Friday, June 14, 2024
Friday, June 14, 2024

లోక్‌స‌భ‌లో కేంద్రంపై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం..

రూల్ 198(బీ) కింద ఎంపీ నామా నోటీసు

లోక్‌స‌భ‌లో కేంద్రంపై బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వ‌రరావు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. మ‌ణిపూర్ అంశంపై ఉభ‌య‌స‌భ‌ల్లో మోదీ మౌనం వీడ‌డం లేద‌ని ఆరోపించారు. రూల్ 198 కింద ఈ నోటీసుపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని ఎంపీ నామా కోరారు. ఇవాళ లోక్‌స‌భ‌లో బీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ ఎంపీ గ‌గోయ్ కూడా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు.అవిశ్వాస తీర్మానం నోటీసుపై లోక్‌స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌కు ఎంపీ నామా లేఖ రాశారు. రూల్ 198(బీ) ప్ర‌కారం లోక్‌స‌భ‌లో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తున్న‌ట్లు ఎంపీ నామా తెలిపారు. ఇవాళ జ‌రిగే లోక్‌స‌భ బిజినెస్‌లో ఈ నోటీసును కూడా చేర్చాల‌ని ఆయ‌న సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌ను కోరారు. కాంగ్రెస్ ఎంపీ గౌర‌వ్ గ‌గోయ‌ల్ కూడా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నో కాన్ఫిడెన్స్ మోష‌న్ ఫైల్ చేశారు. మ‌ణిపూర్ అంశంపై చ‌ర్చ‌కు ప్ర‌ధాని మోదీ ముఖం చాటేయ‌డం వ‌ల్ల .. కేంద్ర ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. పార్ల‌మెంట్ వ‌ర్సాకాల స‌మావేశాలు ప్రారంభ‌మై నాలుగు రోజులు గ‌డిచినా స‌భ స‌జావుగా సాగ‌డం లేదు. కేంద్రం నిర్ల‌క్ష్య వైఖ‌రిని ఎండ‌గ‌ట్టేందుకు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వ‌డం స‌రైందే అని బీఆర్ఎస్ భావిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img