Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

2040 నాటికి చంద్రుడిపైకి భారతీయుడు..ఇస్రో ఛైర్మన్ కీలక ప్రకటన

వచ్చే ఏడాది మానవసహిత మిషన్ గగన్‌యాన్
చంద్రుడిపై మానవసహిత ప్రయోగంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2040 నాటికి జాబిల్లిపైకి భారతీయుడ్ని పంపేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. అయితే, ఈ మిషన్ చాలా ఖర్చుతో కూడకున్నదని అన్నారు. చంద్రునికి మిషన్‌కు లాంచర్ సామర్థ్యాలు, ప్రయోగశాలలు, సిమ్యులేషన్ వ్యవస్థల అభివృద్ధితో సహా నిరంతర కార్యాచరణ అవసరమని ఎస్ సోమనాథ్ పేర్కొన్నారు. చంద్రునిపైకి మానవుడిని పంపే ముందు అనేకసార్లు నమూనా పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని ఇస్రో చీఫ్ చెప్పారు.
చంద్రునిపైకి మానవ సహిత వ్యోమనౌకను పంపే ఇస్రో ప్రణాళిక గురించి సోమనాథ్ మాట్లాడుతూ.. జీరో-గ్రావిటీ పరిస్థితుల కోసం సైంటిఫిక్ రోడ్‌మ్యాప్‌ను రూపొందించాల్సిన అవసరం ఉందని, గగన్‌యాన్ మిషన్‌లో ఉపయోగించిన కనీసం ఐదు ప్రయోగాలను ఇస్రో షార్ట్‌లిస్ట్ చేసిందని అన్నారు. సైంటిఫిక్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్స్: ఆపర్చ్యూనిటీస్ ఫర్ సైంటిఫిక్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా అనే అంశంపై మంగళవారం గోవాలో జరిగిన నేషనల్ స్పేస్ సైన్స్ సింపోజియంలో ఎస్ సోమనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతరిక్షంలోని ఉండే జీరో గ్రావిటీ ఎన్విరాన్‌మెంట్ కోసం టెక్నాలజీ సైన్స్ రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలి… గగన్‌యాన్ మిషన్‌లో మేము చేయాలనుకున్న ప్రయోగాల విధానాలను పరిశీలించినప్పుడు వీటిలో కనీసం ఐదు షార్ట్‌లిస్ట్‌లో ఉన్నాయి. అయితే, అవి అంత ఉత్తేజకరమైన ప్రయోగాలు కావు.. ఈ మిషన్‌తో పాటు చంద్రునిపై మిషన్‌కు మరింత సామర్థ్యాన్ని సాధించాలి.. చంద్రునితో కూడా నిరంతర కమ్యూనికేషన్ జరగాలి.. చివరగా మనం కోరుకున్నట్టు 2040 నాటికి చంద్రునిపై అడుగుపెట్టగలం అని ఆశాభావం వ్యక్తం చేశారు. జాబిల్లి గురించి విస్తృతమైన సమాచారం తెలుసుకోడానికి చంద్రునికి మిషన్ల నిరంతర ప్రక్రియను నొక్కిచెప్పిన ఇస్రో చీఫ్.. ఈ మిషన్ అప్పటికప్పుడు జరగదని, అంతరిక్షంలోకి మనిషి పంపే విషయంలో గణనీయంగా మెరుగుపడాలని అన్నారు.ాచంద్రునిపైకి మానవులను పంపడం తక్కువ ఖర్చుతో కూడిన ప్రయోగం కాదు.. లాంచర్ సామర్థ్యాలు, ప్రయోగశాలలు, సిమ్యులేషన్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలి.. ఇది ఒక్కసారి మాత్రమే సాధ్యం కాదు.. చాలాసార్లు చేయాల్సి ఉంటుంది.. అప్పుడే భారత్‌ చంద్రునిపైకి మనిషిని పంపడం సాధ్యమవుతుంది.్ణ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా చంద్రునిపై అన్వేషణ మళ్లీ ఊపందుకుందని చెప్పారు. ాఇతరులు చేస్తున్న ప్రయోగాలను బాగా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే అనేక దేశాలు కూడా చంద్రునిపైకి వెళ్తున్నాయి.. అమెరికా, చైనా, అనేక ఇతర దేశాలు చంద్రుడిపై పరిశోధనలకు ఆసక్తి చూపుతున్న అంశం మీకు తెలుసని నేను భావిస్తున్నాను అని ఇస్రో ఛైర్మన్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img