Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వేల ఎకరాల భూకబ్జా

వైసీపీ నేతలతో అధికారుల కుమ్మక్కు
చర్యలు తీసుకోవాలని సీపీఐ భారీ ర్యాలీ, ధర్నా

విశాలాంధ్ర – బద్వేలు : కడప జిల్లాలో వైసీపీ నేతలు కబ్జా చేసిన భూములు స్వాధీనం చేసుకొని…పేదలకు పంచాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ ఆందోళనకు దిగింది. సీపీఐ బద్వేలు ఏరియా సమితి అధ్వర్యంలో పట్టణంలో భారీ ప్రదర్శన, బద్వేలు ఆర్‌డీఓ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ముందుగా పార్టీ కార్యాలయం నుంచి ఆర్‌డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, ప్రజలు వేలాదిగా ర్యాలీలో పాల్గొన్నారు. భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని, ఆ స్థలాలను పేదలకు పంచాలని నినదించారు. ఆర్‌డీఓ కార్యాలయం వద్ద సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గం అక్కింగుండ్ల పొలం మొదలుకొని అట్లూరు వరకు దాదాపు 30 వేల ఎకరాల ప్రభుత్వ భూములను వైసీపీ నాయకులు ఆక్రమించుకున్నారని విమర్శించారు. అవి పేదలకు దక్కాల్సిన భూములని చెప్పారు. రెవెన్యూ అధికారుల ప్రోత్సాహంతో నాయకులు ఇష్టానుసారం భూములు ఆక్రమించుకున్నారని తెలిపారు. కబ్జాదారులను, వారికి సహకరించిన అధికారులను కఠినంగా శిక్షించాలని గాలి చంద్ర డిమాండ్‌ చేశారు. రెండు సెంట్ల భూమి ఆక్రమించుకొని…ఇళ్లు నిర్మించుకునే పేదలపై చర్యలు తీసుకునే అధికారులు వేల ఎకరాలు కబ్జా చేసినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. అధికారుల సహకారంతో నాయకులు ఎకరాలకు ఎకరాలు ఆక్రమించుకొని…కంచె ఏర్పాటు చేసి…చెట్లు నాటుకున్నా పట్టించుకోలేదన్నారు. ఎన్‌జీఓలకు కేటాయించిన స్థలాలు, ప్రజావసరాలకు సంబంధించిన స్థలాలను సైతం నాయకులు వదిలిపెట్టలేదన్నారు. ఆక్రమించుకున్న స్థలాల్లో ప్రహరీగోడలు నిర్మించి…భారీ నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. ఈ మొత్తం భూ అక్రమాలపై సీపీఐ ఎప్పటికప్పుడు అధికారులకు వినతిపత్రాలు అందించిందని గుర్తుచేశారు. కబ్జాకు గురైన స్థలాలు ఏ గ్రామంలో…ఏ సర్వే నెంబరులో ఉన్నాయో గాలి చంద్ర వివరించారు.
కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖం, ఏరియా సహాయ కార్యదర్శి పిడుగు మస్తాన్‌, బద్వేలు పట్టణ కార్యదర్శి పి.బాలు, ఏరియా కార్యవర్గ సభ్యులు పీవీ రమణ, రవికుమార్‌, విజయమ్మ, కేశవ, పెంచలయ్య, ఇమ్మానుయేలు, భగత్‌ సింగ్‌ కాలనీ కన్వీనర్‌ బి.అనిల్‌, నాయకులు నాగసుబ్బయ్య, సుబ్బారెడ్డి, ఏసన్న, ఓబులమ్మ, వెంకటయ్య, సలోమి, కుమారి, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img