Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

సీఎం రేవంత్​ను కలిసిన రోహిత్ వేముల తల్లి..

తెలంగాణ పోలీసులు రోహిత్ వేముల ఎస్సీ కాదని.. ఫేక్ సర్టిఫికేట్ కారణంతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని ఈ కేసును క్లోజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై రోహిత్ వేముల తల్లి రాధిక వేముల ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని, సమగ్ర విచారణ జరిపించాలని సీఎంకు వినతి పత్రం ఇచ్చారు. కాగా ఈ కేసును రీఓపెన్ చేశామని.. కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీంతో ఈ కేసును రీ ఓపెన్ చేసినందుకు రాధిక వేముల సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img