Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రేపే బాబు పట్టాభిషేకం

. మోదీ రాకను ఖరారు చేసిన పీఎంవో
. 80 వేల మందికి సిట్టింగ్‌ ఏర్పాట్లు
. సీఎం ప్రమాణ స్వీకారం ప్రత్యక్ష ప్రసారం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్‌కు రెండోసారి, మొత్తంగా నాల్గవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం ఉదయం 11.27 నిముషాలకు ముహూర్తం నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ రాక అధికారికంగా ఖరారైంది. ఈ మేరకు పీఎంవో నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందిం చింది. దీంతో అధికారులు ప్రమాణ స్వీకార ఏర్పాట్లను మరింత శరవేగం చేశారు. దాదాపు 80 వేల మందికి సిట్టింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా జర్మనీ టెక్నాలజీతో కూడిన షామియానాలు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక, బారికేడిరగ్‌, వీవీఐపీ, వీఐపీ, మీడియా గ్యాలరీ ఏర్పాట్లు పక్కాగా చేపడుతున్నారు. ప్రధానమంత్రి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు గన్నవరం విమానాశ్రయం నుండి ప్రధాన సభ వేదిక వద్దకు నేరుగా చేరుకునేందుకు ఎటువంటి అడ్డంకులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన వేదికతో పాటు ముఖ్య నేతలు ప్రయాణించే మార్గాలు, పార్కింగ్‌ ప్రదేశాలలో సీసీటీవీ ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమానికి ముందుగా హాజరయ్యే ప్రముఖులకు విజయవాడ నగరంలోని స్టార్‌ హోటళ్లలో వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. సభా ప్రాంగణానికి అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా అందించడంతోపాటు సభకు వచ్చే అతిథులకు, ప్రజలకు మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు, అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన వేదికను ఉద్యానవన శాఖాధికారులు పుష్పాలంకరణతో అత్యంత ఆకర్షణీయంగా ముస్తాబు చేస్తున్నారు. ఎంపిక చేసిన లేఅవుట్‌, గంగరాజు, విమానాశ్రయం, వెటర్నరీ కళాశాల, మేధా టవర్సు, పెట్రోల్‌ బంకు వద్ద గల పార్కింగ్‌ ప్రదేశాల నుండి ప్రధాన సభకు చేరుకునేందుకు వీలుగా అప్రోచ్‌ రహదారులు నిర్మించారు. మంగళ వారం సాయంత్రానికి ఏర్పాట్లు అన్నీ పూర్తి కావాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి, కార్యక్రమ రాష్ట్ర సమన్వయ అధికారి పీిఎస్‌ ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలోని ఐటి పార్కు మేధ టవర్స్‌ సమీపంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రధాన వేదిక వద్ద అధికారులతో కలసి ఏర్పాట్లు పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన ఏర్పాట్లు, ఇంకా చేయాల్సిన ఏర్పాట్లపై ఉన్నతాధికారులు వీరపాండ్యన్‌, రాష్ట్ర ఉద్యానవనశాఖ కమిషనర్‌ ఎస్‌ఎస్‌ శ్రీధర్‌, రాష్ట్ర పోలీస్‌ అధికారులు, వివిధ జిల్లాల నుండి విధుల నిర్వహణ కోసం విచ్చేసిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, కృష్ణ్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ తదితరులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రద్యుమ్న మాట్లాడుతూ ఈనెల 12వ తేదీన సీఎంగా చంద్రబాబు చేసే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు విచ్చేయనున్నందున భారీ పోలీస్‌ బందోబస్తుతో ఏర్పాట్లు పటిష్టవంతంగా చేయాలని ఆదేశించారు. వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన మందులు, అంబులెన్స్‌ సిద్ధంగా ఉంచాలన్నారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అన్ని జిల్లాల ప్రజలు వీక్షించేందుకు వీలుగా ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్‌ గీతాంజలి శర్మ, వివిధ జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు, సబ్‌ కలెక్టర్లు, ఆర్డీవోలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img