Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

టైటాన్ శకలాల నుంచి మానవ అవశేషాలు వెలికితీత

అట్లాంటిక్ మహాసముద్రంలో వందేళ్ల క్రితం మునిగిపోయిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి పేలిపోయిన సబ్‌మెర్సిబుల్ టైటాన్ శకలాలను తీరానికి తీసుకొచ్చారు. కెనడాలోని న్యూఫౌండ్‌లాండ్‌ అండ్‌ లాబ్రడార్‌ ప్రావిన్సులో సెయింట్‌ జాన్స్‌ ఓడరేవుకు బుధవారం వాటిని తీసుకొచ్చినట్టు అమెరికా కోస్ట్‌గార్డ్ దళాలు వెల్లడించాయి. చనిపోయిన పర్యాటకుల అవశేషాలను టైటాన్ శకలాల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నాయి. తిరిగి పొందిన మానవ అవశేషాల అధికారిక విశ్లేషణను అమెరికా వైద్య నిపుణులు జాగ్రత్తగా నిర్వహిస్తారు్ణ అని వివరించాయి. టైటాన్ సభ్ పేలిపోవడానికి కారణాలు తెలుసుకునేందుకు జరుగుతున్న దర్యాప్తులో కీలక పరిణామంగా దీనిని భావిస్తున్నారు. 111 ఏళ్ల కిందట మునిగిపోయిన టైటానిక్‌ నక శకలాలను చూసేందుకు టైటాన్‌లో ప్రయాణించిన ఐదుగురూ మృతిచెందిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో ఉంటోన్న బ్రిటిష్ వ్యాపారవేత్త హమిష్ హార్డింగ్, ఫ్రాన్స్ నావికుడు పౌల్ హెన్నీ నర్గోలెట్, పాకిస్థాన్ బిలీనియర్ షజాద్ దావూద్, అతడి కుమారుడు సులేమాన్, సాహస యాత్రను నిర్వహించే ఓషన్‌గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రుష్‌లు ఈ ప్రమాదంలో చనిపోయారు. సముద్రంలో లభ్యమైన టైటాన్ శిధిలాలను మరింత విశ్లేషణ కోసం కట్టర్ పోర్ట్‌కు తీసుకువెళతామని అమెరికా కోస్ట్‌ గార్డ్ తెలిపింది. టైటాన్ ప్రమాదానికి దారితీసిన కారకాలను అవగాహన చేసుకోవడానికి, అలాంటి విషాదం మళ్లీ జరగకుండా చూడటానికి ఇంకా గణనీయమైన కృషి చేయాల్సి ఉంది్ణ అని కెప్టెన్ జాసన్ నెబ్యూర్ అన్నారు. న్యూయార్క్‌లోని పెలాజిక్ రిసెర్చ్ సంస్థకు చెందిన రిమోట్-ఆపరేటెడ్ వాహనం సాయంతో టైటాన్ శకలాలను బయటకు తీశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img