Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రాయలసీమ ద్రోహి జగన్‌

. రోడ్డుకు మట్టి వేయలేనివాడు మూడు రాజధానులు కడతాడంటా…!
. కర్నూలుకు న్యాయ రాజధాని వచ్చిందా?
. పరదాల మాటు తిరగడం కాదు
. ధైర్యం ఉంటే నందికొట్కూరుకు రా చర్చిద్దాం
. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

విశాలాంధ్ర – నందికొట్కూరు: రాయలసీమలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ.12 వేల కోట్లు టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేస్తే, వైసీపీ ప్రభుత్వం రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, రాయలసీమ ద్రోహి జగన్‌మోహన్‌రెడ్డి అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మంగళ వారం నంద్యాల జిల్లా నంది కొట్కూరులో సాగునీటిపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా ఆయన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని సందర్శించేందుకు వచ్చారు. ఈ సంద ర్భంగా నందికొట్కూరులోని పటేల్‌ సెంటర్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిం చారు. 1983లో ఎన్‌టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తరువాతనే సీమ దశ మారిందన్నారు. ఎస్‌ఆర్‌బీసీ తీసుకువచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేసిన ఘనుడు ఎన్టీఆర్‌ అన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ.68 వేల కోట్లు ఖర్చు చేశామని, వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగు న్నర సంవత్సరాలలో రూ.22 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. రాయలసీమలో రూ.12 వేల కోట్లు ఖర్చు చేయడమే కాకుండా వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులు పనులు ప్రారంభోత్సవానికి నాంది పలికామని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పనులు నిలుపుదల చేశారన్నారు. ఈ సైకో అలగనూరు ప్రాజెక్టుకు నీళ్లు లేకుండా చేశా డని ఆరోపించారు. ఒక్క డీఎస్సీ లేదని, జాబ్‌ క్యాలెండర్‌ లేదని, యువతకు ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు లేవని ధ్వజమెత్తారు. ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయ న్నారు. కర్నూలు నుంచి నందికొట్కూరు రోడ్డు ఎలా ఉందో మీరు చూస్తు న్నారు. రోడ్డుకు మట్టి వేయలేని సైకో మూడు రాజధానులు కడతాడంటా అని ఎద్దేవా చేశారు. మన రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉంది. కర్నూలుకు న్యాయ రాజధాని వచ్చిందా అని ప్రజలను ప్రశ్నించారు. రూ.90 కోట్లతో ఓర్వకల్లు విమానాశ్రయాన్ని తాను నిర్మించి ప్రారంభిస్తే ఆయన మరలా రాయి వేసుకున్నారని ఆరోపిం చారు. నందికొట్కూరు నియోజకవర్గం అభివృద్ధికి రూ.1,250 కోట్లు ఖర్చు చేశామన్నారు. పరదాల మాటున తిరగడం కాదు… నీకు ధైర్యం ఉంటే నందికొట్కూరు రా అభివృద్ధిపై చర్చించుకుం దాం అని సవాలు విసిరారు. నందికొట్కూరులో ఒక నాయకుడు రూ.5 లక్షకు ఒక ఎకరా కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలకు రూ.60 లక్షలకు అమ్ము కున్నా రని ఆరోపించారు. నీ రౌడీయిజం నా దగ్గర సాగదు, ఖబడ్దార్‌ జాగ్రత్తా అని నందికొట్కూరుకు చెందిన వైసీపీ యువనేతను హెచ్చ రించారు. అలగనూరు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు రూ.110 కోట్లు ఖర్చు చేస్తే, ఇంతవరకు మంచినీరు ఇవ్వలేదని తెలిపారు. ఎనిమిది సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తానని, మద్యం ధరలు తగ్గించడమే కాకుండా నాణ్యమైన మందు అందిస్తానన్నారు. అమ్మకు వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ అమ్మఒడి అందిస్తామమని, ఉచితంగా సంవత్సరంలో మూడు గ్యాస్‌ సిలిండర్లను అందచేస్తామని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బీసీ సోదరుల రక్షణ చట్టం, ప్రత్యేక బడ్జెట్‌, నెలనెలా మహిళలకు రూ.1,500 నగదు అందజేస్తానని చంద్రబాబు చెప్పారు. పోలవరం పూర్తి చేస్తానని చెప్పారు. సాగునీటిపై యుద్ధభేరి కార్యక్రమం నందికొట్కూరులో ప్రారంభమై శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వరకు సుమారు 2,500 కిలోమీటర్లు ఈ యాత్ర ఉంటుందని అన్నారు. నందికొట్కూరులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మాండ్ర శివానంద రెడ్డి, బాబు దృష్టికి తీసుకురాగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు బీటీ నాయుడు, మల్లెల రాజశేఖర్‌గౌడ్‌, మాజీ మంత్రులు భూమా అఖిలప్రియ, ఏరాసు ప్రతాపరెడ్డి, బీసీ జనార్థనరెడ్డి, ఇన్‌ఛార్జ్‌లు తిక్కారెడ్డి, గౌరు చరితారెడ్డి, గౌరు వెంకట రెడ్డి, మీనాక్షినాయుడు, భూమా బ్రహ్మనందరెడ్డి, కేఈ శ్యాంబాబు, ధర్మారం సుబ్బారెడ్డి, జగత్‌విఖ్యాతరెడ్డి, ఆకే ప్రభాకర్‌, చిన్న వెంకటస్వామి, పెద్దఎత్తున టీడీపీ శ్రేణులు, నాయకులు తరలివచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img