ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాలను రేపు ప్రకటించనున్నారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేయనున్నారు. ఫలితాలను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునేలా ఆప్షన్ ఇచ్చారు. కాగా కరోనా కారణంగా ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉంటాయోనని విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది.