Sunday, April 14, 2024
Sunday, April 14, 2024

బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలో బుధవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. బాసగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చీపురుబట్టి అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతాబలగాలకు, మావోయిస్టులు తారసపడ్డారు. దాంతో భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో దళం డిప్యూటీ కమాండర్‌తోపాటు ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భద్రతాబలగాలు, పోలీసులకు మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. మరణించిన నక్సలైట్ల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. సంఘటనా స్థలంలో ఉన్న ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్, అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. హోలీ రోజున నక్సలైట్లు ఈ ప్రాంతంలో ముగ్గురు గ్రామస్థులను చంపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img