భారత్, శ్రీలంకల మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదని.. నిజమేనని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్పష్టం చేసింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఐస్‌శాట్ ఉ 2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించి మ్యాప్‌ను విడుదల చేశారు. శ్రీలంకలోని మన్నార్ దీవిని కలుపుతూ సముద్రంలో ఉన్న వంతెన నిర్మాణ తీరుపై పరిశోధకులు కొత్త విషయాలు కనుగొన్నారు. భారత్, శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29 కి.మీ. మేర ఉంది. దీని ఎత్తు సముద్రగర్భం నుంచి 8 మీటర్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోడి నుంచి శ్రీలంక మన్నారు ద్వీపంలోని తలైమన్నార్ వాయవ్య దిశ వరకు విస్తరించి ఉంది. దీనిని సున్నపురాతితో నిర్మించినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఈ వంతెన 99.98 శాతం నీటిలో మునిగిందని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ వంతెనకు సంబంధించిన ఫొటోలను ఇస్రో తాజాగా విడుదల చేసింది. ఇస్రో రూపొందించిన పది మీటర్ల మ్యాప్‌లో మొత్తం వంతెన కనిపిస్తుండడం విశేషం. అయితే, క్రీస్తుశకం 9వ శతాబ్దం వరకు పర్షియన్లు ఈ వంతెనను ాసేతు బంధై్ణ గా పిలుస్తుండేవారు. రామేశ్వరం ఆలయ రికార్డుల ప్రకారం ఈ వంతెన 1480 వరకు తుఫానులతో ధ్వంసమైంది. అంతకు ముందు సముద్రమట్టానికి పైనే ఉండేది.