Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

తైవాన్‌లో భారీ భూకంపం.. జపాన్ సహా పలు దేశాలకు సునామీ హెచ్చరిక

తైవాన్‌లో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు తైవాన్ దక్షిణ ప్రాంతంలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. దక్షిణాన హౌలెన్ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు తెలిపింది. భూమికి 34.8 కి.మీ. లోతున భూకంపం సంభవించినట్టు పేర్కొంది. దీంతో తూర్పు తైవాన్‌తో పాటు దక్షిణ జపాన్, ఫిలిప్పీన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీచేశారు. మియాకోజిమా ద్వీపం సహా పలు దీవులకు సునామీ హెచ్చరికలు జారీచేసిన జపాన్ మెటీరియాలజికల్ ఏజెన్సీ.. 3 మీటర్ల ఎత్తున రాకాసి అలలు ఎగిసిపడే అవకాశం ఉందని సూచించింది.
అటు, తైవాన్ అధికార యంత్రాంగం సైతం సునామీ హెచ్చరికలు చేసి.. తీర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసింది. తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, హఠాత్తుగా అలలు ఎగిసిపడి ప్రమాదం సంభవించవచ్చని తెలిపింది. తొలుత తైవాన్ వ్యాప్తంగా భూకంపం వచ్చింది. దక్షిణ పింగ్‌టుంగ్ కౌంటీ నుంచి తైపీలోని ఉత్తరం వరకూ భూప్రకంపనలు నమోదయ్యాయి. తైపీ వాతావరణ ఏజెన్సీ ప్రకారం.. హువాలియన్ సమీపంలో 6.5 తీవ్రతతో తైపీలో కూడా భూకంపం సంభవించింది. భూకంపంతో రాజధాని తైపీలో మెట్రో రైలు సేవలను నిలిపివేశారు. అయితే, గంట తర్వాత వాటిని పునరుద్దరించారు. అలాగే, ఇళ్లలో గ్యాస్ లీకేజ్‌లను తనిఖీ చేసుకోవాలని ప్రజలకు అధికారులు వార్నింగ్ మెసేజ్‌లు పంపారు. దశాబ్దాల కాలం తర్వాత ద్వీపంలో సంభవించిన అత్యంత బలమైన భూకంపం అని అధికారులు తెలిపారు. 1999 భూకంపం తర్వాత 25 ఏళ్లలో ఇదే అత్యంత శక్తివంతమైంది అని ఆయన విలేకరులతో అన్నారు. సెప్టెంబరు 1999లో తైవాన్‌లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం ఆ ద్వీప చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యం. సుమారు 2,400 మందిని బలితీసుకుంది. మూడు రోజుల్లో 6.5 నుంచి 7 తీవ్రతతో భూకంపాలు వస్తాయి.. ఇది భూమికి దగ్గరగా ఉంటుంది అని అధికారులు తోసిపుచ్చడం లేదని హెచ్చరించారు. ప్రజలు సంబంధిత హెచ్చరికలు, మెసేజ్‌లపై అలసత్వం వహించొద్దని, భూకంపం కారణంగా తరలింపు కోసం సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇక, తైవాన్ భూకంపాల జోన్‌లో ఉంది. రెండు టెక్టానిక్ ప్లేట్స్ కలిసే ప్రాంతంలో ఉండటం వల్ల తరుచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ఇక, తైవాన్‌కు పశ్చిమంగా ఉన్న ఫిలిప్పీన్స్‌లో సునామీ హెచ్చరికలు జారీచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img