీరులకు అమర సైనికుడి హోదాను, పరిహా రాన్ని నిరాకరించిందని దుయ్యబట్టారు. వివక్ష ఎందుకంటూ రాహుల్‌ ప్రశ్నించారు. వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేలా మోదీ వ్యూహాలు రచించారని విమర్శించారు. అదానీ, అంబానీ రాజులని, వారి బాగు కోసమే ప్రధాని మోదీ 24గంటలు పనిచేస్తారని వ్యాఖ్యానించారు. ‘మోదీ 22`25 మంది రాజులను, మహారాజులను తయారు చేశారు. వారి మేలు కోసం 24 గంటలు పనిచేస్తారు. ఆ రోజుల పేర్లు అదానీ, అంబానీ’ అని రాహుల్‌ వ్యంగాస్త్రాలు సంధించారు. పేదలను లక్షాధికారులుగా మార్చేంత వరకు ఇండియా కూటమి విశ్రమించబోదని రాహుల్‌ నొక్కిచెప్పారు. ఇందుకు మహాలక్ష్మి యోజన తొలి అడుగుగా చెప్పారు. బీహార్‌లో ఐదు లక్షల ఉద్యోగాలను తేజస్వీ యాదవ్‌ కల్పించారని, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చా క 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఫలితాలు వెలువడిన వెంటనే ఇందుకు చర్యలు చేపడతామని హామీనిచ్చారు. బీహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, సీపీఐ(ఎంఎల్‌) ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య, వీఐపీ అధ్యక్షుడు ముకేశ్‌ సహనితో పాటు ఇండియా కూటమి నేతలు ఈ ర్యాలీల్లో పాల్గొన్నారు.
పాలిగంజ్‌ సభలో కుంగిన వేదిక రాహుల్‌ గాంధీకి తృటిలో ముప్పు తప్పింది. బీహార్‌లోని పాలిగంజ్‌లో నిర్వహించిన ప్రచార సభలో ఆర్జేడీ నేతలు తేజస్వీ యాదవ్‌, మీసా భారతితో కలిసి రాహుల్‌ పాల్గొన్నారు. వేదికపైకి వెళ్లే సమయంలో అది కాస్త కుంగింది. అప్పటికే చాలామంది నాయకులు ఉండటంతో వేదిక పాక్షికంగా కూలింది. మీసా భారతి చేయి పట్టుకుని నడుస్తున్న రాహుల్‌ పడిపోయబోయి నిలద్రొక్కుకున్నారు. భద్రతా సిబ్బంది వెంటనే ఆయనను కిందకు దిగాలని సూచించారు. అయితే తనకు ఏమీ కాలేదని, కంగారు పడవద్దని భద్రతా సిబ్బందితో రాహుల్‌ చెప్పారు. అదే వేదికపై నుంచి ప్రసంగించారు. కుంగిన వేదిక వద్ద రాహుల్‌ అదుపుతప్పిన వీడియో క్లిప్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img