Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

టీడీపీకి కేశినేని వర్గం షాక్‌

. తిరువూరు సభకు దూరం
. రాజీనామాలకు రంగం సిద్ధం
. కేశినేని భవనంపై పార్టీ జెండాల తొలగింపు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : టీడీపీకి విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌(నాని) వర్గం పూర్తిగా దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా విజయవాడలోని ఎంపీ కార్యాలయం (కేశినేని భవన్‌) దగ్గర ఉన్న టీడీపీ జెండాలను తొలగించడం చర్చానీయాంశమైంది. దీంతో టీడీపీలో ఏం జరుగుతుందో తెలియక ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అటు ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన రా..కదలిరా…సభకు నాని వర్గం షాక్‌ ఇచ్చింది. ఎంపీతోపాటు పార్లమెంట్‌ పరిధిలోని వివిధ నియోజకవర్గాల నేతలు ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. నందిగామకు చెందిన జీవరత్నం, తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్‌ సభకు దూరంగా ఉన్నారు. కాగా ఆదివారం తన అనుచరులతో మరోసారి ఎంపీ భేటీ అయ్యారు. జి.కొండూరు, రెడ్డిగూడెంలో తాను కేటాయించిన ఎంపీ నిధులతో కొనుగోలు చేసిన మంచినీటి సరఫరా ట్యాంకర్లను ఆయన ప్రారంభించడం చర్చానీయాంశమైంది. ఆ వాహనాలపై కేవలం కేశినేని బొమ్మ మాత్రమే ఉంది. వాహనాలపై కలర్‌ కూడా మారింది. ఎక్కడా చంద్రబాబు ఫోటోలు కన్పించలేదు. రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ ఈనెల 6వ తేదీన విజయవాడలోని ఎంపీ కేశినేని కార్యాలయానికివచ్చారు. ఎంపీని కలిసి తిరువూరు సభకు రావాలంటూ ఆహ్వానించగా ఆయన అందుకు నిరాకరించారు. తన రాజీనామాపై వెనక్కి తగ్గేదేలేదని నొక్కిచెప్పినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని ఎంపీ అనుచరులూ స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన సభలో ఎంపీ నానికి ప్రోటోకాల్‌ ప్రకారం ముందు వరుసలో వేదికపై కుర్చీ వేసినప్పటికీ, ఆయన హాజరుకాకపోవడంతో టీడీపీలో ఆందోళన మొదలైంది.
తగ్గేదే లేదు: ఎంపీ కేశినేని నాని
తిరువూరు సభపై ఎంపీ కేశినేని నాని స్పందిస్తూ తనకు ప్రోటోకాల్‌ ఇచ్చినట్లు బ్యానర్లు వేసుకుంటే సరిపోదని, గతంలో ఎందుకు ప్రోటోకాల్‌ పాటించలేదని ప్రశ్నించారు. రాజీనామాపై వెనక్కి తగ్గేదే లేదనీ స్పష్టంచేశారు. తన కార్యాలయంపై పార్టీ జెండాలు తీసేశానని, ఇక బోర్డులే తీయాల్సి ఉందని వెల్లడిరచారు. సాంకేతికంగా ఆలస్యమే తప్ప… రాజీనామాపై వెనక్కి తగ్గబోనని పునరుద్ఘాటించారు. తన చివరి శ్వాస వరకు విజయవాడ ప్రజల సేవకే అంకితమవుతానని వెల్లడిరచారు. తిరువూరు సభా నిర్వహణ కసరత్తుపై కేశినేని నాని, ఆయన సోదరుడు కేశినేని చిన్ని మధ్య వర్గవిబేధాలు తారాస్థాయికి చేరాయి. అప్పటి నుంచి రెండు రోజులగా ఆయన వార్తల్లోకి వస్తున్నారు. తిరువూరు సభకు రావొద్దంటూ కేశినేనిని టీడీపీ ముఖ్య నేతలు కలిసి చెప్పగా, ఆ కలయిక సారాంశాన్ని కేశినేని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. మరుసటి రోజు ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. దీంతో విజయవాడ టీడీపీలో గందరగోళం ఏర్పడింది. పార్లమెంట్‌ పరిధిలోని ఎంపీ అనుచరులు, ముఖ్యనేతలు ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇప్పటికే వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డితో ఆయన టచ్‌లో ఉన్నట్లు ప్రచారముంది. దీంతో ఆయన వైసీపీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ నాయకులతో ఎంపీకి సంబంధాలుండటంతో బీజేపీకి వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇవన్నీ కుదరకపోతే విజయవాడ ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా కేశినేని నాని, ఆయన అనుచరులు ఎమ్మెల్యే అభ్యర్థులుగా రంగంలోకి దిగనున్నట్లు ప్రచారముంది. మొత్తం మీద విజయవాడ ఎంపీ కేశినేని నాని వర్గం ఆ పార్టీపై తిరుగుబావుటా వేయడం, రాజీనామాలు చేసేందుకు నిర్ణయించడం వెరసి రాబోయే ఎన్నికల్లో టీడీపీకి భారీ నష్టం వాటిల్లుతుందన్న వాదన ఉంది.
రాజీనామా బాటలో కేశినేని శ్వేత?
ఎంపీ కేశినేని నాని తన కుమార్తెతోను పార్టీకి రాజీనామా చేయించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. కేశినేని శ్వేత గత విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 11వ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌ గా అభ్యర్థిగా గెలుపొందారు. అప్పట్లో టీడీపీ తరఫున ఆమెను మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించారు. టీడీపీకి తక్కువ స్థానాలు రావడంతో విజయవాడ మేయర్‌ పదవిని వైసీపీ చేజిక్కించుకుంది. మారిన పరిస్థితుల్లో శ్వేత తోపాటు పార్లమెంటు పరిధిలోని ఎంపీ అనుచరులంతా రాజీనామాలకు సిద్ధమైనట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img