Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

విమానం గాల్లో ఉండగా ఊడిపోయిన టైరు.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం కొద్దిసేపటికే దాని టైరు ఊడిపడిపోయింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. అమెరికాకు చెందిన యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం బోయింగ్‌ 777-200 శాన్‌ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జపాన్‌లోని ఒసాకాకు బయల్దేరింది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం ఈ విమానం టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే వెనుక వైపున ల్యాండింగ్‌ గేర్‌లోని టైరు ఊడిపోయింది. అది విమానాశ్రయంలోని పార్కింగ్‌ లాట్‌లో ఉన్న కారుపై బలంగా పడటంతో వాహనం ధ్వంసమైంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
టైరు ఊడిన విషయాన్ని గమనించిన పైలట్లు వెంటనే విమానాన్ని దారిమళ్లించారు. లాస్‌ఏంజిల్స్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అది సురక్షితంగా ల్యాండ్‌ అయ్యిందని.. ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి చేర్చినట్టు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. ఘటన సమయానికి విమానంలో 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారు.బోయింగ్‌ 777 విమానాల్లో రెండు ల్యాండింగ్‌ గేర్‌లకు ఆరు చొప్పున టైర్లు ఉంటాయి. చక్రాలు ఊడినా, డ్యామేజ్‌ అయినా విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయ్యేలా ఈ డిజైన్‌ చేశారు. తాజా ఘటనపై ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఎయిర్‌పోర్ట్ అధికార ప్రతినిధి డౌగ్ యాకేల్ మాట్లాడుతూ.. ావిమానం బయలుదేరిన కొద్దిసేపటికే ఎడమ వైపు మెయిన్ ల్యాండింగ్ గేర్‌ వద్ద ఉన్న ఆరు టైర్లలో ఒకటి విడిపోయి, పార్కింగ్ స్థలంలో కారుపై పడింది… దాని వెనుక కిటికీ పగలడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. ఆపై సమీపంలోని కంచెను తాకింది.. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు్ణ అని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img