Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వైసీపీ, టీడీపీలో గందరగోళం

. రాజీనామా చేస్తానని ప్రకటించిన ఎంపీ కేశినేని
. కేశినేనితో ఎంపీ కనకమేడల భేటీ
. వైసీపీకి అంబటి రాయుడు గుడ్‌ బై
. మూడో జాబితాపై అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ, టీడీపీలో గందరగోళం నెలకొంది. ఎవరు ఎప్పుడు పార్టీ నుంచి వీడతారో, ఇక వచ్చిన వారు ఉంటారో? లేదో తెలియక అధినాయకత్వాలు ఆందోళన చెందుతున్నాయి. తాజాగా క్రికెటర్‌ అంబటి రాయుడు అధికార పార్టీ వైసీపీకి రాజీనామా సీఎం జగన్‌కు షాక్‌ ఇచ్చారు. ఇటీవలే ఆయన వైసీపీలో చేరారు. అయితే చేరిన కొద్దిరోజుల్లోనే పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అంబటి రాయుడు గుంటూరు ఎంపీ సీటును ఆశించగా, అందుకు అధిష్ఠానం అంగీకరించలేదని సమాచారం. మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని సీఎం సూచించగా, దానికి అయిష్టత చూపిన అంబటి రాజీనామా చేసినట్లు తెలిసింది. కొంతకాలం నుంచి అంబటి రాయుడు ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యాపరమైన సంక్షేమ పథకాలు, నాడునేడు పాఠశాలల అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తూ, వాటిపై ప్రచారం చేస్తున్నారు. అలాగే, ఆడుదాంఆంధ్రా కార్యక్రమానికి కూడా ఆయన అంబాసిడర్‌గా ఉన్నారు. గుంటూరు ఎంపీగా అంబటి రాయుడుకు సర్వేలో వ్యతిరేకంగా వచ్చినట్లు తెలిసింది. దీంతో నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు ఎంపీగా వెళ్లాలని సూచించినట్లు తెలిసింది. అంబటి రాయుడును మచిలీపట్నం పంపేలా అధిష్ఠానం ఆలోచించింది. దీనిని గుర్తించిన అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొంత కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ట్వీట్‌ చేశారు. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల మాట్లాడుతూ అంబటి రాయుడు ఎందుకు రాజీనామా చేశారో తమకు తెలియదని అన్నారు.
కేశినేని రాజీనామా ప్రకటనతో టీడీపీకి షాక్‌
విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) నిర్ణయం పార్టీ అధినేత చంద్రబాబుకు, టీడీపీకి గట్టి షాక్‌ ఇచ్చింది. త్వరలో తాను ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మళ్లీ ట్వీట్‌ చేయడంతో ఆ పార్టీ శ్రేణులు గందరగోళానికి గురయ్యారు. విజయవాడ ఎంపీ సీటు వ్యవహారంపై కేశినేని నానికి, ఆయన సోదరుడు కేశినేని చిన్ని మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం విదితమే. వాటిని గుర్తించిన టీడీపీ అధిష్ఠానం తిరువూరులో జరిగే సభకు కేశినేని నానిని దూరంగా ఉంచింది. అప్పటి నుంచి ఆయన కలత చెందుతూ అధిష్ఠానంపై ట్వీట్లు పెడుతున్నారు. ఒక వైపు చంద్రబాబు నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు ఆయన ప్రకటిస్తూనే, మరో వైపు ఆయన అసంతృప్తిని వెల్లడిస్తున్నారు. తన అనుచరులతో భేటీలు నిర్వహించి ప్రత్యామ్నాయంపై చర్చిస్తున్నారు. దీంతో ఆయన ఇతర పార్టీలకు వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిసింది. పైకి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని కేశినేని చెప్పినా, ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. దీంతో కేశినేని ఎంపీ కార్యాలయానికి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవికుమార్‌ వెళ్లారు. దాదాపు గంటకుపైగా కేశినేని నానితో ఆయన రహస్యంగా చర్చించారు. పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో అధిష్ఠానం తరపున కనకమేడల దూతగా వచ్చినట్లు తెలిసింది. ఈ భేటీలోని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. మొత్తం మీద విజయవాడ, గుంటూరు నగరాల్లోని రాజకీయ పరిస్థితులు అధికార వైసీపీకి, ప్రతిపక్ష టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారాయి.
మూడో జాబితాపై సీఎం కసరత్తు
వైసీపీ మూడో జాబితాపై ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ కసరత్తు చేస్తున్నారు. ఈ జాబితాలో 10 నుంచి 15 మందిని మార్చే అవకాశం ఉంది. ఇది దాదాపు పూర్తయినట్లు తెలిసింది. ఈ జాబితాలో ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాయదుర్గం, మడకశిర, సింగనమల, గూడూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, చిత్తూరు, మదనపల్లె, దర్శి, గిద్దలూరు, తిరువూరు స్థానాల్లో మార్పులు, చేర్పులపై స్పష్టత రానుంది. నందిగామ, చింతలపూడి, పెందుర్తి, చోడవరం సీట్లపైనా కసరత్తు చేస్తున్నారు. నంద్యాల ఎంపీ స్థానంపైనా ఒక అభిప్రాయానికి రానున్నారు. ఈ మేరకు మార్పులు, చేర్పులు చేసే ఎమ్మెల్యేలను, ఇన్‌ఛార్జ్‌లను తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. సీఎంను కలిసిన వారిలో చాలా మంది అసంతృప్తి గురవుతున్నప్పటికీ, పైకి మాత్రం అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని వెల్లడిస్తున్నారు. వారి సొంత నియోజకవర్గాలకు వెళ్లాక అనుచరులతో సమావేశాలను నిర్వహించి టికెట్‌ తమకు ఇవ్వాల్సిందేనని బలప్రదర్శనకు దిగుతున్నారు. ఇప్పటికే తొలి విడతలో 11 మందిని, మలి విడతలో 27 మంది స్థానాలను అధిష్ఠానం మార్పు చేసింది. వారిలో ముగ్గురు ఎంపీలు ఉన్నారు. ఆ రెండు జాబితాల వెల్లడి అనంతరం పెద్దఎత్తున నిరసనలు వచ్చినప్పటికీ అధిష్ఠానం ఖాతరు చేయకుండా ముందుకు సాగుతోంది. సంక్రాంతి నాటికి అసెంబ్లీ, ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలకు వైసీపీ అధిష్ఠానం సిద్ధమైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img