Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఢిల్లీ లిక్కర్ కేసులో మరో మంత్రికి ఈడీ సమన్లు…

రెండు సంవత్సరాలుగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు ఆమ్ ఆద్మీ పార్టీ మెడకు చుట్టుకుంటోంది. మొదట ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేసిన ఈడీ ఆ తర్వాత.. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను జైలుకు పంపించింది. ఇటీవలె ఢిల్లీ సీఎం, ఆప్ నేషనల్ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్‌ను సైతం అరెస్ట్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ ఢిల్లీ లిక్కర్ కేసు మారుమోగిపోతోంది. అయితే ఈ కేసు ఇంతటితో ఆగకుండా మరింత మంది ఆప్ నేతల చుట్టూ తిరుగుతోంది. తాజాగా ఢిల్లీ ప్రభుత్వంలో మరో కీలక మంత్రి కైలాశ్‌ గహ్లోత్‌కు ఈడీ శనివారం నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ కోసం శనివారం రోజే తమ ముందు హాజరుకావాలని ఈడీ ఆ నోటీసుల్లో పేర్కొనడం గమనార్హం. ఈ కేసు విచారణకు సంబంధించి కైలాశ్ గహ్లోత్ వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు రికార్డ్‌ చేయనున్నారు. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గంలో కైలాశ్ గహ్లోత్‌ హోం, రవాణా, న్యాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ముందు సంచలంగా మారింది. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న ఈడీ.. ఈ నెల 21 వ తేదీన కేజ్రీవాల్‌ నివాసంలో సోదాలు నిర్వహించి.. ఆయనను అరెస్టు చేసింది. మొదట ఆయనను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచి.. ఈ నెల 28 వరకు కస్టడీలోకి తీసుకుంది. ఆ తర్వాత మరోసారి కోర్టులో ప్రవేశపెట్టడంతో కోర్టు ఏప్రిల్ 1 వ తేదీకి ఈడీ కస్టడీని పొడగించింది. ఈ కేసులో ఈనెల 28 వ తేదీన జరిగిన కోర్టు విచారణ సందర్భంగా జడ్జి అనుమతితో కేజ్రీవాల్ స్వయంగా తన తరఫున తానే వాదనలు వినిపించుకున్నారు. ఈ క్రమంలోనే ఈడీపై తీవ్ర ఆరోపణలు చేసిన కేజ్రీవాల్.. కేవలం నలుగురు ఇచ్చిన వాంగ్మూలాలతోనే తనను అరెస్టు చేశారని మండిపడ్డారు. ఇక ఈడీ కస్టడీ నుంచే ఢిల్లీ పాలనావ్యవహారాలను కేజ్రీవాల్ చూస్తున్నారు. ఇక కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలని ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు కాగా దాన్ని కోర్టు కొట్టివేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img