London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

‘సెల్ఫ్‌ ఫైనాన్స్‌’ ముసుగులోవైద్య సీట్ల అమ్మకం

. ప్రభుత్వ నూతన వైద్యకళాశాలల్లో ఇష్టారాజ్యం
. ప్రతిభావంతులు, రిజర్వేషన్‌ విద్యార్థులకు శాపం
. గత ప్రభుత్వ విధానాలే కొనసాగింపు ?
. జీవో 107, 108 రద్దు చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్‌

విశాలాంధ్రబ్యూరోఅమరావతి: రాష్ట్రానికి కొత్తగా మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో స్వీయ ఆర్థిక (సెల్ఫ్‌ ఫైనాన్స్‌) సీట్ల వ్యవహారం పేద, ప్రతిభగల విద్యార్థులకు శాపంగా మారింది. ఈ సీట్ల భర్తీకి గత ప్రభుత్వం జారీజేసిన జీవో 107, జీవో 108పై గందరగోళం నెలకొంది. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ముసుగులో సీట్లు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే గత వైసీపీ ప్రభుత్వ విధానాలనే...ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనుసరించేలా వ్యవహరిస్తుండటాన్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గత 202324 విద్యా సంవత్సరం…రాష్ట్రానికి కొత్తగా మంజూరైన ఐదు వైద్య కళాశాల్లో సెల్ప్‌ ఫైనాన్స్‌ కోటా కింద 50శాతం సీట్లను భర్తీ చేయడం సర్వత్రా నిరసనలకు దారితీసింది. గత ప్రభుత్వ హయాంలో సీఎం జగన్‌ పేదల పక్షపాతినని చెబుతూ…వైద్య కళాశాలల సీట్ల భర్తీలో తెరపైకి జీవోలు తేవడం వివాదస్పదంగా మారింది. అప్పట్లో విపక్షాలు, విద్యార్థి, యువజన సంఘాలు దొడ్డిదారిన సీట్లు అమ్ముకుంటున్నారని పెద్దఎత్తున ఉద్యమించాయి. విజయవాడ హెల్త్‌ యూనివర్సిటీ ఎదుట నిరసనకు దిగాయి. ఈ జీవోలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, తక్షణమే వాటిని రద్దు చేయాలని హెచ్చరించాయి. వారి ఆందోళనలకు నాడు టీడీపీ అనుబంధ సంఘం మద్దతిచ్చింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో 107, 108ను రద్దు చేస్తామంటూ స్వయంగా నారా లోకేశ్‌ విద్యార్థులకు హామీ ఇచ్చారు.ఇప్పుడు మౌనం దాల్చడం, దీనిపై కొనసాగుతున్న కేసులో తాజాగా హైకోర్టుకు పాత ఫీజుల విధానాన్నే కొనసాగిస్తామని కూటమి ప్రభుత్వం నివేదించడం వెరసి విద్యార్థులను మోసగించడమేనని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ విధానాలనే కూటమి ప్రభుత్వం పాటిస్తున్న సంకేతాలను తీసుకురావడంపై సర్వత్రా వ్యతిరేకత నెలకొంది. అటు కొత్త వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీ వ్యవహారంపై విద్యార్థులకు చుక్కలు కన్పిస్తున్నాయి. గత విద్యా సంవత్సరం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, విద్యార్థులు నీట్‌లో 443 మార్కులు సాధించినా అవకాశం దక్కడం లేదు. ప్రస్తుత విద్యా సంవత్సరంలోను ఇదే విధానం కొనసాగడంపై విద్యార్థులకు దిక్కుతోచడం లేదు. సెల్ఫ్‌ఫైనాన్స్‌ సీట్ల భర్తీ కోసం జారీజేసిన జీవోలు రద్దు చేయాలంటూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు ఎన్‌.రఘువీరారెడ్డి తదితరులు లేఖలు రాసినా స్పందన లేదు. విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగినా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కదలిక లేదు. దీంతో 202425 విద్యా సంవత్సరం ఈ కొత్త వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీ వ్యవహారంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 50 శాతం సెల్ప్‌ఫైనాన్స్‌ సీట్లతో రిజర్వేషన్లకు ముప్పు ప్రభుత్వ నూతన వైద్య కళాశాలల్లో 50శాతం సెల్ప్‌ఫైనాన్స్‌ సీట్లతో రిజర్వేషన్‌, ప్రతిభ గల విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి అనుమతులు తెచ్చినట్లు ఘనంగా ప్రచారం చేసుకుంది. ఇందులో 202324 విద్యా సంవత్సరం నుంచి మచిలీపట్నం, ఏలూరు, నంద్యాల, రామచంద్రాపురం, విజయనగరంలోని నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 150 సీట్ల చొప్పున మొత్తంగా 750 ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి జాతీయ వైద్య విధాన పరిషత్‌ ఆమోదముద్ర వేసింది. ఐదు నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 750 సీట్లు మంజూరయ్యాయి. దీని ప్రకారం 750 సీట్లలో 112 సీట్లు జాతీయ కోటా కిందకు వెళ్లాయి. మిగిలిన 638 సీట్లలోని 50 శాతం సీట్లను కేటగిరిఏ కింద రాష్ట్ర విద్యార్థులతో రాష్ట్ర హెల్త్‌ యూనివర్సిటీ భర్తీ చేసింది. 638 సీట్లలో మిగిలిన మరో 50 శాతం సీట్లను సెల్ప్‌ఫైనాన్స్‌ కోటా కింద విభజిస్తూ..అందులో 35 శాతం కేటగిరిబి కింద, మరో 15 శాతం కేటగిరిసిలో ఎన్‌ఆర్‌ఐ కోటా కింద భర్తీ చేశారు. ఈ తరహాగా కేటగిరిఏ కింద ఫీజు రూ.15వేలు, కేటగిరిబి ఫీజు రూ.12లక్షలు, కేటగిరిసీలో భాగంగా ఎన్‌ఆర్‌ఐ కింద రూ.20లక్షలుగా నిర్ధారించారు. ఇందులో బి, సి కేటగిరీల కింద వచ్చే 50శాతం సెల్ఫ్‌ఫైనాన్స్‌ సీట్ల కారణంగా ప్రతిభ, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నారు. బహిరంగంగా వైద్య విద్య సీట్ల అమ్మకాలకు గత ప్రభుత్వం తెరదీసి విమర్శపాలైంది. జీవోలు 107, 108 ఆధారంగా ఫీజుల వసూలు కోసం జనరల్‌ కన్వీనర్‌ కోటా కాకుండా, అదనంగా రెండు కేటగిరీలను గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి, వైద్య విద్యతో వ్యాపారం చేసిందన్న విమర్శల్ని మూట్టకట్టుకుంది. ప్రైవేట్‌ వైద్య కళాశాలల తరహాగానే…కొత్తగా ఏర్పడిన ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలల్లోను సీట్ల భర్తీకి గత ప్రభుత్వం తెరలేపింది. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వైద్య సీట్లు వచ్చినప్పటికీ..భారీ ఫీజులు చెల్లించలేక మరోసారి నీట్‌ రాసేందుకు విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. మళ్లీ 202425 విద్యా సంవత్సరానికిగాను జాతీయ వైద్య విధాన పరిషత్‌ ఆమోదిస్తే..మరో ఐదు నూతన ప్రభుత్వ వైద్యకళాశాలల్లో సీట్ల భర్తీకి అనుమతులు వచ్చే అవకాశముంది. దీంతో ఉన్న జీవోలను రద్దు చేస్తేనే ప్రతిభ, రిజర్వేషన్‌ వర్గాలకు న్యాయం చేకూరుతుంది. మంత్రి లోకేశ్‌ హామీ నిలబెట్టుకోవాలి: ఏఐఎస్‌ఎఫ్‌ ప్రభుత్వ నూతన వైద్యకళాశాలల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్ల భర్తీకి గత ప్రభుత్వం తెచ్చిన జీవోలు 107, 108 రద్దు చేస్తానని నాడు పాదయాత్రలోను, వివిధ సందర్భాల్లోను టీడీపీ తరపున మంత్రి నారా లోకేశ్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఏఐఎస్‌ఎఫ్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ... వైద్య విద్యా వ్యాపారానికి ద్వారాలు తెరుస్తూ..గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో 107, 108లను ప్రస్తుత కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ జీవోల విధానం కొనసాగిస్తే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మొత్తం వ్యాపార మయంగా మారనున్నాయని పేర్కొన్నారు. మూడు కేటగిరీలతో సీట్లను భర్తీ చేసి, వాటిలో 50శాతం సెల్ఫ్‌ ఫైనాన్స్‌, ఎస్‌ఆర్‌ కేటగిరీలకు కేటాయించడం వల్ల ప్రతిభ విద్యార్థులతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విద్యార్థులకు అన్యాయానికి గురవుతారని వివరించారు. నూతన ప్రభుత్వ వైద్యకళాశాలలకు మంజూరైన అన్ని సీట్లలో జాతీయ కోటా కింద 15శాతం పోను, మిగిలిన 85శాతం సీట్లను మొత్తం కేటగిరిఏ కింద భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వం ద్వారా వేల కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలు వ్యాపార కేంద్రాలుగా మారాయని తెలిపారు. తక్షణమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్పందించి జీవోలు 107, 108 రద్దు చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img