Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రేపు ప్రజాతీర్పు

. మరికొన్ని గంటలే
. ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
. ఏకకాలంలో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఫలితాలు
. ప్రతి అర్థగంటకూ రౌండ్‌ పూర్తి
. ఫలితంపై ఉదయం 11 గంటలకు స్పష్టత

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : ఆంధ్ర ప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు కొన్ని గంటల్లో తెరపడనుంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రజాతీర్పు ఈనెల 4న వెల్లడికానుంది. మే 13వ తేదీన హోరాహోరీగా ఎన్నికలు ముగిశాయి. స్ట్రాంగ్‌ రూమ్‌లలోని ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లు అధికంగా ఎవ్వరి పక్షమనేదీ స్పష్టం కానుంది. ఈ ఫలితాల కోసం దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఆంధ్ర ప్రదేశ్‌ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి మెజార్టీ వస్తుందీ, లేనిదీ ఇక గంటల్లోనే స్పష్టం కానుంది. ఈ ఎన్నికల్లో కోట్లాది రూపాయల బెట్టింగ్‌లు నడిచాయి. ఉభయ గోదావరి జిల్లాల నుంచి అధికంగా పార్టీలు, అభ్యర్థుల గెలుపు, ఓటములపై బెట్టింగ్‌లు కాశారు. తాజాగా విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ జాతీయ, ప్రాంతీయ సంస్థలు విభిన్న సంకేతాలు చూపాయి. ఇవి పోటీలో ఉన్న అభ్యర్థులపై మరింత ఒత్తిడిని పెంచాయి. అధికార వైసీపీ ఒంటరిగాను, ఇండియా, ఎన్డీఏ కూటమి పార్టీలు పొత్తులతో బరిలోకి దిగాయి. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరు గెలుస్తారనేదీ గంటల్లో తేలనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ బందోబస్తుతో పటిష్ట ఏర్పాట్లు చేపట్టారు. 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు గాను రౌండ్ల వారీగా ఫలితాల ప్రకటనకు ప్రణాళిక రూపొందించారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై 11 గంటల కల్లా ఫలితాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తొలి ఫలితం ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కొవ్వూరు, నర్సాపురం నియోజకవర్గాల నుంచి వెలువడే అవకాశం ఉంది. ప్రతి అర్థగంటకూ ఒక రౌండ్‌ పూర్తికానుంది. నంద్యాల జిల్లా పాణ్యం, విశాఖ జిల్లా భీమిలిలో ఆలస్యంగా ఫలితం వెల్లడవుతుంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభించి, అనంతరం ఈవీఎంలు లెక్కిస్తారు. ఈ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపుపై ఎన్నికల న్యూదిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్డీయే గెలుస్తుం దని ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడటం, అవి బూటకమని ఇండియా కూటమి ప్రతిఘటిస్తుండటం తో విజయం ఏ పక్షాన్ని వరిస్తుందని భారతీయులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓట్ల లెక్కింపు మంగళవారం జరగబోతోంది. దీంతో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా రిగ్గింగ్‌కు ఆస్కారం లేకుండా చూడాలని తమ కేడర్‌కు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సూచనలు చేశారు. పార్టీ లోక్‌సభ అభ్యర్థులు, శాసనసభ నేతలు, రాష్ట్ర శాఖాధ్యక్షులతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి 4వ తేదీన తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు. ఓట్ల లెక్కింపు రోజు కోసం చేసిన ఏర్పాట్లను సమీక్షించారు. సమావేశంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శులు జైరాం రమేశ్‌, కేసీ వేణుగోపాల్‌తో పాటు కొందరు సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. జైరాం రమేశ్‌ మాట్లాడుతూ శనివారం వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ పూర్తి స్థాయిలో బూటకమైనవిగా, 4వ తేదీన నిష్క్రమించాల్సిన వ్యక్తి బుర్రాటని వ్యాఖ్యానించారు. 150 జిల్లాల మెజిస్ట్రేట్లు, కలెక్టర్లకు ఫోన్లు చేసి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. ఎగ్జిట్‌ పోల్స్‌కు వాస్తవ పరిస్థితితో సంబంధమే లేదన్నారు. అటు ఇండియా కూటమి నాయకులంతా కూడా 295 స్థానాల్లో గెలుపు తథ్యమని, ప్రభుత్వం ఏర్పాటునకు సరిపడ మెజారిటీ సాధిస్తామని విశ్వాసంగా చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img