Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒకలాగా.. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ఇంకోలా వ్యవహరించడం సరికాదు…

కేంద్రానికి సుప్రీంకోర్టు చురకలు
కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరుపై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. నాగాలాండ్‌లో మహిళా రిజర్వేషన్ల అంశంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు.. కేంద్రం తీరును తూర్పారబట్టింది. మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒకలాగా.. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ఇంకోలా వ్యవహరించడం సరికాదని వ్యాఖ్యానించింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.ఇది రాజ్యాంగ నిబంధనకు విరుద్దమని స్పష్టం చేసింది. ఈ విషయంలో చేతులు దులుపుకుంటే కుదరదని, చర్యలు తీసుకోవాల్సిందేనని కేంద్రానికి కోర్టు చురకలు అంటించింది. రాజ్యాంగ నిబంధనను అమలు చేయడంలో కేంద్రం విఫలమైందని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్ సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. మహిళల కోటాకు సంబంధించి 1992 నాటి రాజ్యాంగ సవరణ అమలు కావడంలేదని, ఈ విషయంలో కేంద్రం చేతులు కట్టుకుని కూర్చుంటే కుదరదని పేర్కొంది.ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలపై చర్యలు తీసుకోవడంలో ఉన్న దూకుడు.. బీజేపీ ప్రభుత్వాల విషయంలో మాత్రం లేదని ఉద్ఘాటించింది. ానాగాలాండ్‌లో మహిళల కోటా విషయంలో మీరు చేస్తున్నది ఏంటి? అక్కడ మీకు అనుకూలమైన కూటమే అధికారంలో ఉంది.. కేంద్రం రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదని మమ్మల్ని అనొద్దు.. దాని అమలును నిర్ధారించడానికి మీరు తప్పనిసరిగా క్రియాశీలక పాత్రను పోషించాలి.. మీకు అనుకూలంగా లేని ఇతర రాష్ట్రాలపై మీరు తీవ్ర చర్యలు తీసుకుంటారు కానీ అదే మీ పాలనలోని ప్రభుత్వాలపై చర్యలు తీసుకోవడం లేదు్ణఅని ధర్మాసనం వ్యాఖ్యానించింది.కేంద్రం ఈ విషయంలో చేతులు ముడుచుకుంటే కుదరదు.. ఆ రాష్ట్రంలోని పాలక కూటమి కేంద్రానికి అనుకూలంగా ఉండటం వల్ల మీ పని మరింత సులభతరం అవుతుంది. మీకు (ప్రభుత్వానికి) చివరి అవకాశం ఇస్తున్నాం అని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ ఈ సందర్భంగా తమకు కొంచెం సమయం ఇవ్వాలని కోరారు. గత మూడు నెలలుగా ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి కల్లోలంగా ఉందని పరోక్షంగా మణిపూర్ హింసను ప్రస్తావించారు. రాజ్యాంగ నిబంధన అమలుకు గడువును సెప్టెంబరు 26గా ధర్మాసనం పేర్కొంది. అయితే, మహిళల కోటా నిబంధనలను నాగా గ్రూపులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇది నాగా సంప్రదాయం, ఆచారాలకు ఆటంకం కలిగిస్తుందని భావిస్తున్నారు. పొరుగున ఉన్న మణిపూర్‌ కంటే నాగాలాండ్‌ పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని కోర్టు పేర్కొంది. జరుగుతున్నది చాలా బాధాకరం. మీకు మింగుడుపడని మరిన్ని వ్యాఖ్యలు చేయకుండా మేము నిగ్రహించుకుంటున్నాం అని జస్టిస్ కౌల్ అన్నారు.మహిళల విద్యా స్థాయి, వారి స్థితి, భాగస్వామ్యం దేశంలోనే అత్యుత్తమంగా ఉన్న రాష్ట్రం నాగాలాండ్ అని, వారికి మున్సిపల్ పాలనలో రిజర్వేషన్లను తిరస్కరించడం సబబు కాదని కోర్టు పేర్కొంది. కేంద్రం, రాష్ట్రంలో ఒకే రాజకీయ కూటమి ఉన్నందున దీన్ని మరింత సులభంగా నేరవేర్చగలరని పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img