ఎక్సైజ్ పాలసీ కేసులో సిబిఐ సోమవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఛార్జిషీట్ దాఖలు చేసింది. సిబిఐ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఇటీవల కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్ చేసింది. మధ్యంతర బెయిల్ కోసం కేజ్రీవాల్ చేసుకున్న పిటిషన్‌పై కూడా కోర్టు ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సిబిఐ తరపు న్యాయవాది డి.పి సింగ్ కోర్టులో వాదనలు వినిపించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41-ఎ, 41 -ఎ(3) ప్రకారం సహేతుకమైన అనుమానం వున్న వారిని అరెస్టు చేయడం తప్పు కాదని, వీరికి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని సింగ్ వాదనలు వినిపించారు. అలాగే అరెస్టుకు వ్యతిరేకంగా సెక్షన్ 41(1) (బి) (2)లోని సబ్ క్లాజులు (ఎ నుండి ఇ) వరకు దానికి గల కారణాలను కేజ్రీవాల్ తరపు న్యాయవాది నమోదు చేయాలని సిబిఐ హైకోర్టుకు తెలిపింది. అయితే కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఆ మూడు ఉత్తర్వులు కఠిన నిబంధనల కింద ఉన్నాయన్నారు. సుప్రీంకోర్టు ఇటీవల కేజ్రీవాల్‌కి నిరవధికంగా బెయిల్ మంజూరు చేయాలని నిర్ణయించింది. నా క్లయింట్ కూడా ఇడి కేసులో ట్రయల్ కోర్టు నుండి బెయిల్ ఆర్డర్ పొందాడు. తర్వాత ఢిల్లీ కోర్టు స్టే విధించిందని, కేజ్రీవాల్‌ను సిబిఐ అరెస్టు చేయడం అనవసరమని సింఘ్వీ అన్నారు.