Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేతల మధ్య మాటల తూటాలు..సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి.. కేటీఆర్, కడియం శ్రీహరిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఈ క్రమంలో.. వాళ్లు వాడిన భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. మీడియా పాయింట్‌కు వెళ్లనీయకపోవటంతో.. అసెంబ్లీ ప్రాంగణంలోనే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడీగా సాగుతున్నాయి. సభలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. సభలో అధికార పక్షం నేతలు వాడుతున్న భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేతలు.. నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. వాకౌట్ చేసి నేరుగా మీడియా పాయింట్ వద్దకు వెళ్దామనుకున్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు. సభ జరుగుతున్న సమయంలో మీడియా పాయింట్‌కు వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పటంతో.. పోలీసులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇవేమి కొత్త నిబంధనలంటూ హరీశ్ రావు, కేటీఆర్ మండిపడ్డారు. దీంతో.. అక్కడే కూర్చొని ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు.మేడిగడ్డ, నల్గొండ సభలో జరిగిన విషయాలతో పాటు కృష్ణా, గోదావరి జలాలపై ప్రభుత్వం శ్వేతపత్రం పెడుతామంటోందని.. ఆ చర్చలో తాము తప్పకుండా పాల్గొంటామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. అయితే… సభలో సీఎం రేవంత్ రెడ్డి వాడే భాష పట్ల తాము తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ఎన్ని విషయాలైన మాట్లాడొచ్చు.. కానీ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నిండుసభలో సహనం కోల్పోయి వాడరాని భాష మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలా మాట్లాడి పరువు తీసుకోవొద్దని రేవంత్ రెడ్డికి కడియం శ్రీహరి హితవు పలికారు. సభలో తన పేరును వాడుతూ.. రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలను ఉపసహరించుకోవాలని డిమాండ్ చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీని చిట్ చేసి నాశనం చేసిన చీడపురుగే రాజగోపాల్ రెడ్డి అని కడియం తీవ్ర ఆరోపణలు చేశారు. కడియం శ్రీహరిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని కేటీఆర్ సైతం డిమాండ్ చేశారు. అయితే.. బీఆర్ఎస్ సభ్యులు అధికారం కోల్పోయినా.. ఇంకా అహంకార ధోరణితో ప్రవర్తిస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి పొన్నం మాట్లాడుతుంటే కూర్చొమంటూ.. జన్మలో మంత్రి కాలేవని తనను కేటీఆర్ దబాయిస్తున్నారని ప్రస్తావించారు. ఉద్యమ కారుడు తాటికొండ రాజయ్యకు కడియం అన్యాయం చేశారంటూ ఆరోపించారు. డిప్యూటీ సీఎం పదవిని లాక్కున్నావంటూ మండిపడ్డారు. మంత్రి కావాలని.. ఎమ్మెల్సీ వదిలేసి.. ఎమ్మెల్యే సీటు కోసం రాజయ్యకు అన్యాయం చేశావంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారం పోయిన తర్వాత తమ పార్టీని చీల్చే కుట్ర చేస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు.

మరోవైపు.. నల్గొండ సభలో కేసీఆర్ మాట్లాడిన భాషపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు రాకుండా కేసీఆర్ పారిపోయారన్నారు. కాళేశ్వరం, గోదావరి జలాలపై చర్చకు తాము సిద్దమని.. కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే సభకు వచ్చి చర్చ చేయాలన్నారు. కేసీఆర్‌ను చంపాల్సిన అవసరం ఎవరికుందని ప్రశ్నించారు. కేసీఆర్ అనే పామును మొన్న అసెంబ్లీ ఎన్నికల్లోనే ప్రజలు చంపేశారని.. సచ్చిన పామును ఎవరైనా చంపుతారా అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img