Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Wednesday, September 25, 2024
Wednesday, September 25, 2024

రైతుల ప్రసన్నత కోసం కేంద్రం పాట్లు

వ్యవసాయమంత్రి చౌహాన్‌తో ఎంఎస్‌పీపై చర్చలు
కేంద్రం ముందు నాలుగు ప్రతిపాదనలు

న్యూదిల్లీ : ఎన్నికల వేళ రైతులను ప్రసన్నం చేసుకునేందుకు కేంద్రం నానాతంటాలు పడుతోంది. ప్రత్యేకించి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం రైతులతో సంప్రదింపులు ప్రారంభించింది. అన్నదాతల ఆగ్రహంతో లోక్‌సభ ఎన్నికల్లో డీలాపడిన బీజేపీ…తిరిగి కోలుకొనేందుకు యత్నిస్తోంది. రైతన్నతల మద్దతు పొంది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని కాంక్షిస్తోంది. త్వరలోనే హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జమ్మూకశ్మీర్‌ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ ముగిసింది. జార్ఖండ్‌లోనూ అక్టోబరులో ఎన్నికలు జరుగుతాయి. ఈ పరిస్థితుల్లో రైతు నేతలతో చర్చలకు కేంద్రప్రభుత్వం పూనుకుంది. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)తో పాటు పెండిరగ్‌ సమస్యల పరిష్కారంపై మంగళవారం తొలి విడత చర్చలు జరిపింది. దిల్లీలోని ఐసీఏఆర్‌` పుసా కాంపెక్స్‌లో జరిగిన ఈ సమావేశానికి 50 మంది రైతు నేతలు హాజరయ్యారు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అధ్యక్షత వహించారు. ఉత్తరప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌ నుంచి బీకేయూ (రాజకీయేతర) ప్రతినిధులు పాల్గొన్నారు. తమ డిమాండ్ల పత్రాన్ని చౌహాన్‌కు అందజేశారు. తొలుత చౌహాన్‌ మాట్లాడుతూ రైతాంగ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఈ చర్చలు సత్ఫలితాలు ఇస్తాయని ఆకాంక్షించారు. ఎంఎస్‌పీపై వచ్చిన సూచనలన్నింటినీ పరిశీలిస్తామని హామీనిచ్చారు. బీకేయూ జాతీయ అధికార ప్రతినిధి అరజ్నైతిక్‌ మాట్లాడుతూ ‘ఎంఎస్‌పీ, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి, ఫసల్‌ బీమా పథకం కింద కవరేజి తగ్గడం, వ్యవసాయోత్పత్తుల దిగుమతుల వల్ల రైతులకు ఆర్థిక నష్టాలు’ వంటి నాలుగు అంశాలనే ప్రధానంగా చర్చించామన్నారు.
కొన్ని సూచనలు చేశామని చెప్పారు. మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. శంభు సరిహద్దు వద్ద ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలు ఎవరూ తాజా చర్చల్లో పాల్గొనలేదని తెలిపారు. చర్చలకు ముందుకు రావాలని ఆందోళన చేస్తున్న రైతు సంఘాలకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎంఎస్‌పీ సమస్యకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img