Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

ఎంత‌కాలం.. తొంద‌ర‌గా తేల్చండి… : సుప్రీం

జగన్ బెయిల్ రద్దు పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ అక్రమాస్తుల కేసులో జాప్యంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కేసులో జాప్యంపై కారణాలు చెప్పాలని కోరింది. విచారణ ఎందుకు జాప్యం అవుతుందో చెప్పాలని సీబీఐని ఆదేశించింది. నాలుగు వారాల్లో అఫిడవిట్ వేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. డిశ్చార్జ్ పిటిషన్‌ల వల్ల జాప్యం అవుతోందని కోర్టుకు సీబీఐ న్యాయవాది తెలిపారు. రాజకీయ కారణాలతో విచారణ ఆలస్యం కాకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. సీఎం అన్న కారణంగా విచారణ జాప్యం కావొద్దని జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. విచారణ ప్రక్రియ వేగంగా జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ రద్దు, మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్లు కలిపి విచారిస్తామని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 5 నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img