Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నిఘా వైఫల్యం

. మా తప్పు లేదు` ముందే చెప్పాం: ఇంటెలిజెన్స్‌ వర్గాలు
. పక్కా ప్లాన్‌తోనే హింస: హరియాణా ప్రభుత్వం
. సమాచారమున్నా కట్టర్‌ నిర్లక్ష్యంతోనే అల్లర్లు: విపక్షాలు

చండీగఢ్‌ : అల్లర్లతో హరియాణాలో ఉద్రిక్తత నెలకొంది. ఆ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించింది. ఇప్పటివరకు ఆరుగురు చనిపోగా, వీరిలో ఇద్దరు హోంగార్డులు ఉన్నారు. ఇంటెలిజెన్స్‌ వైఫల్యం కారణంగానే ఘర్షణ, హింస జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే తమ తప్పేమీ లేదని, ముందస్తుగానే అల్లర్ల గురించి రాష్ట్ర యంత్రాంగానికి తెలియజేశామని నిఘా వర్గాలు వివరణ ఇచ్చుకున్నాయి. ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగింది తప్ప అప్పటికప్పుడు హింస చోటుచేసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ముందస్తు సమాచారం ఉన్నాగానీ మతహింసను నివారించడంలో కట్టర్‌ సర్కార్‌ పూర్తిగా విఫలమైందని విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపించాయి. ఈ పరిస్థితి ప్రభుత్వ నిర్లక్ష్యానికి తార్కాణమని పేర్కొన్నాయి.
హరియాణాలోని నూప్‌ా, గురుగ్రామ్‌ జిల్లాల్లో హింసకు నిఘా వైఫల్యమే కారణమన్న వాదన బలంగా వినిపిస్తోంది. ముందస్తు సమాచారం ఉన్నాగానీ రాష్ట్ర యంత్రాంగం తగు విధంగా చర్యలు తీసుకోలేదన్న ఆరోపణ ఉంది. నూప్‌ా, గురుగ్రామ్‌లో అల్లర్లకు దారితీసే విధంగా రెండు వర్గాలు పరస్పరం సామాజిక మాధ్యమాల ద్వారా హెచ్చరికలు చేసుకోవడం, సవాళ్లు విసురుకోవడం జరిగినట్లు వర్గాల సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సముచిత చర్యలు తీసుకొని ఉంటే అవాంఛనీయ ఘటనలను నివారించే వీలు ఉండేదని పేర్కొన్నాయి. హింస జరిగిన ప్రాంతాలలో పోలీసులను భారీగా మోహరించేలేదని వెల్లడిరచాయి. ఫిబ్రవరిలో భివానీ జిల్లాలో ఇద్దరు ముస్లింల మృతదేశాలు ఛిద్రమైన స్థితిలో లభ్యం కాగా వారి హత్యారోపణలను గోరక్షకుడిగా చెప్పుకునే మోను మానేశర్‌ అరెస్టు అయ్యారు. ఆ ప్రాంతంలో బ్రిజ్‌ మండల్‌ జలాభిషేక యాత్రను మానేశర్‌ నిర్వహించడాన్ని ముస్లింలు వ్యతిరేకించారు. దీంతో చెలరేగిన అల్లర్లలో 2500 మంది ఆలయంపై దాడి చేశారని, కొన్ని దుకాణాలను, షోరూమ్‌లను లూటీ చేశారని ఆరోపించారు. యాత్రలో భారీ సంఖ్యలో పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు అక్కడకు వచ్చేసరికి విధ్వంసం జరిగిందన్నారు. అల్లర్లు జరిగినప్పుడు 700 మంది పోలీసులను మోహరించగా వారిలో ఎక్కువ మంది హోంగార్డులే ఉండటం, హింస పెరిగినప్పుడు వారంతా వెన్నుచూపడం గురించి ప్రత్యక్ష సాక్షులు వెల్లడిరచారు. అల్లర్లు జరిగిన రోజు మీవట్‌ ఎస్పీ సెలవులో ఉండగా పల్వాల్‌ ఎస్పీకి అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో హరియాణాలో అల్లర్లు జరగడానికి నిఘా వర్గాల వైఫల్యమే కారణమన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ పంచాయితీ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. దీంతో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు సీసీటీవీలను ఏర్పాటు చేయాలని అధికారులను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇంటెలిజెన్స్‌ అధికారులు మాత్రం తమ తప్పులేదని బలంగానే చెబుతున్నారు. ముందస్తుగా హెచ్చరికలు చేశామన్నారు. పోలీసులకు ముందే సమాచారం ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదన్నారు.
ప్రతిపక్షాల విమర్శలు
అల్లర్లపై ప్రతిపక్షాలైన కాంగ్రెస్‌, ఇండియన్‌ నేషనల్‌ లోక్‌ దళ్‌ నేతలు కట్టర్‌ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేన్నారు. శాంతిభద్రతలను కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మతహింస జరగవచ్చని హెచ్చరించినా పట్టించుకోలేదని, కేవలం హోంగార్డులను పంపి చేతులు దులుకుకున్నదని నేతలు విమర్శించారు. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌ సింగ్‌ స్పందిస్తూ అధికార యంత్రాంగం వైఫల్యంతోనే అల్లర్లు జరిగాయన్నారు. యాత్ర వల్ల హింస జరగవచ్చని పక్కా సమాచారం ఉంటే హోంగార్డులను పంపడమేమిటని ప్రశ్నించారు. సీఐడీ నుంచి సమాచారం ఉన్నాగానీ తగు విధంగా రాష్ట్ర యంత్రాంగం స్పందించలేదని, పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయలేదని, నిఘా పెంచలేదని ఆరోపించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకొనివుంటే అల్లర్లను నివారించే వీలు కలిగేదన్నారు. కట్టర్‌ ప్రభుత్వ వైఫల్యానికి తాజా పరిణామాలు నిదర్శనమని విమర్శించారు.
116 మంది అరెస్టు`సామాజిక
మాధ్యమాలతోనే చిచ్చు
అల్లర్లతో సంబంధం ఉన్న 116 మందిని పోలీసులు ఇప్పటివరకు అరెస్ట్‌ చేశారు. 41 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు. చనిపోయిన ఆరుగురిలో ఇద్దరు హోంగార్డులు, ఓ ఇమామ్‌ ఉన్నారు. రాళ్లు, ఆయుధాలను ముందే సమకూర్చుకోవడాన్ని బట్టి ఇది పక్కా ప్లాన్‌తో రాష్ట్రంలో శాంతికి విఘాతం కలిగించేలా జరిగిన హింసాకాండ అని హరియాణా హోంమంత్రి అనిల్‌ విజ్‌ అన్నారు. దోషులను ఉపేక్షించబోమన్నారు. సంబంధిత కేసుల్లో అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని, బయట వ్యక్తుల ప్రమేయం ఉందా అని కూడా ఆరా తీస్తున్నట్లు చెప్పారు. రెండు వర్గాల వారు సామాజిక మాధ్యమాల ద్వారా పరస్పరం సవాళ్లు విసురుకున్నారని, యాత్రలో పాల్గొంటానని మోను మానేశర్‌ ముందే ప్రకటించారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఆరోపణలపై ఏడీజీపీ మమతా సింగ్‌ స్పందిస్తూ రెచ్చగొట్టేలా ఉన్న వీడియోల గురించి తెలిసి తగు విధంగా భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ‘ఇది నిఘా వైఫల్యమని చెప్పలేనుగానీ కౌంటర్‌ వీడియోల గురించి తెలుసు. వాటిని తొలగించాం. భద్రతను పెంచాం’ అని సింగ్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img