Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

రాహుల్‌ గాంధీ మొత్తం ఆస్తి విలువ రూ.20 కోట్లు.. సొంత కారు కూడా లేదు..!

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వరుసగా రెండోసారీ కేరళ లోని వయనాడ్‌ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. సోదరి ప్రియాంక గాంధీతో కలిసి ర్యాలీగా వెళ్లి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి తన నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు రూ.20 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అందులో రూ.9.24 కోట్ల చరాస్తులు, రూ. 11.15 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌ లో పొందు పరిచారు.అయితే, రూ.20 కోట్ల నికర సంపద ఉన్నప్పటికీ ఆయనకు సొంత కారుగానీ, రెసిడెన్షియల్‌ ఫ్లాట్‌ కానీ లేకపోవడం గమనార్హం. రిటర్నింగ్‌ అధికారికి సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారం.. చరాస్తుల్లో రూ.4.33 కోట్లు బాండ్లు-షేర్ల రూపంలో, రూ.3.81 కోట్లు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఉన్నట్లు తెలిపారు. తన వద్ద రూ.55వేల నగదు, రూ.26.25లక్షల బ్యాంకు డిపాజిట్లు, రూ.15.21 లక్షల విలువైన గోల్డ్‌ బాండ్లు, రూ.4.20 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్లు వెల్లడించారు. స్థిరాస్తుల్లో ఢిల్లీలోని మెహరౌలి ప్రాంతంలో సోదరి ప్రియాంకగాంధీతో కలిసి వ్యవసాయభూమి ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవసాయ భూమి తనకు వారసత్వంగా వచ్చిందని రాహుల్ అఫిడవిట్‌లో వెల్లడించారు. దీంతోపాటుగా గురుగ్రామ్‌లో రూ. 9 కోట్లకుపైగా విలువైన ఆఫీస్ స్పేస్ ఉందని తెలిపారు. అదేవిధంగా తనపై ఉన్న క్రిమినల్‌ కేసులకు సంబంధించిన వివరాలను కూడా రాహుల్‌ అఫిడవిట్‌లో పొందుపరిచారు. ఇక 2022-23లో తన వార్షిక ఆదాయం రూ.కోటిగా ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img