Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రోడ్డెక్కిన డీఎస్సీ అభ్యర్థులు

. ఆందోళనలు ఉధృతం
. అర్ధనగ్న ప్రదర్శనలు, రాస్తారోకోలు
. వయోపరిమితి, పోస్టుల సంఖ్య పెంపు కోసం పట్టు
. లక్షలాది మంది పడిగాపులు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : డీఎస్సీ అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని, 20 వేలకుపైగా పోస్టులతో డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో జగన్‌ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు. అర్ధనగ్న ప్రదర్శనలు, రాస్తారోకోలతో ఉద్యమాన్ని ఉధృతం చేశారు. భిక్షాటనతో వినూత్న నిరసనకు దిగుతున్నారు. విద్యార్థి, యువజన సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాయి. రాజకీయ పార్టీలు సంఫీుభావం తెలుపుతున్నాయి. ఇది సీఎం జగన్‌ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్నికల వేళ నిరుద్యోగ అభ్యర్థులు రోడ్డెక్కడంతో వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల నుంచి డీఎస్సీ అభ్యర్థులంతా శిక్షణ పొందే ఇనిస్టిట్యూట్ల దగ్గర ఆందోళనలు చేస్తున్నారు. కలెక్టరేట్ల వరకు ప్రదర్శనలు నిర్వహించి, ముట్టడికి ప్రయత్నిస్తున్నారు. త్వరలో సీఎం క్యాంపు కార్యాలయం లేదా రాష్ట్ర సచివాలయం ముట్టడికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో పీఆర్సీ, తదితర డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు చేపట్టిన చలో విజయవాడతో ప్రభుత్వం ఉలిక్కిపడిన విషయం విదితమే. ముగిసిన శాసనమండలి సమావేశాల్లో డీఎస్సీ పోస్టులపైన, వయోపరిమితి పెంచాలంటూ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలు పట్టుపట్టారు. ఐదేళ్ల నుంచి డీఎస్సీ లేకపోవడంతో ఉపాధ్యాయ నిరుద్యోగుల సంఖ్య ఎనిమిది లక్షలకు చేరింది. వారిలో 2 లక్షల మంది వరకు వయోపరిమితి మించిపోతోంది. ఐదేళ్ల నుంచి డీఎస్సీ జాప్యం చేసి, ఎన్నికల ముందు మొక్కుబడిగా ప్రకటన ఇవ్వడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
2018 పునరావృతం
టీడీపీ ప్రభుత్వ హయాంలో డీఎస్సీ`2018 ఇచ్చే సమయంలో ఇదే పరిస్థితి ఎదురైంది. భారీ పోస్టులతో ఉపాధ్యాయ నిరుద్యోగులంతా మెగా డీఎస్సీ ఇస్తారని ఆశించగా, ఐదువేల పోస్టులతోనే సరిపెట్టారు. దీంతో నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహానికి గురై ఉద్యమించారు. చంద్రబాబు పాల్గొన్న సభల్లో పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. పదేపదే టీడీపీ నేతలను కలిసి మెగా డీఎస్సీ ఇవ్వాలని కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. డీఎస్సీ 2018కి జనరల్‌ అభ్యర్థుల (ఓసీ) వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పెంచి వదిలేసింది. పోస్టుల సంఖ్య మాత్రం పెంచలేదు. దీంతో వేలాదిమంది అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కలేదు. అదేసమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌ యేటా పది వేల పోస్టులతో మెగా డీఎస్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. జగన్‌ అధికారం చేపట్టాక రెండేళ్లపాటు కరోనా ఉన్నప్పటికీ… మిగిలిన మూడేళ్లల్లో ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వలేకపోయారు. కారణాలు ఏవైనా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగింది. చాలామంది వయస్సు మించిపోయి డీఎస్సీకి దరఖాస్తు చేసేందుకు అనర్హలవుతున్నారు. ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారంతా అదే పోస్టుల కోసం ప్రయత్నిస్తుంటారు. ప్రభుత్వపరంగా ఉపాధ్యాయ పోస్టులు వచ్చేంత వరకు ప్రైవేట్‌ పాఠశాలల్లో అరకొర వేతనాలతో చేస్తుంటారు. దాదాపు ఐదేళ్ల తర్వాత 30 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వస్తుందని నిరుద్యోగులు భంగపాటుకు గురయ్యారు. దీంతో ఉద్యమం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమయ్యారు. ప్రతిపక్ష నేతలను కలుస్తూ డీఎస్సీ పోస్టుల సంఖ్యతోపాటు వయోపరిమితి పెంపునకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరుతున్నారు. ఇటీవల జనసేన నాయకులు నాగబాబు, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలతోపాటు వివిధ పార్టీల నేతలకు నిరుద్యోగ అభ్యర్థులు వినతిపత్రాలు అందజేశారు. డీఎస్సీ పోస్టుల సంఖ్య పెంచాలంటూ సీఎం జగన్‌కు అన్ని పార్టీల నేతలు లేఖలు రాసినప్పటికీ స్పందించలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు ఐదేళ్ల ఆలస్యంతో డీఎస్సీ ఇవ్వడం వల్ల ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థుల వయోపరిమితి మించిపోయింది. ఈనెల 12వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్‌ రానుంది. దీంతో జనరల్‌ అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి అదనంగా 49 ఏళ్ల వరకు పెంచాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు యథాతథంగా ఉండేలా చూడాలని అభ్యర్థిస్తున్నారు.
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం
ఉపాధ్యాయ నిరుద్యోగుల జీవితాలతో ఈ ప్రభుత్వం ఆటలాడుతోంది. టీడీపీ ప్రభుత్వం చివరి దశలో డీఎస్సీ 2018 ద్వారా విడుదల చేసిన దాదాపు ఐదువేల పోస్టుల భర్తీ ప్రక్రియ ఎన్నికల కోడ్‌తో నిలిచిపోయింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని భర్తీ చేసింది. అప్పటి నుంచి నేటి వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వలేదు. ఐదేళ్ల తర్వాత ప్రకటించిన డీఎస్సీలో కేవలం 6100 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఎస్జీటీ పోస్టులు 2,280 అతి తక్కువుగా ఉన్నాయి. డీఎస్సీకి అత్యధికంగా ఎస్జీటీ అభ్యర్థులు సన్నద్ధమవుతారు. డీఎడ్‌, బీఈడీ వారికి ఎస్జీటీ రాసుకునే అవకాశముంది. రాబోయే నోటిఫికేషన్‌లో జిల్లాకు సింగిల్‌ డిజిట్‌లో ఎస్జీటీ పోస్టులు ఉండటంపై అభ్యర్థులు కలవర పడుతున్నారు. తెలుగు సబ్జెక్టు (ఎస్‌ఏ)పోస్టులు భారీగా తగ్గిపోయే పరిస్థితి ఉంది. రోస్టర్‌ వారీగా చూస్తే రిజర్వేషన్‌ వర్గాలకు సబ్జెక్టుకు పట్టుమని పది పోస్టులు కేటాయించలేదు. డీఎస్సీ అంటే పాఠశాల విద్యా పరిధిలోని ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌, భాషా పండితుల పోస్టులతో ప్రకటిస్తారు. మిగిలిన యాజమాన్య పరిధిలోని ఉపాధ్యాయ పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్‌ ఇస్తారు. ఈ ప్రభుత్వం తెలివిగా పాఠశాల విద్యతో కలిపి ఏడు యాజమాన్యాల కింద ఉన్న ఖాళీలను ప్రకటించి, నిరుద్యోగులను నిలువునా మోసగించిందని వాపోతున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్యను, అభ్యర్థుల వయోపరిమితిని పెంచాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. లేకుంటే రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img