Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రైతు తిరగబడాలి

. పాలకులకు బుద్ధిచెప్పాలి
. రైతులు రాజకీయంగా ఎదగాలి
. రైతుసంఘం రాష్ట్ర ప్రతినిధుల సభలో రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో – రాజమహేంద్రవరం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రైతులను అడుగడుగునా దగా చేస్తున్నాయని, కార్పొరేట్‌ శక్తులకు నిర్లజ్జగా ఊడిగం చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. రాజమండ్రిలో రెండు రోజుల నుంచి జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం రాష్ట్ర 18వ మహాసభల ప్రతినిధుల సభకు రామకృష్ణ మంగళవారం ముఖ్య అతిథిగా వచ్చారు. రామకృష్ణ మాట్లాడుతూ అన్నదాతను అన్ని విధాలా ఆదుకుంటామని రాజకీయ పార్టీలు ప్రకటనలు చేయడమే తప్ప…గిట్టుబాటు ధర కల్పించాలన్న ఆకాంక్ష కనిపించడం లేదన్నారు. కార్పొరేట్‌ కంపెనీలపై ఉన్న ప్రేమ రైతులపై లేదన్నారు. గిట్టుబాటు ధరతో పాటు వ్యవసాయ రంగానికి అవసరమైన సబ్సిడీ కూడా ఇవ్వకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో సాగిన రైతు పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. రైతు సమస్యలపై రాజీలేని పోరాటాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మతోన్మాద, అభివృద్ధి నిరోధక పార్టీ దేశాన్ని పాలిస్తున్నదని మండిపడ్డారు. దీనివలన ప్రభుత్వరంగ వ్యవస్థలు ధ్వంసమవుతున్నాయన్నారు. మూడోసారి తామే అధికారంలోకి వస్తామని బీజేపీ పగటికలలు కంటున్నదని ఎద్దేవా చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న హామీ అమలు జరగకపోగా…వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. జనవరి 22న అయోధ్యలో రామమందిర విగ్రహ ప్రతిష్ఠకు వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని, ఎన్నికల్లో ప్రజలను పక్కదారి పట్టించేందుకు రామమందిరాన్ని మోదీ తెరపైకి తెచ్చారని విమర్శించారు. మనువాద రాజ్యాంగం అమలు కోసం మోదీ సర్కార్‌ తహతహలాడుతోందన్నారు. ఈ ఏడాది చాలా కీలకమైనదని, ఈ దేశానికి లౌకకవాదం కావాలా, మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీ కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంతో పాటు న్యాయవ్యవస్థను శాసించే స్థాయికి బీజేపీ వచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో వైసీపీని ఓడిరచాలని రైతుప్రతినిధులకు పిలుపునిచ్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసిన ముఖ్యమంత్రులతో పోల్చుకుంటే జగన్‌మోహన్‌రెడ్డి వంటి నియంత ఎవరూ లేరని రామకృష్ణ అన్నారు. ఎన్నికల ముందు చెప్పిన ఏ ఒక్క హామీని జగన్‌ అమలు చేయలేదన్నారు. విభజన హామీలు సాధించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రత్యేక హోదా లేదు. రైల్వేజోన్‌, కడప స్టీల్‌ప్లాంట్‌, పోలవరం ప్రాజెక్టు, పోర్టులు సాధించకపోగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నా జగన్‌ నోరెత్తడం లేదని విమర్శించారు. ఉద్యోగులు, కార్మికులు రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారన్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించడం, ఎస్మా ప్రయోగించడం నిత్యకృత్యంగా మారిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడిరచాలని పిలుపునిచ్చారు. రైతుల్లో రాజకీయ చైతన్యం పెరగాలని సూచించారు. రాష్ట్రంలో 460 కరువు మండలాలు ఉంటే 116 మండలాలను ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. సమస్యల పరిష్కారం కోసం రైతులందరూ సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశానికి అన్నంపెట్టే రైతు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకుంటున్నాడన్నారు. రైతు ఉద్యమాన్ని

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img