Friday, June 14, 2024
Friday, June 14, 2024

పోలవరం కట్టేదీ మేమే.. అమరావతి నిర్మించేదీ మేమే.. : రేవంత్‌రెడ్డి

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సభల్లో పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలవం ప్రాజెక్టు, రాజధాని అమరావతి కట్టేది కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు. ఆ రెండింటినీ పూర్తిచేయడమే కాంగ్రెస్ విధానమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డికి ఎన్నారైలు ఆసక్తికర ప్రశ్నలు సంధించారు.దళితులు, ఆదివాసీలను ముఖ్యమంత్రిని కానివ్వరా? అన్న ప్రశ్నకు రేవంత్ స్పందిస్తూ.. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్‌లో లేదన్నారు. అవసరమైతే సీతక్కను పార్టీ ముఖ్యమంత్రిని కూడా చేస్తుందన్నారు. ప్రజల కోసం తాను ఏమైనా చేయాలని అనుకుంటున్నానని, వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. పార్టీని, తనను వేరు చేసి చూడొద్దని, తెలంగాణలో కాంగ్రెస్సే రేవంత్‌రెడ్డి, రేవంత్‌రెడ్డే కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img